Main Menu

ఆమెను మీడియా వాడుకుందా…?

Spread the love

ఇదే చ‌ర్చ సాగుతోంది. ఏపీ అంత‌టా ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం చెల‌రేగుతోంది. తెలంగాణాలో కూడా బీజేపీ, కాంగ్రెస్ కి వ్య‌తిరేకంగా కేసీఆర్ పావులు క‌దుపుతున్నారు. ఫ్రంట్ పెడ‌తామ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయంగా జ‌నం దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి మీడియాలో ఓ సెక్ష‌న్ పెద్ద స్థాయిలో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్య‌వ‌హారంలో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటాన్ని సాధ‌నంగా మ‌ల‌చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. పిల్మ్ ఛాంబ‌ర్ ముందు బ‌ట్ట‌లు విప్పి నిర‌స‌న తెలిపిన శ్రీరెడ్డికి ఓ మీడియా సంస్థ ప్ర‌తినిధులు అండ‌గా నిల‌వ‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని టాలీవుడ్ పెద్ద‌లు భావిస్తున్నారు. మహా టీవీలో ఈ నిర‌స‌న‌కు సంబంధించిన ప్ర‌చారం విస్తృతంగా సాగిన విష‌యం. ఆ త‌ర్వాత ఇదే అంశంపై ప‌దే ప‌దే చ‌ర్చ‌లు సాగిన విష‌యం కూడా ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు.

అయితే శ్రీరెడ్డి మ‌రో అడుగు ముందుకేసి ప్ర‌ముఖ నిర్మాత డి రామ‌నాయుడు మ‌న‌వ‌డు, సురేష్ బాబు త‌న‌యుడు. ద‌గ్గుబాటి రానా సోద‌రుడు అభిరామ్ బండారం బ‌య‌ట‌పెట్టింది. దాంతో ఇది మీడియాకు మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారిపోయింది. అభిరామ్ కి సంబంధించిన ఫోటోలు, ఇత‌ర వ్య‌వహారాల‌ను శ్రీరెడ్డి బ‌య‌ట‌కు తీసుకురాగానే వాటిని ప్ర‌సారం చేయ‌డంలో కొంద‌రు సైలెంట్ అయిపోయారు. మ‌రికొంద‌రు అర‌కొర‌గా మాత్ర‌మే ప్ర‌సారాలు సాగించారు. అభిరామ్ నేప‌థ్యాన్ని దాచేసి చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించారు. చివ‌ర‌కు ప్ర‌ధాన ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు ఆపేశారు. నేష‌న‌ల్ మీడియా, న్యూయార్క్ టైమ్స్ వంటి వారు ఈ నిర‌స‌న‌ను క‌వ‌ర్ చేసినా తెలుగు మీడియాలో ఓ సెక్ష‌న్ మాత్రం అర‌కొర స‌మాచారంతో స‌రిపెట్టింది.

అభిరామ్ కి సంబంధించిన అనేక విష‌యాల‌ను శ్రీరెడ్డి బ‌య‌ట‌పెట్టింది. ముఖ్యంగా రామానాయుడు స్టూడియోలో అనేక‌మంది ఆడ‌పిల్ల‌ల మానాలు న‌లిగిపోయాయ‌ని, అభిరామ్ ని నిర్భ‌య చ‌ట్టం కింద అరెస్ట్ చేయాల‌ని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది. అంతేగాకుండా ద‌గ్గుబాటి అభిరామ్ అనేక మంది అమ్మాయిల‌నే కాకుండా సోనా అనే ట్రాన్స్ జెండ‌ర్ ని సైతం వ‌దిలిపెట్ట‌ని కామాంధుడు అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేసింది. అయినా మీడియా మాత్రం క‌త్తి మ‌హేష్, కోన వెంక‌ట్ గురించి చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త అభిరామ్ విష‌యంలో మాత్రం చూపించ‌లేదు. చివ‌ర‌కు టీఆర్పీల కోసం త‌న త‌ల్లిని కూడా వివాదంలో కి లాగుతున్నారంటూ శ్రీరెడ్డి టీవీ9 చానెల్ మీద కామెంట్ చేసే ప‌రిస్థితి వ‌చ్చిందంటే ఆశ్చ‌ర్చ‌పోవాల్సిన ప‌నిలేదు. మొత్తంగా ఏపీలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ఊపందుకుంటున్న ద‌శ‌లో ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి ఉప‌యోగించుకున్న అంశంలో శ్రీరెడ్డి పావుగా మారింద‌నే అభిప్రాయం సోష‌ల్ మీడియాలో చాలామందిని వ‌చ్చింది. కానీ మా నాయ‌క‌త్వంలో ఉన్న శివాజీరాజా వంటి వారి పేర్లు, వాకాడ అప్పారావు వ్య‌వ‌హారం స‌హా అనేకం ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌ప‌డ‌డం మాత్రం ఆశావాహంగా చెప్పాల్సి ఉంటుంది.


Related News

మీడియా య‌జ‌మానుల రెండు నాలుక‌ల ధోర‌ణి

Spread the loveతెలుగు ప‌త్రిక‌లు మూకుమ్మ‌డి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా అన్ని ప‌త్రిక‌లు ధ‌ర‌లు పెంచేశాయి. తొలుత ఈనాడుRead More

వైసీపీని క‌ట్ట‌డి చేసే వ్యూహంలో టీడీపీ అడుగులు

Spread the loveప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలో టీడీపీదే ఆధిప‌త్యం.ఇ టీవ‌ల కొన్ని చానెళ్ల‌లో మార్పులు సంభ‌వించినా తెలుగుదేశానికి పెద్ద‌గా ఢోకాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *