ఎన్టీవీ చైర్మ‌న్ ఇంట అఖిల‌ప‌క్షం..!

ntv
Spread the love

ఎన్టీవీ చైర్మ‌న్ ఇంట అఖిల‌ప‌క్ష నేత‌లు సంద‌డి చేశారు. న‌రేంద్ర చౌద‌రి త‌న‌య ర‌చ‌న ఎంగేజ్ మెంట్ సంద‌ర్భంగా దాదాపుగా అన్ని పార్టీల నేత‌లు హంగామా చేశారు. అయితే స‌హజంగా ఒక పార్టీ నాయ‌కుడు వ‌చ్చినప్ప‌టికీ మ‌రో నాయ‌కుడు అక్క‌డి నుంచి వెళ్ళిపోతుంటారు. కానీ ఈసారి దానికి భిన్నంగా కీల‌క‌నేత‌లంతా ఒక చోట గుమికూడారు. టాలీవుడ్ ప్ర‌ముఖులంతా వారికి జ‌త‌గ‌లిశారు. దాంతో సెల‌బ్రిటీల సంద‌డి క‌నిపించింది.

ముఖ్యంగా ఉప రాష్ట్ర‌ప‌తి కాబోతున్న వెంక‌య్య నాయుడు, స‌హా నేత‌లంతా అక్క‌డ ఉన్నారు. అదే స‌మ‌యంలో కొంత‌కాలం క్రితం ఆయ‌న మీద విరుచుకుప‌డిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం వెంక‌య్య‌కు కాస్త దూరంగా కూర్చోవ‌డం విశేషం, కాంగ్రెస్, టీడీపీ నేత‌లంతా వెంక‌య్య‌కు స‌మీపంలో ఉండ‌గా జ‌న‌సేనాని దూరంగా వ‌దిన‌, చిరంజీవి బార్య సురేఖ‌తో క‌లిసి కూర్చోవ‌డం విశేషం. అంత‌కుముందు వైఎస్ జ‌గ‌న్ కూడా అక్క‌డికి వ‌చ్చారు. ఏమైనా అన్ని పార్టీల నేత‌లు క‌ల‌వ‌డం క‌నుల‌విందుగా క‌నిపించింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *