తెలుగు న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్

tv channels ratings
Spread the love

బార్క్ రేటింగ్స్ లో పెద్ద‌గా మార్పులు క‌నిపించ‌డం లేదు. తెలుగు న్యూస్ చానెళ్ల‌కు డ్ర‌గ్స్ విచార‌ణ కూడా పెద్ద‌గా తోడ్ప‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. నిండా 400 రేటింగ్ పాయింట్లు కూడా సంపాదించ‌లేక తెలుగు న్యూస్ చానెళ్లు ఉసూరుమ‌నిపిస్తున్నాయి. ఎంట‌ర్టైన్మెంట్ విభాగంలో ఒక్క బిగ్ బాస్ కార్య‌క్ర‌మం సంపాదించిన రేటింగ్ లో ప‌దో వంతు కూడా మొత్తం న్యూస్ చానెళ్ల‌కు ద‌క్కిన‌ట్టు క‌నిపించ‌డం లేదంటే వాస్త‌వ స్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

ఆ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి తాజా రేటింగ్స్ ప‌రిశీలిస్తే టీవీ9 టాప్ లో కొన‌సాగుతోంది. ఎన్టీవీ రెండులో ఉండ‌గా, ఏబీఎన్ మూడోస్థానం నిల‌బెట్టుకుంది. టీవీ5, 10టీవీ కూడా త‌మ త‌మ స్థానాల్లో య‌ధావిధిగా ఉన్నాయి. వాటికి స‌మీపంలోనే వీ6, సాక్షి టీవీ కూడా క‌నిపిస్తున్నాయి.

తాజా రేటింగ్స్ వివ‌రాలు

Total AP+TS, TG:15+,
Wk30/Wk29
All News Channels GRPs – 413.2/431.2

1. టీవీ9 – 71.7
2. ఎన్టీవీ – 58.7
3. ఏబీఎన్ – 51.6
4. టీవీ5 – 47.9
5. 10టీవీ – 36
6. వీ6 – 35.2
7. సాక్షి టీవీ – 34.9
8. టీ న్యూస్ – 31.9
9. ఈటీవీ ఏపీ – 14.1
10. ఈటీవీ తెలంగాణా – 8.7
11. హెచ్ ఎం టీవీ – 5.9
12. ఐ న్యూస్ – 5.6
13. జెమినీ న్యూస్ – 5
14. స్టూడియో ఎన్ – 3.9
15. జై తెలంగాణా టీవీ- 2.3






Related News

NDTV

ఎన్డీటీవీ కేసు కొట్టివేత

Spread the loveషేర్‌ హోల్డర్ల వివరాలు వెల్లడించడంలో ఎన్‌డిటివి ప్రమోటర్లు జాప్యం చేశారనే ఆరోపణలపై న్యూఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌ (ఎన్‌డిటివి)Read More

download

హాత్ వే తో యూప్ టీవీ

Spread the love భారతదేశంలో అతి పెద్ద కేబుల్ బ్రాండ్ ప్రొవైడర్ హాత్వే , ప్రపంచంలో అత పెద్ద ఓవర్Read More

  • మీడియా కట్టడికి కొత్త చట్టాలు
  • హాన్స్ ఇండియా నుంచి ఆయన అవుట్
  • అయ్యో…ఈనాడుకి స్పీకర్ కొడుకు తెలియదట!
  • ఆ టీవీ చానెల్ ఆస్తులు ఎటాచ్ మెంట్
  • తెలుగు పత్రికలు తీరు అంతేనయా
  • కాషాయ ఈనాడు…
  • ‘జీ’ చేతికి మరో రెండు చానెళ్లు
  • మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులు
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *