Main Menu

మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?

Spread the love

ఏపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొదల‌య్యింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నుంచి మొద‌ల‌యిన తంతు ఇప్పుడు కొత్త రూపు దాల్చింది. ముఖ్యంగా ప‌వ‌న్ ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయింది. ద‌గ్గుబాటి అభిరామ్ వ్య‌వ‌హారం స‌మ‌సిపోయి కొణిదెల వారి కుటుంబం చుట్టూ తిరుగుతోంది. ఈ నేప‌థ్యంలో మీడియా సంస్థ‌ల య‌జ‌మానుల పాత్ర ముందుకొచ్చింది. టీవీ9, టీవీ5, ఏబీఎన్ చానెళ్లు ఒక‌వైపు జ‌న‌సేనాని మ‌రోవైపు అన్న‌ట్టుగా మారిపోయింది. ప‌వ‌న్ మీడియా మీద గురిపెట్ట‌డాన్ని కొంద‌రు త‌ప్పుబ‌డుతుండ‌గా, ప‌లువురు అభినందిస్తున్నారు. తెలుగు మీడియాలో మాఫియాగా మారిన ఓ వ‌ర్గం పెత్త‌నాన్ని నిల‌దీసినందుకు అభినందలు తెలుపుతున్నారు. అండ‌గా నిలుస్తున్నారు. పీకేకి తోడుగా నిలుస్తామ‌ని చెబుతున్నారు.

వాస్త‌వానికి మీడియాలో కొంద‌రి పెత్త‌నాన్ని తొలుత నిల‌దీసింది వైఎస్ జ‌గ‌న్. కానీ ఆయ‌న కొంత వ‌ర‌కూ ప్ర‌య‌త్నించి ప్ర‌స్తుతం ఏబీఎన్ మిన‌హా మిగిలిన వారితో స‌ఖ్యంగా సాగిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ జ‌న‌సేనాని మాత్రం ఏకకాలంలో మూడు సంస్థ‌ల మీద గురిపెట్టారు. రాజ‌కీయంగా ఒక్కొక్క‌రి మీద దాడి చేయాల్సిన స‌మ‌యంలో ముగ్గురి మీద ఏక‌కాలంలో ప‌వ‌న్ ఎదురుదాడికి దిగ‌డం కొంత స‌మ‌స్య‌తో కూడుకున్న వ్య‌వ‌హార‌మే. అయినా ప‌వ‌న్ ప్రారంభించాడు కాబ‌ట్టి, ఇక వెన‌క్కి తిరిగిరాగ‌లిగే అవ‌కాశాలు లేవు. అయితే ప‌వ‌న్ మీద తీవ్రంగా దుమ్మెత్తిపోయ‌డానికి స‌ద‌రు చానెళ్లు మాత్రం సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

తాజాగా ఏబీఎన్ రాధాకృష్ణ కొత్త‌ప‌లుకులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద చేయ‌ని విమ‌ర్శ లేదు. ఒక్క రాధాకృష్ణ మాత్ర‌మే కాదు, టీవీ5 కూడా అంతే. టీవీ9 అయితే అంత‌కుమించి కూడా.అదే స‌మ‌యంలో ప‌వ‌న్ కి వ్య‌తిరేకంగా జ‌ర్న‌లిస్టుల హ‌క్కుల పేరుతో కొంద‌రు రోడ్డెక్క‌డం కూడా అందులో భాగ‌మే. ఓవైపు ప‌వ‌న్ మీద తీవ్ర‌విమ‌ర్శ‌లు చేస్తూ, వ్య‌క్తిత్వ హ‌నానికి ప్ర‌య‌త్నిస్తూనే మ‌రోవైపు శుద్ధులు చెబుతున్న‌ట్టు నీతులు వ‌ల్లించ‌డం స‌ద‌రు మీడియా సంస్థ‌ల పెద్ద‌ల నైజాన్ని తేట‌తెల్లం తేస్తోంది. తెలుగు మీడియాలో సాధార‌ణ జ‌ర్న‌లిస్టులు చానెల్ య‌జ‌మానులుగా మారిన ఇద్ద‌రు పెద్ద‌లు సామాన్యులు కాదు. అందుకే ఆర్కే, ర‌విప్ర‌కాష్ తీరు చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ప‌వ‌న్ మీద మ‌రిన్ని రూపాల్లో దాడుల‌కు తెగ‌బ‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది. దానిని ఎదుర్కోవ‌డం చిన్న విష‌యం కాదు. అయినా సుదీర్ఘ‌పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నాన‌ని ప‌వ‌న్ చెబుతున్న నేప‌థ్యంలో ఇదో ఆస‌క్తిక‌ర అంశ‌మే.

అయితే జ‌న‌సేనాని మీద విమ‌ర్శ‌లు చేస్తున్న వారి వ్య‌వ‌హారాలు కూడా ఏపీలో అంద‌రికీ తెలుసు. విలేక‌రి నుంచి ఎదిగిన వారి వైనం, చంద్ర‌బాబుతో స్నేహం, టీడీపీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో సాగుతున్న వ్య‌వ‌హారం అన్నీ జ‌గ‌మెరిగిన స‌త్యాలేన‌ని జ‌నసేన నేత‌లు చెబుతున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రెన్ని చెప్పినా నైతికంగా ప‌వ‌న్ కి ప్ర‌జ‌ల మ‌ద్ధ‌తు ఉంద‌న్న‌ది వారి ధీమా. అందుకే గురివింద‌ల మాదిరి మీడియా పెద్ద‌లు చెబుతున్న నంగ‌నాచి మాట‌ల‌కు పెద్ద‌గా విలువ ఉండ‌ద‌న్న‌ది వారి అంచ‌నా. చూడాలి..మ‌రి చివ‌ర‌కు ఏమ‌వుతుందో..


Related News

ఏబీఎన్ ఎందుకు బ‌రి తెగిస్తోంది..?

Spread the loveమీడియాలో క‌థ‌నాల విష‌యంలో యాజ‌మాన్యాల ప్ర‌యోజ‌నాలుంటాయ‌న‌డంలో సందేహం లేదు. వారి రాజ‌కీయ ల‌క్ష్యాల‌క‌నుగుణంగా వార్త‌లు రాస్తుంటార‌న‌డంలో సందేహంRead More

సాక్షికి రెట్టింపులో టీవీ9

Spread the loveతాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు తెలుగు మీడియాలో సెంట‌ర పాయింట్ అవుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *