Main Menu

మీడియా య‌జ‌మానుల రెండు నాలుక‌ల ధోర‌ణి

Spread the love

తెలుగు ప‌త్రిక‌లు మూకుమ్మ‌డి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా అన్ని ప‌త్రిక‌లు ధ‌ర‌లు పెంచేశాయి. తొలుత ఈనాడు దానికి శ్రీకారం చుడితే ఆ వెంట‌నే న‌మస్తే తెలంగాణా, ఆంధ్ర‌జ్యోతి కూడా అదే పాట అందుకున్నాయి. ఏకంగా ప్ర‌తీ కుటుంబానికి నెల‌కు 50రూ.ల అద‌నపు భారం సిద్దం చేశాయి. అందుకే కార్పోరేట్ యాజ‌మాన్యుల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ, వారి ప్ర‌యోజ‌నా కోస‌మే ప‌నిచేసే ఈ మీడియా సంస్థ‌ల అస‌లు నైజం అర్థం చేసుకోవాలి. కార్మికుల కోసం ప‌నిచేసే ప‌క్షాల‌పై విషం జ‌ల్లుతూ జ‌నాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్న వారి రాత‌ల అస‌లు మ‌ర్మం గుర్తించాలి. కార్పోరేట్ మీడియాకి త‌గిన బుద్ధి చెప్పాలి.

అయితే ఈ పెంపుద‌ల‌కు చెబుతున్న కార‌ణాలు వింటే ఆశ్చ‌ర్య‌పోతారు. కార‌ణం ఏమంటే ఈ మూడు ప‌త్రిక‌లు చ‌దువుతుంటే బంగారు తెలంగాణా, స్వ‌ర్ణాంధ్ర క‌నిపిస్తాయి. కేంద్రంలో ప్ర‌భుత్వం కూడా మోడీ చ‌ల‌వ‌తో జ‌నాల‌కు ఎంతో మేలు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్లుగా ఎంతో అభివృద్ధి జ‌రిగింద‌నే అభిప్రాయం క‌లిగిస్తాయి. త‌మ ప‌త్రిక‌ల క‌థ‌నాల నిండా పాల‌కుల ప‌ల్ల‌కీల మోత వినిపిస్తుంది.

కానీ తీరా చూస్తే ఇప్పుడు ధ‌ర‌ల పెంపుద‌ల‌కు కార‌ణాలు మాత్రం జీఎస్టీ , పెట్రో ధ‌ర‌లు వంటి స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జీఎస్టీ వ‌ల్ల దేశానికి ఎంతో మేలు జ‌రిగింద‌ని వార్త‌ల మీద వార్త‌లు పుంఖానుపుంఖాలుగా రాసిన ప‌త్రికాధినేత‌లు ఇప్పుడు దానినే కార‌ణం చూపించి ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లీ వాయించేందుకు సిద్ధ‌ప‌డ‌డం విచిత్రంగా క‌నిపిస్తోంది. అంతేగాకుండా పెట్రో ధ‌ర‌ల కార‌ణంగా సామాన్యుడు చితికిపోతుంటే, చివ‌ర‌కు ఆగ్ర‌హంతో రోడ్డెక్కితే ఆ వార్త‌ల‌ను త‌మ ప‌త్రిక‌ల్లో క‌నిపించ‌కుండా, ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని తొక్కిపెట్టినోళ్లే చివ‌ర‌కు ఇప్పుడు వాటిని సాకుగా చూపించి ప‌త్రిక‌ల ధ‌ర‌లు పెంచ‌డం నిస్సిగ్గుత‌నాన్ని గుర్తు చేస్తోంది.






Related News

మీటూ ఎఫెక్ట్: ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌పై వేటు

Spread the loveమాజీ పత్రికా సంపాదకులు ఎంజె అక్బర్‌, తరుణ్‌ తేజ్‌పాల్‌ను బుధవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ)Read More

చ‌ర్చ‌నీయాంశంగా మారిన టీవీ9 స‌ర్వే

Spread the loveప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరులో ప్ర‌తీ అవ‌కాశం కూడా వినియోగించుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మీడియా అందుకు తందానRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *