Main Menu

ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్

Spread the love

జ‌న‌సేన అధినేత దూకుడు పెంచాడు. ఈసారి నేరుగా ఆయ‌న పొలిటిక‌ల్ వార్ మాత్ర‌మే కాకుండా మీడియాతోనూ యుద్ధం చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. నేరుగానే వివిధ చానెళ్ల మీద గురిపెట్టారు. చంద్ర‌బాబుకి వ‌త్తాసు ప‌లికే చానెళ్ళుగా నారా లోకేష్ క‌నుస‌న్న‌ల్లో సాగుతున్న చానెళ్లుగా పేర్కొంటూ టీవీ9, ఏబీఎన్ చానెళ్ల మీద నేరుగా విమ‌ర్శ‌లు చేశారు. అందులోనూ రాధాకృష్ణ‌, శ్రీనురాజు, ర‌విప్ర‌కాష్ స‌హా ఆయా చానెళ్ల య‌జ‌మానుల మీద గురిపెట్టారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా టీవీ5 ని కూడా సీన్ లోకి లాగారు. నారా లోకేష్ స్వ‌యంగా అంకుల్ అని పిలుచుకునే టీవీ5 యాంక‌ర్ సాంబ‌శివ‌రావు ది రెండు నాలుక‌ల ధోర‌ణి అంటూ బ‌య‌ట‌పెట్టారు. అదే స‌మ‌యంలో సుజ‌నా చౌద‌రి బినామీగా న‌డుస్తున్న మ‌హాటీవీ మూర్తితో స‌హా స‌ద‌రు సంస్థ‌ను కూడా వ‌దిలిపెట్ట‌లేదు. దాంతో మొత్తంగా ప‌వ‌న్ గురిపెట్టిన చానెళ్ళ సంఖ్య నాలుగుకి చేర‌డం విశేషం. ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి నుంచి మొద‌లు పెట్టి మ‌హా న్యూస్ వ‌ర‌కూ అన్నింటికీ చంద్ర‌బాబు బాస్ లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అంత‌టితో స‌రిపెట్ట‌డ‌కుండా త‌న ట్వీట్ల యుద్ధంలో భాగంగా మ‌రికొన్ని జ‌త‌చేశారు. టీవీ9లో 88.69శాతం వాటా ఉన్న శ్రీ సిటీ సెజ్ అధినేత శ్రీనిరాజు బండారం మ‌రింత బ‌య‌ట‌పెడ‌తాన‌ని , దానికి స‌మ‌యం ద‌గ్గ‌ర‌కొస్తుంద‌ని పేర్కొన్నారు. అంతేగాకుండా టీవీ9లో ఎవ‌రెవ‌రి వాటా ఎంత అనేది కూడా ట్వీట్ చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ట్వీట్ లో టీవీ9 లో వాటాల శాతం ఇలా ఉంది..శ్రీని రాజు న్యూ లుక్ అంటూ ఓ ఫోటో కూడా పోస్ట్ చేయ‌డ‌మే కాకుండా స‌త్యం రామ‌లింగ‌రాజుకి ద‌గ్గ‌ర బంధువు అంటూ పేర్కొన‌డం విశేషం. అదేస‌మ‌యంలో రామ్ గోపాల్ వ‌ర్మకి కూడా శ్రీనిరాజు బంధువేనంటూ పేర్కొన్నారు.

tv9

మొత్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియా మీద యుద్దానికి దిగ‌డం, అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుని టార్గెట్ చేయ‌డం అటు పొలిటిక‌ల్, ఇటు మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. సంచ‌ల‌నం అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ రాజ‌కీయ నాయ‌కుడు ఇలా మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాల‌ను మీద గురిపెట్టిన దాఖ‌లాలు లేవు. జ‌గ‌న్ కూడా టీవీ9, ఏబీఎన్ ని విమ‌ర్శించిన‌ప్ప‌టికీ వారి వ్య‌వ‌హారాల గురించి ప్ర‌స్తావించిన దాఖ‌లాలు లేవు. కానీ జ‌న‌సేనాని మాత్రం ఓ అడుగు ముందుకేసిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో జ‌న‌సేన త‌న పోరాటంలో భాగంగా మీడియా సంస్థ‌ల మీద కూడా బాణాలు ఎక్కుపెడుతున్న నేప‌థ్యంలో ఆయా సంస్థ‌లు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇప్ప‌టికే ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోరాటానికి ఆయా మీడియా చానెళ్ళ‌లో ప్రాధాన్య‌త త‌గ్గుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. భ‌విష్య‌త్తులో ఎలా ఉంటుందో చూడాలి.






Related News

మిడిమిడి మీడియా అంటే అదే..!

Spread the loveఇప్ప‌టికే అంద‌రికీ అర్థ‌మ‌య్యింది. మీడియా అంటే నిష్ఫ‌క్ష‌వార్త‌లు అందిస్తుంద‌ని న‌మ్మిన త‌రం నుంచి మీడియా అంటే ఆర్థికRead More

టీవీ9 అమ్మ‌కంపై త‌గాదా

Spread the loveతెలుగులో టీఆర్పీ ప‌రంగా టాప్ లో నిలిచే టీవీ9 చానెల్ అమ్మ‌కం పెద్ద త‌గాదాగా మారుతోంది. ఆర్థికRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *