Main Menu

అయినా రామోజీరావు క‌రుణించ‌లేదు.!

Spread the love

.

ఏపీలో విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి మీద అనేక క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. కానీ వాస్త‌వంలో ఆయ‌న తీరు దానికి భిన్నంగా క‌నిపిస్తుంది. చివ‌ర‌కు త‌నకు గిట్ట‌ని వారి ప‌ట్ల కూడ ఆయ‌న ప్ర‌వ‌ర్తించే తీరు ఆశ్చ‌ర్యం వేస్తోంది. ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు ప‌ట్ల జ‌గ‌న్ వైఖ‌రి దానికి నిద‌ర్శ‌నం. రామోజీరావు కాంగ్రెస్ వ్య‌తిరేకిన‌ని చాలాకాలం క్రిత‌మే బ‌హిరంగంగా చెప్పుకున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ ని విబేధించారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దిపారు. దాంతో వైఎస్ హ‌యంలో రామోజీరావు తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. మార్గ‌ద‌ర్శి వంటి ఆయ‌న ఆర్థిక‌మూలాలు కూడా అవ‌స్థ‌ల్లో ప‌డ్డాయి. చివ‌రిలో రిల‌యెన్స్ సంస్థ ఆదుకోవడం, ఆనాటి ప్ర‌తిప‌క్ష నేత అద్వానీ చేదోడుగా నిల‌వ‌డంతో రామోజీ గ‌ట్టెక్కిన‌ట్టు అంతా భావిస్తారు.

అలాంటి రామోజీరావు ఆ వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత జ‌గ‌న్ మీద గురిపెట్టారు. క‌క్ష సాధించుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశారు. దానికి త‌గ్గ‌ట్టుగానే రామోజీరావు కోరుకున్న‌ట్టుగా జ‌గ‌న్ అధికారానికి దూర‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు సీఎం కాగ‌లిగారు. అయినా సంతృప్తి చెంద‌ని రామోజీరావు త‌న మీద దాడుల‌కు దిగుడుతుండ‌డంతో జ‌గ‌న్ స‌హించ‌లేక‌పోయారు. చివ‌ర‌కు తానే ఓ మెట్టు దిగి రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి మ‌రీ చ‌ర్చ‌లు జ‌రిపారు. త‌న‌కు స‌హ‌క‌రించాల‌ని కోరిన‌ట్టు కూడా ప్ర‌చారం సాగింది. దానికి త‌గ్గ‌ట్టుగానే కొంత స‌డ‌లింపు క‌నిపించినా రామోజీరావు మాత్రం ప‌ట్టు వ‌ద‌ల‌లేదు.

దాంతో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ లో భార‌తి పేరు ప్ర‌స్తావించిన‌ట్టు తెలియ‌గానే ఈనాడు త‌న ప్ర‌తాపం చూపించింది. ఈ తీరును త‌ప్పుబ‌డుతూ జ‌గ‌న్ బ‌హిరంగ‌లేఖ రాసిన త‌ర్వాత కూడా ఈనాడు వెన‌క్కి త‌గ్గ‌లేదు. త‌నతో స్నేహం కోసం జ‌గ‌న్ ప్ర‌య‌త్నం చేసిన విష‌యాన్ని కూడా ప‌ట్టించుకోలేదు. వ‌రుస‌గా రెండో రోజు కూడా భార‌తి మీద క‌థ‌నాలు అచ్చేశారు. ఈడీ చార్జిషీట్ లో ఉన్న విష‌య‌మిదేనంటూ ప్ర‌చారం చేశారు. ఓ ర‌కంగా చెప్పాలంటే ఆంధ్ర‌జ్యోతి కొంత వెన‌క్కి త‌గ్గినా ఈనాడు మాత్రం దూకుడు కొన‌సాగించ‌డం విశేషంగానే భావించాలి. భార‌తి విష‌యంలో రెండో రోజు క‌థ‌నాలు హైలెట్ చేసి, జ‌గ‌న్ ఖండ‌ల‌ను లోప‌లి పేజీల‌కు ప‌రిమితం చేయ‌డం ద్వారా జ‌గ‌న్ మీద రామోజీరావు ఏమాత్రం కూడా క‌రుణ చూపించ‌లేద‌ని స్ప‌ష్టం అవుతోంది.


Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *