సాక్షి చేసింది..చేయాల్సింది..!!

అధికారం అండతో ప్రవేశించింది. ఆ వెంటనే ఆటంకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక ఒడిదుడుకులు చవి చూసింది. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్ష పార్టీకి బలమైన స్వరంగా మారింది. పాలకపక్షం మీద నిత్యం విమర్శనాత్మక కథనాలతో, విశ్లేషణలతో సాగుతోంది. పలు అవినీతి కుంభకోణాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అనేక అక్రమాలను బయటపెట్టింది. పలువురి బండారాన్ని బట్టబయలు చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని ప్రపంచానికి చాటింది. మీడియా అంతా ఓవర్గానికి సానుకూలంగా వ్యవహరిస్తున్న సమయంలో ఒంటరిగానే ముందుకు సాగింది. చివరకు అధికార పార్టీ కార్యక్రమాల్లో నిషేధాన్ని చవిచూసింది. అంతటితో ఆగకుండా ఆస్తుల అటాచ్ మెంట్ నుంచి మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారన్న ప్రచారాన్ని కూడా ఎదుర్కొంది. రాబోయే నెలలోనే సాక్షిని స్వాధీనం చేసుకుంటామని ఏపీ ప్రభుత్వం ప్రకటించే వరకూ వెళ్లింది. అయినా నిలదొక్కుకుని జగన్ గొంతుగా, జనం సమస్యలను కొంతవరకూ వినిపించడంలో విజయవంతం అవుతోంది. ఆ క్రమంలో పదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంది.
సాక్షి రాక తెలుగుమీడియాలో ఓ చరిత్ర. అప్పటికే ఉదయం. వార్త ప్రయోగాలు విఫలమయ్యాయి. విఫలం అనడం కంటే విజయాన్ని నిలబెట్టుకోవడంలో ఆ రెండు సంస్థలు విజయవంతం కాలేక చతికిలపడ్డాయి. దాంతో అనివార్యంగా తనకో మీడియా సంస్థ అవసరమని భావించిన నాటి సీఎం వైఎస్ మానసపుత్రికగా సాక్షి అడుగులు పడ్డాయి. ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు, జ్యోతి మీద పదే పదే విరుచుకుపడిన వైఎస్ వాటికి విరుగుడుగా సాక్షిని తెచ్చారు. జనంలోకి చొచ్చుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు చేశారు. పూర్తికలర్, తక్కువ ధర సహా అనేక ప్రయత్నాలు చేసి ఆఖరికి రెండో స్థానం వరకూ రాగలిగారు. కాంగ్రెస్ కి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్న జగన్ కి బలమైన ఆయుధంగా సాక్షి నిలిచింది. చివరకు ఐదేళ్ల ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో సాగుతున్న జగన్ కి సాక్షి లేకపోతే ఏమవునో అనే చర్చ సాగుతోంది. తద్వారా సాక్షి తన పాత్రను నిర్వహించడంలో కొంతవరకూ విజయవంతం అయ్యింది. అదే క్రమంలో మీడియాలో సిబ్బంది వేతనాల పెంపుదుల, పరిస్థితులు మెరుగుదల సహా కొంత సానుకూల పరిణామాలకు సాక్షి అవకాశం కల్పించింది.
కానీ సాక్షి పదేళ్ల ప్రస్థానంపై పెదవి విరిచే వాళ్లూ కూడా ఉన్నారు. జగన్ విషయంలో సాక్షి చేయాల్సినంత చేయలేకపోతోందనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఒకదశలో దాదాపుగా ఈనాడుని ఢీకొట్టిన సాక్షి ఇప్పుడు రెండోస్థానంతో సంతృప్తి పడాల్సిన స్థితికి రావడం మీద కూడా చాలామందికి భిన్నాభిప్రాయాలున్నాయి. ఇక చంద్రబాబు సర్కారు తీరుని ఎండగట్టడంలో ఇంకా సమర్థవంతంగా వ్యవహరించి ఉండాల్సిందనే వాళ్లు కూడా ఉన్నారు. వాటితో పాటు సాక్షి సిబ్బందికి తొలినాళ్లలో లభించిన అనేక సదుపాయాలు క్రమంగా దూరం కావడం కూడా గమనార్హం. మొత్తంగా మరకలు కొన్ని ఉన్నా పలు మెరుపులతో సాక్షి ప్రస్థానం సాగుతోంది. పదేళ్ల పండుగ జరుపుకుంటోంది. గతంలో పలు సంస్థల అనుభవాలను గమనంలో ఉంచుకుని మీడియా పూర్తిగా ఒక వర్గం చేతిలోనే కాకుండా, మరింత ప్రజాస్వామ్యీకరించడానికి తగ్గట్టుగా సాక్షి ప్రస్థానం కొనసాగాలని ఆశిద్దాం…చేసింది గోరంత..చేయాల్సింది కొండంత అన్న చందంగా ఆ పత్రిక ఒక పార్టీ వాయిస్ కే పరిమితం అయినప్పటికీ మరింత ప్రజాసానుకూల ధోరణితో సాగాలని కోరకుందా..
Related News

ఆ చానెల్ ని కూడా వదిలిపెట్టని పవన్ కళ్యాణ్
Spread the loveజనసేన అధినేత దూకుడు పెంచాడు. ఈసారి నేరుగా ఆయన పొలిటికల్ వార్ మాత్రమే కాకుండా మీడియాతోనూ యుద్ధంRead More

హోదా ఉద్యమానికి మీడియా ఆటంకం?
Spread the loveఇలాంటి అనుమానం కలుగుతోంది. గతంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో తెలుగు మీడియా మరో మాట మాట్లాడకుండాRead More