త‌ప్పుడు ప్ర‌చారం చేస్తూ మోడీ అనుచ‌రుడు అరెస్ట్

Faridabad - Prime Minister Narendra Modi during a workshop for the newly elected MPs at Suraj Kund in Faridabad on Saturday, 28 June 2014. (Photo by ARIJIT SEN . DNA)
Spread the love

అత‌డిని ఏకంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి ఫాలో అవుతున్నాడు. న‌రేంద్ర మోడీ ఫాలో అవుతున్న కొద్ది మంది ప్ర‌ముఖుల్లో ఒక‌డు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్న కేసులో ఇరుక్కున్నాడు. మ‌త ఘ‌ర్ష‌ణ‌లు రాజేసే రీతిలో త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న వెబ్ సైట్ సృష్టిక‌ర్తని తాజాగా క‌ర్ణాట‌క పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ యాక్ట్ 66ఏ, సెక్ష‌న్ 153ఏ, సెక్ష‌న్ 295ఏ, ఐపీసీ 120 బీ కింద న‌మోద‌యిన కేసులో పోస్ట్ కార్డ్ వైబ్ సైట్ య‌జ‌మాని మ‌హేష్ విక్ర‌మ్ హెగ్డేని క‌ర్ణాట‌క పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విష‌యాన్ని బీజేపీ ఎంపీ ప్ర‌తాప్ సిన్హా నిర్ధారించ‌డం విశేషం.

Selection_29_03_2018_004

చాలాకాలంగా పోస్ట్ కార్డ్ క‌థ‌నాలపై తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌తంలో కేసు కూడా న‌మోద‌య్యింది. అయితే తాజాగా బీజేపీయేత‌ర పార్టీలు ప‌రిపాలిస్తున్న రాష్ట్రాల మీద కేంద్రీకరించి అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తుంటార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా బెంగాల్, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల మీద దృష్టి పెట్టి అర్థ‌స‌త్యాలు ప్ర‌చారంలో ఆరితేరిన వెబ్ సైట్ గా పోస్ట్ కార్డ్ ని చెబుతుంటారు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా విడుద‌ల‌య్యింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో సోష‌ల్ మీడియా ద్వారా మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లు రాజేసే ప్ర‌మాదం ఉంద‌న్న అంచ‌నాల‌తో అరెస్ట్ కి పాల్ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. స‌ద‌రు వెబ్ సైట్ లో పోస్ట్ అయిన అనేక నిరాధార క‌థ‌నాల‌పై న‌మోద‌యిన కేసులో అరెస్ట్ వ‌ర‌కూ వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. బెంగాల్ లో మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌కు సంబంధించిన అనేక త‌ప్పుడు క‌థ‌నాలు ఈ వెబ్ సైట్ నుంచి వెలువ‌డ్డాయ‌ని భావిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే ఆధారాలు సేక‌రించి కేసు న‌మోదు చేసిన‌ట్టు క‌ర్ణాట‌క పోలీసులు చెబుతున్నారు.

ఐపీసీ సెక్ష‌న్ 153ఏ ప్ర‌కారం మ‌తాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు రాజేసే ప్ర‌య‌త్నం జ‌రిగిన‌ట్టు కేసు న‌మోద‌య్యింది. అంద‌తేగాకుండా విశ్వాసాల‌ను దెబ్బ‌తీసే రీతిలో త‌ప్పుడు ప్ర‌చారాలు సాగించినట్టు సెక్ష‌న్ 295ఏ, నేర‌పూరిత కుట్ర సాగిన‌ట్టు సెక్ష‌న్ 120బీ కింద కేసు న‌మోదు కావ‌డం విశేషం. ఇలాంటి వ్య‌క్తిని ప్ర‌దాన‌మంత్రి హోదాలో ఉన్న మోడీ ట్విట్ట‌ర్ లో ఫాలో అవుతున్న తీరు విస్మ‌యం క‌లిగిస్తోంది. అబ‌ద్ధాల ఫ్యాక్ట‌రీ ప్ర‌తినిధుల‌ను ప్ర‌ధాని అనుస‌రించ‌డం దేశానికి త‌ప్పుడు సంకేతాలిస్తోంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఇప్ప‌టికే అనేక ఉదంతాలు వెలుగులోకి వ‌చ్చాయి. తాజాగా జాతిస‌మైక్య‌త‌ను దెబ్బ‌తీసే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌హేష్ విక్ర‌మ్ హెగ్డే వ్య‌వ‌హారంతో ప్ర‌దాని తీరు కూడా విమర్శ‌ల‌కు తావిస్తోంది.


Related News

abn

అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌

Spread the loveఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద ఏర్ప‌డింది. వ‌రుస‌గా వెలుస్తున్న న‌కిలీ వ్య‌వ‌హారాల‌తో క‌ల‌త చెందుతోంది. క‌ల‌వ‌రం క‌లిగిస్తున్న వారిపైRead More

paw

మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?

Spread the loveఏపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొదల‌య్యింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నుంచి మొద‌ల‌యిన తంతు ఇప్పుడు కొత్తRead More

 • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
 • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
 • హోదా ఉద్యమానికి మీడియా ఆటంకం?
 • జ‌ర్న‌లిస్ట్ కి గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌
 • ఆమెను మీడియా వాడుకుందా…?
 • కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజ్
 • లోకేష్ వ్యాఖ్య‌ల‌ను టీవీ9 ఎందుకు ప్ర‌సారం చేసింది…?
 • మోడీ స‌ర్కార్ వెన‌క‌డుగు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *