Main Menu

సాక్షి చెమటోడ్చింది..

Spread the love

దేశాన్ని ముంచి దర్జాగా విదేశాలకు పారిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలువురు మోసగాళ్లు నిర్భీతిగా విదేశాలకు వెళ్లిపోయారు. ఐపీఎల్ కుంబకోణానికి సూత్రధారి లలిత్ మోడీ తొలుత ఏకంగా విదేశాంగమంత్రి సహకారంతో దేశం దాటిపోయాడు. దానికి మానవత్వంతో భార్య కోసం వీసా ఇప్పించానని సుష్మా స్వరాజ్ ప్రకటించారు కూడా.

ఆ తర్వాత విజయ్ మాల్యా మరీ చిత్రంగా వెళ్లాడు. లుక్ అవుట్ నోటీస్ కేంద్రం ఉపసంహరించుకోవడం, ఆ తర్వాత ఆయన పదవీకాలం ముగిసిపోవడం, ఆ వెంటనే ఆయన లండన్ పోయి, అక్కడి నుంచి దేశీయ వ్యవస్థలను ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏకంగా 9వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టి, దేశం నుంచి వెళ్లిపోయినా సర్కారు పెద్దగా స్పందిస్తున్న దాఖలాలు లేవు.

ఇక తాజాగా నీరవ్ మోడీ. రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీకి బంధువు కూడా. దాంతోనే ఈ వజ్రాల వ్యాపారికి పంజాబ్ సిండికేట్ బ్యాంక్ గ్యారంటీగా నిలిచింది. దానిని చూపించి ఏకంగా 11వేల 500 కోట్లు మింగి, ఈ ఏడాది జనవరి 1న స్విట్జర్ లాండ్ పారిపోయాడు. ఆ తర్వాత జనవరి 23న మోడీ తో కలిసి దావోస్ లో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత అన్నీ ముగిసిన తర్వాత కళ్లు తెరిచిన దర్యాప్తు సంస్థలు..ఇంకా చెప్పాలంటే అప్పుడు మాత్రమే అధినేతల నుంచి ఆదేశాలు అందడంతో రంగంలో దిగి సోదాలు నిర్వహించాయి. సుమారు 5వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సీజ్ చేసినట్టు ప్రకటించాయి.

ఈ వార్తను సాక్షి పేపర్ బీజేపీకి కష్టం రాకుండా, మోడీకి నష్టం కలగకుండా చేయడానికి చాలా చెమటోడ్చింది. అందుకోసమే ఏకంగా పరారయిన వ్యక్తి, ఏకంగా ప్రధానమంత్రితో భేటీ అయిన విషయం పక్కన పెట్టి, 5వేల కోట్ల రూపాయల ఆస్తుల సీజ్ చేయడమే ఘనతగా హెడ్డింగ్ లో చూపించింది. ఈనాడులో అయితే ముందే పరారయినట్టు చెప్పింది. అదే సమయంలో పరారయిన వ్యక్తితో ప్రధానమంత్రి భేటీ గురించి సన్నాయి నొక్కులు నొక్కింది. జ్యోతి తీరు కొంత స్పష్టంగా ఉంది. కానీ పరారయిన వ్యక్తి తో ప్రధాని భేటీ కావడం, దాని పర్యావసనాలు అందరికీ తెలిసినవే. ఇక రాజకీయంగా తెలుగుదేశం, బీజేపీ మధ్య పెరుగుతున్న గ్యాప్ ని ఆంధ్రజ్యోతి ప్రస్ఫుటించింది. అదే సమయంలో సాక్షి కథనం ద్వారా బీజేపీకి బాగా దగ్గర కావడానికి జగన్ ఎంతగా తపన పడుతున్నాడో అర్థం అవుతోంది. ఏమయినా దేశాన్ని దోచుకుని, దర్జాగా దాాటేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నప్పటికీ పత్రికాయజమానులకు తమ ప్రయోజనాలు తప్ప దేశ ప్రజల సొమ్ము గురించి పెద్దగా తపన కనిపించడం లేదని స్పష్టం అయ్యింది.


Related News

మీటూ ఎఫెక్ట్: ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌పై వేటు

Spread the loveమాజీ పత్రికా సంపాదకులు ఎంజె అక్బర్‌, తరుణ్‌ తేజ్‌పాల్‌ను బుధవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ)Read More

చ‌ర్చ‌నీయాంశంగా మారిన టీవీ9 స‌ర్వే

Spread the loveప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరులో ప్ర‌తీ అవ‌కాశం కూడా వినియోగించుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మీడియా అందుకు తందానRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *