జగన్ పరువు తీస్తున్నారు..

27332177_1592730197478258_4761456287157393229_n
Spread the love

మీడియా యజమానిగా ఉండి, రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం కోసం ఆరాటపడుతున్న నాయకుడు వైఎస్ జగన్. దాంతో సాక్షి మీడియా తీరు మీద చాలాకాలంగా విమర్శలు వస్తుంటాయి. జగన్ స్వరం వినిపించే వేదికగా సాక్షిని అంతా భావిస్తారు. దానికి తగ్గట్టుగానే సాక్షి లేకపోతే ప్రతిపక్షం వాయిస్ కూడా వినిపించగలిగే పరిస్థితి ఉండేది కాదని పలువురు చెబుతుంటారు.

అయితే గడిచిన కొద్దిరోజులుగా బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు బలపడుతున్న విషయం ఎవరూ కాదనలేరు. దానికి తగ్గట్టుగానే సాక్షి తీరు కనిపిస్తుంది. ఎడిటోరియల్ బోర్డ్ డైరెక్టర్ గా ఉన్న రామచంద్రమూర్తి ఎడిటోరియల్ పేజీ రాతల్లో మోడీని కీర్తిస్తుండడం ఇటీవల మొదలయ్యింది. చివరకు తాజాగా బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తీవ్రంగా నిరసిస్తుండగా జగన్ పత్రిక, చానెల్ మాత్రం దానిని కీర్తించడం విశేషంగా మారింది. బీజేపీని మోయడానికి అలవాటుపడిన సంస్థగా సాక్షి మారడం విశేషంగా కనిపిస్తోంది. మొన్నటి వరకూ ఈ పని ఆంధ్రజ్యోతి చేసేది. కానీ టీడీపీతో వ్యవహారం తేడా వచ్చిన తర్వాత వారు వీరయ్యారు. ఇప్పుడు సాక్షి వత్తాసుపలకడం చివరకు వైసీపీ శ్రేణులను కూడా విస్మయపరుస్తోంది.

వాస్తవానికి బడ్జెట్ కి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు రోడ్డెక్కాయి. విశాఖ రైల్వేజోన్ విషయంలో కేంద్రం తీరుకి నిరసనగా ఆందోళనలు కూడా చేశాయి. కానీ సాక్షిలో మాత్రం ఏదో ఉద్దరించారని చెప్పడానికి ప్రయత్నించడం జగన్ పరువు తీసినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ భజన చేయవచ్చు గానీ మరీ ఇంతగా పాకులాడాలా అన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఇప్పటికే జగన్ వ్యవహారం మీద ఓ సెక్షన్ లో అనుమానాలు పెరుగుతుండగా, పడిపోతున్న బీజేపీ గ్రాఫ్ ని కాపాడే పనిలో పడిన సాక్షి సంస్థలు అలాంటి సందేహాలు మరింత పెంచేలా వ్యవహరిస్తున్నాయని అంతా భావిస్తున్నారు. వైసీపీ శ్రేణులకు కూడా మింగుడుపడని రీతిలో సాక్షి తీరు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తాజాగా బడ్జెట్ విషయంలో ఆంద్రజ్యోతి భిన్నస్వరం వినిపించగా, ఈనాడు, సాక్షి మాత్రం దాదాపుగా ఒకే రీతిలో వ్యవహరించడం విశేషంగా మారింది. జగన్ కి బలంగా ఉండాలనుకున్న సాక్షి బరువుగా మారే పరిస్థితులు వస్తే మాత్రం ఆశ్చర్యపడక తప్పదు.


Related News

media

తెలుగు మీడియా కళ్లు తెరవదా?

Spread the loveఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోRead More

whatsapp fb

ఎఫ్ బీ, గూగుల్ కి నోటీసులు

Spread the loveప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలే కాదు డిజిటల్ మీడియాలో కూడా నిబంధనలు పాటించాల్సిందే. దానికి భిన్నంగా సాగితేRead More

 • మీడియా విషయంలో మనసు మార్చుకున్న జనసేన
 • చంద్రబాబు దొరికిపోయారు..
 • మహిళా జర్నలిస్టుపై వేధింపులు
 • ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?
 • అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌
 • మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?
 • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
 • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *