రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!

JOURNALIST
Spread the love

ఏపీ ప్ర‌భుత్వం స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్ గురించి చెబుతుంది. రియ‌ల్ టైమ గ‌వ‌ర్నెన్స్ అంటోంది. డిజిటల్ ఏపీ గురించి ప్ర‌చారం చేస్తుంది. కానీ ఆఖ‌రికి పాత్రికేయుల అక్రిడిటేష‌న్ కార్డుల విష‌యంలో కూడా తీవ్ర జాప్యం జ‌రుగుతోంది. ఆఖ‌రికి కొత్త కార్డులు ఇవ్వాల్సిన ద‌శ‌లో ఉన్న‌వాటిని రెన్యువ‌ల్ చేస్తామ‌ని మాత్ర‌మే ప్ర‌క‌టించి చేతులు దులుపుకుంటోంది. దాంతో చాలామంది జ‌ర్న‌లిస్టులు నిరాశ‌లో మునుగుతున్నారు.

ఏపీలో ప్ర‌తీ ఏటా అక్రిడిటేష‌న్ కార్డుల జారీ జ‌రగాలి. కానీ 2017 వ సంవ‌త్స‌రానికి ఇచ్చిన కార్డుల‌ను 2018జ‌న‌వ‌రిలో మార్పు చేయాల్సి ఉండ‌గా ఈ మార్చి నెల వ‌ర‌కూ పొడిగించారు. పోనీ ఇప్పుడ‌యినా కొత్త‌వి ఇస్తార‌నుకుంటే తాజాగా మంత్రి కాల్వ శ్రీనివాసులు ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కూ పొడిగిస్తున్నామ‌ని ప్ర‌క‌టించేశారు. దాంతో కొత్త అక్రిడిటేష‌న్ల కోసం వేచి చూస్తున్న వారికి నిరాశ త‌ప్ప‌డం లేదు. మార్పులు, చేర్పులు జ‌ర‌గాల్సి ఉండ‌గా అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్లు కూడా స‌కాలంలో ఇవ్వ‌కుండా రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అని ఎలా చెప్పుకుంటార‌నే ప్ర‌శ్న ఉద‌యిస్తోంది

అదే స‌మ‌యంలో జ‌ర్న‌లిస్టుల గృహ‌నిర్మాణం విష‌యంలో కూడా అదే తంతు. ఇప్పుడు విధి విధానాల కోసం ఓ క‌మిటీ వేస్తామ‌ని మంత్రి కాల్వ ప్ర‌క‌టించారు. అంటే పాల‌న చివ‌రి ద‌శ‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ విధానాలు రూప‌క‌ల్ప‌న చేయ‌కుండా ఇప్పుడు ఆఖ‌రి బ‌డ్జెట్ లో నిధులు లేకుండా విధానాల కోసం క‌మిటీ వేస్తామ‌ని చెప్ప‌డం జ‌ర్న‌లిస్టుల‌ను మ‌రోసారి ఆశ పెట్టి ఊరించ‌డ‌మే త‌ప్ప ఆదుకున్న‌ట్టు కాద‌ని ప‌లువురు భావిస్తున్నారు. జ‌ర్న‌లిస్టుల‌కు నాలుగేళ్లుగా మాట‌లు చెబుతున్న ప్ర‌భుత్వం మ‌రోసారి వంచ‌న‌కు గురిచేస్తుందా అన్న సందేహం క‌లుగుతోంది. పాత్రికేయుల ఆశ‌ల మీద నీళ్లు జ‌ల్లుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. నిజంగా ప్ర‌భుత్వానికి ప్రేమ ఉంటే ఇప్ప‌టికే విధి విధానాలు రూప‌క‌ల్ప‌న చేసి, వ‌చ్చే బ‌డ్జెట్ లో నిధులు కేటాయిస్తే అది ఫ‌ల‌వంతం అవుతుంది గానీ దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం మోసం చేయ‌డేమ‌న‌ని ప‌లువురు భావిస్తున్నారు. అమ‌రావ‌తిలో మీడియా సంస్థ‌ల యాజ‌మాన్యాల స్థ‌ల కేటాయింపుల విష‌యంలో క‌స‌ర‌త్తు చేస్తున్న చందంగా క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్టుల హౌసింగ్ మీద శ్ర‌ద్ధ ఉంటే కొంత‌యినా ఫ‌లితం వ‌చ్చేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.


Related News

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the love6Sharesజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

NDTV

మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా

Spread the love2Sharesదేశంలోనే ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ‌కు జ‌రిమానా విధించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే దానికి కార‌ణంగా చెబుతున్నారు. అయితేRead More

 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *