Main Menu

కోమటి రెడ్డి రాజ్.. క్లోజ్?!

Spread the love

అన్నా నీ పేరేందే?
డ్యాష్ డ్యాష్ రెడ్డి..
అదేంటన్నా ఈ కంపెనీలో ఎవరి పేరెత్తినా రెడ్డే.. ఇదీ రాజ్ న్యూస్ లో డ్రైవర్ గా చేరిన ఓ వ్యక్తిని వేధించిన ప్రశ్న.

అందరూ రెడ్లే..
అది కూడా తెలంగాణ రెడ్లయి ఉండాలి.. ఇదీ కోమటి రెడ్లు.. రాజ్ న్యూస్ ప్రారంభంలో ఇచ్చిన ఆదేశానుసారం..

ఎంత రెడ్లయినా కొన్ని కొన్ని ఏరియాల్లో చేయి తిరగడం కష్టం. అదేం కాంట్రాక్టు కాదు.. లాభం చూసుకుని నడిపించి నష్టమైతే పన్లోంచి వెనక్కు వచ్చేయడానికి. మీడియా. మీడియా మీద సాము అంత సామాన్యమైంది కాదు. ఇదేం తెలీని కోమటి రెడ్లు పెద్ద గొప్పగా మీసం మెలేస్తూ రంగంలోకి దిగారు. ఇప్పటికే తెలంగాణ వాదాన్ని వినిపించి రెస్ట్ తీసుకుంటున్న రాజ్ న్యూస్ అయితే ఇందుకు కరెక్టుగా భావించి ఆ దిశగా బేరం మొదలు పెట్టారు.

అంతా బావుంది. హెచ్ఆర్ నుంచి మొదలు పెడితే అందరూ మనోళ్లే అయి ఉండాలని వీరారెడ్డి- గోవిందరెడ్డి ఇలా.. రాజగోపాల రెడ్డి వరకూ రెడ్డో రెడ్డి. ఇదే ఈ ఛానెల్ పాలిట రెడ్ లైట్ గా మారిందనడంలో అనుమానమే లేదు. స్వజాతి అయినంత మాత్రాన అందరూ పోటుగాళ్లే ఉండొద్దూ. ఇది చాలదన్నట్టు మీడియాకు ఎలాంటి సంబంధం లేని వాళ్లను కన్సల్టెంట్లుగా పెట్టడం.. దీంతో ఛానల్ ను నడపేవాళ్లకు సవాలుగా మారడం అదో పెద్ద కథ. రాజ్ న్యూస్ పాత కాపులకు కూడా పొమ్మనలేక పొగబెట్టడంతో రాజ్.. నారాజ్.

కట్ చేస్తే 2019 కి సరైన మీడియా సపోర్ట్ తో రంగంలోకి దిగాలని భావించిన రెడ్డి బ్రదర్స్ కి మధ్యలోనే ముడ్డి పగిలింది. లేకుంటే దేశంలో అందరూ రెడ్లే ఉన్నట్టు. ఓట్లేసేదంతా రెడ్లే అయినట్టు రెడ్ల సపోర్టు ఉంటే ఎంతటి కార్యమైనా గట్టెక్కేటట్టు ఓ తెగ ఫీలై.. రెడ్డి బ్యాచ్ మొత్తాన్ని రంగంలోకి దించారు. వాళ్లు చూస్తే ఏమంత ఎఫెక్టివ్ గా నడపలేక పోయారు. నలుగురు నాలుగు రకాల వాళ్లు కలిస్తేనే నాలుగు రకాలైన టాలెంట్లు బయట పడేది. ఏది ఏమైనా మీడియారంగమంటే అది బ్రాహ్మణుల ఆధిపత్య రంగం. అందునా ఇక్కడ స్పెషలిస్టులు ఆంధ్రులెక్కువ. ఈ కాంబినేషన్లో వెళ్తేనే సరైన ఫలితాలొస్తాయి. వార్తను టెంప్ట్ చేసి కొడితేనే అటేపు గూబ గుయ్యిమనేది.

ఈ కిటుకు తెలుసుకోవడంలో కమ్మలు ఎంతైనా ముందుంటారు. మనకు చేత కాని పని ఇతరుల చేత చేయించడమే కరెక్టుగా భావించి ఎవరికెంత ఇవ్వాలో అంత మర్యాద ఇవ్వడం షురూ చేస్తారు. మనమసలే రెడ్లు కదా? అని రంగంలోకి దిగి ఇదిగో ఇప్పుడిలా..

ఇంతకీ ఏమైంది?
ఏ వుందీ ఛానెల్ నడపలేక చేతులెత్తేస్తున్నారు.. ఈ రెండు మూడు నెలలు.. అంటే మార్చినాటికి ఛానెల్లో ఉన్న నలభై మందికి ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చేసి.. ఇంటికి సాగనంపాలని భావిస్తున్నారట.

కారణం ఏమై ఉంటుంది?
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ కాకపోవడం.. తప్పుడు అంచనాలు.. స్టార్ట్ చేసిన ఆరు నెలలకే బ్రేకీవెన్ కి వచ్చేస్తామని కలలు కనడం. ఇవేవీ జరగలేదు సరికదా? ఆ దరిదాపులకు కూడా వెళ్ల లేక పోవడం ఘోర వైఫల్యం. ఎనభై లక్షలు ఖర్చవుతుంటే గట్టిగా నలభై కూడా వెనక్కు రావడం లేదట.

పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేసి.. మార్కెట్లో మంచి సీఈఓను అపాయింట్ చేసుకుని ఇటు న్యూస్- అటు మ్యూజిక్ విత్ ఎంటర్టైన్ మెంట్ ను చేసే అవకాశాలు పుష్కలం. కానీ కోమటి రెడ్లు ఫెయిర్ స్కెచ్ వేయలేక పోయారు. అటు నుంచి ఇటు తీసినా ఇటు నుంచి అటు చూసినా రెడ్డి ఉందా లేదా అని మాత్రమే చూసుకున్నారు. దీంతో ఇదిగో ఇదీ సీన్..

ఇందులో మరో ఇష్యూ ఏంటంటే..
ఎంత పెట్టుబడి పెట్టినా ఆ బ్రాండ్ తమది కాదు. ఏ నాటికైనా అది పరాయోడిదే. 2019 వరకూ తమ అవసరాలకు నెట్టుకొచ్చినా మనకొచ్చే లాభాలేం లేవ్. ఇప్పటి వరకూ అన్నీ లాభసాటి వ్యాపారాలే తప్ప.. నెలకు యాభై లక్షల నష్టాలకు వ్యాపారం చేయడం తమ ఇంటా వంటా లేదంటున్నారు ఈ రెడ్లు.. కోమటి రెడ్లు.

ఇప్పుడీ నలభై మంది జర్నలిస్టుల బతుకేమై పోవాలీ? అన్నదిప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. వీళ్లంతా మార్కెట్లో ఎక్కడ అకామిడేట్ కావాలీ? సమస్యాత్మకంగా మారింది. ఇలాంటి లక్ష్యశుద్ధి లేనివాళ్లు.. మీడియా అంటే మౌత్ పీస్ గా ఫీలయ్యేవాళ్ల వల్ల మీడియాకు లాభం జరక్క పోగా నష్టమే అధికంగా మారింది.


Related News

ఏబీఎన్ ఎందుకు బ‌రి తెగిస్తోంది..?

Spread the loveమీడియాలో క‌థ‌నాల విష‌యంలో యాజ‌మాన్యాల ప్ర‌యోజ‌నాలుంటాయ‌న‌డంలో సందేహం లేదు. వారి రాజ‌కీయ ల‌క్ష్యాల‌క‌నుగుణంగా వార్త‌లు రాస్తుంటార‌న‌డంలో సందేహంRead More

సాక్షికి రెట్టింపులో టీవీ9

Spread the loveతాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు తెలుగు మీడియాలో సెంట‌ర పాయింట్ అవుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *