యూ ట్యూబ్ చానెళ్లపై నిఘా?

nexus2cee_youtube-share-728x408
Spread the love

ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా రకరకాల చానెల్ పేరుతో లోగోలు దర్శనమిస్తున్నాయి. శాటిలైట్ చానెల్స్ కంటే యూ ట్యూబ్ చానెల్స్ సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. అనుమతులతో పని లేదు. చానెల్ వాస్తుందా రాదా అనవసరం. చేతిలో లోగో ఉంటే చాలు చానెల్ ప్రతినిధి కింద లెక్కే. చాలా మంది ద్వితీయ శ్రేణి నేతలకు, ప్రభుత్వ అధికారులకు సమాన్య ప్రజలకు అవి చానెల్సో కాదో తెలియని పరిస్ధితి. దీంతో ఎవరికి వారే సొంత చానెల్ పెట్టుకుని తామె చానెల్ ఓనర్ లా ఫీలవుతున్నారు. మామూలు నగరాల్లో ఐతే పరవాలేదు. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో ఇంటిలిజెన్స్ విభాగానికి ఈ యూ ట్యూబ్ చానెల్స్ సవాలు విసురుతున్నాయి. ముఖ్యంగా సంఘ విద్రోహ శక్తులు, వారితో సంబంధం ఉన్న వారు సైతం మీడియా ముసుగును కప్పుకోవడానికి యూ ట్యూబ్ చానెల్స్ ను ఆయుధంగా మలచుకుంటున్నారు. ఏదో ఒక పేరుతో చానెల్ ను పెట్టి…రిపోర్టర్లుగా చలామణి అవుతున్నారు.

ఇప్పటికిప్పుడు వీరి వల్ల ప్రమాదం లేకపోయినా ఎప్పుడైనా అది జరగవచ్చని ఇంటిలిజెన్స్ హెచ్చరిస్తోంది. డబ్బుకు ఆశపడి ఎవరైనా తీవ్రవాదులకు అమ్ముడు పోతే పెను విధ్వంసం జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కీలకమైన నేతలను, కీలకమైన స్ధావరాలను కీలక సమాచారాన్ని తస్కరించడానికి యూ ట్యూబ్ చానెల్ ప్రతినిధులను ఉపయోగించుకునే అవకాశం ఉందనేది ఈ హెచ్చరికల సారాంశంగా తెలుస్తోంది. దీంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కచ్చితమైన ఆదేశాలను జారీ చేసింది.

అక్రిడేటెడ్ జర్నలిస్టులను గుర్తించి మిగిలిన వారి విషయంలో ముఖ్యంగా యూ ట్యూబ్ చానెల్స్ విషయంలో నిర్మొహమాటంగా వ్యవహరించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు వీటిపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే యూ ట్యూబ్ లో పాపులరైన చానెల్స్ కాకుండా…కేవలం చానెల్ పేరుతో లోగోలు పట్టుకుని తిరుగుతున్న వారి వ్యక్తి గత సమాచారాన్ని వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించాలని కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. నేర ప్రవృత్తి, నేర చరిత కలిగిన వారు ఎవరైనా యూ ట్యూబ్ చానెల్ పేరుతో లోగోలు పట్టుకుని తిరగడం వంటి పనులకు పాల్పడితే అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించినట్టు ప్రచారం సాగుతోంది.

అయితే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అటు ఇంటిలిజెన్స్ వర్గాలు గానీ, ఇటు సమాచార శాఖ గానీ నిర్థారించకపోవడం విశేషం.


Related News

abn-tv9-banned-telangana

టీవీ9 రాజేస్తే ..ఏబీఎన్ పరిష్కరించిందా?

Spread the love1Shareతెలుగు మీడియా పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ముఖ్యంగా టీవీ9 మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత కనిపించింది.Read More

nexus2cee_youtube-share-728x408

యూట్యూబ్ రూల్స్ మార్చేసింది…

Spread the loveఇవాళ , రేపు యూ ట్యూబ్ చానెల్స్ పెట్టడం చాలా సాధారణంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరూ ఓRead More

 • అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్
 • ‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?
 • గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని
 • తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్
 • ఇంగ్లీష్ చానెల్ తో టీవీ5 టైఅప్
 • వైసీపీ పరువు తీస్తున్న సోషల్ మీడియా
 • సోషల్ మీడియా సాయంతో ముంచేసింది…
 • ‘తెలుగు’ సభల్లో ఈనాడు సొంత డబ్బా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *