అభాసుపాల‌యిన మీడియా

28278984_1619226631495281_8195668883192788992_n
Spread the love

మీడియా వికృత పోక‌డ‌లు, వింత చేష్ట‌లు సోష‌ల్ మీడియా సెటైర్ల‌కు సాధ‌నం అవుతున్నాయి. శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత మారుతున్న ప‌రిణామాల‌న్నింటినీ రేటింగ్ వేట‌లో ఉప‌యోగించుకోవ‌డానికి ప్ర‌యాస‌ప‌డుతున్న తీరు అభాసుపాల‌వుతోంది. ఇప్ప‌టికే అనేక‌మార్లు ఇదే ధోర‌ణి కొన‌సాగినా ఇప్పుడు విప‌రీత స్థాయికి చేరింద‌నే వారు పెరుగుతున్నారు. మీడియా తీరు మీద తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు.

ఇక మ‌హాటీవీలో ఓ విలేక‌రి బాత్ ట‌బ్ లో ప‌డుకుని పీటూసీ చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌డం విస్మ‌క‌రంగా మారింది. విస్తృతంగా వైర‌ల్ అవుతోంది. మీడియా ఓవ‌రాక్ష‌న్ అనడానికి ఇదో ప‌రాకాష్ట‌గా చెబుతున్నారు. బాత్ ట‌బ్ లో జారిప‌డి శ్రీదేవి మ‌ర‌ణించింది కాబ‌ట్టి, బాత్ ట‌బ్ వాడి వార్త ప్ర‌సారం చేస్తున్న స‌ద‌రు చానెల్ వారు, లారీ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారి గురించి లారీ కింద ప‌డుకుని చెబుతారా…ఉరి వేసుకుంటే తాడు బిగించుకుని చెబుతారా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం ప‌లు విమ‌ర్శ‌ల‌కు దారితీస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

28279395_1928444253874769_4501715770376038987_n

టీవీ99 కూడా దానికి త‌గ్గ‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించింది. ఒక్క‌డ ఓ మ‌హిళా యాంక‌ర్ బాత్ ట‌బ్ పై కూర్చుని వార్త‌లు అందించ‌డం విస్మ‌య‌క‌రంగా మారింది. అయితే ఇదంతా వీళ్ల సొంత అవిడియా కాద‌ని, ఇంగ్లీష్ చానెళ్లు కొన్ని ఓ అడుగు వేస్తే, వీళ్లు మ‌రో అడుగు ముందేకేసిన కాపీ జ‌ర్న‌లిజానికి నిలువుట‌ద్ద‌మ‌ని కొంద‌రి అభిప్రాయం.

ఇదే సంద‌ర్భంలో టీవీ9 మీద కూడా విమ‌ర్శ‌లు ఎక్కు పెడుతున్నారు. స్టూడియో లో కూర్చుని విచార‌ణాధికారులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ మండిప‌డుతున్నారు. ఏపీలో ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని చ‌ల్లార్చ‌డానికే శ్రీదేవి మ‌ర‌ణాన్ని పావుగా వాడుకుంటున్నార‌నే వాద‌న పెరుగుతోంది. మొత్తంగా కార‌ణాలేమ‌యినా ఓ చావు వార్త‌ను ప్ర‌సారం చేయ‌డంలో ఎల‌క్ట్రానిక్ మీడియా ఇంకా పాఠాలు నేర్చుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. పోటీ ప‌డి మ‌రీ రాస్తున్న రాత‌లు, కూస్తున్న కూత‌లు చాలామందిని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న‌ట్టు ఉంది. చివ‌ర‌కు ఆమె చావు ..జ‌నం చావుకొచ్చింద‌నే వారు పెరుగుతున్నారు.


Related News

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the love6Sharesజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

NDTV

మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా

Spread the love2Sharesదేశంలోనే ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ‌కు జ‌రిమానా విధించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే దానికి కార‌ణంగా చెబుతున్నారు. అయితేRead More

 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *