తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!

tv channels ratings
Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి అనుకోని ఘ‌ట‌న ఎదుర‌య్యింది. ఇటీవ‌ల ఆయ‌న అంచనాలు త‌ప్పుతున్నాయి. ప‌లు ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. తాజాగా ఆయ‌న న‌ల‌భై ఏళ్ల ప్ర‌స్థానం గురించి, విశాఖ స‌మ్మిట్ లో పెట్టుబ‌డుల గురించి ఆయన భారీ ప్ర‌చారం ఆశించారు. అది కూడా ఎన్నిక‌ల ముందు జ‌రుగుతున్న వ్య‌వ‌హారం కావ‌డంతో పెద్ద ఆశ‌లే పెట్టుకున్నారు. కానీ ఆయ‌న‌కు అనుకోని ఆటంకం ఎదుర‌య్యింది. శ్రీదేవి రూపంలో చంద్ర‌బాబు ఆశ‌ల మీద నీళ్లు జ‌ల్లింది. అతిలోక సుంద‌రి మ‌ర‌ణంతో అన్ని చానెళ్లు అటు మ‌ళ్లిపోయాయి. వ‌రుస సంతాప సందేశాలు, ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌తో మొత్తం మీడియా ఆమె నామ‌స్మ‌ర‌ణ‌లో మునిగిపోయింది. దాంతో చంద్ర‌బాబు పెట్టుబ‌డుల ప్ర‌వాహానికి పెద్ద‌గా చోటు ద‌క్క‌డం లేదు. వ‌రుస‌గా రెండు రోజుల పాటు ఇదే ప‌రిస్థితి త‌ప్ప‌దు. దాంతో తొలిరోజు మిన‌హా మిగిలిన రెండు రోజుల పాటు సీఐఐ స‌మ్మిట్ ప్ర‌చారం గాలికెగిరిపోతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

శ్రీదేవి మ‌ర‌ణ‌వార్త కోసం ఒక‌రోజు, అంత్య‌క్రియ‌ల కోసం మ‌రో రోజు కేటాయిస్తే ఇక బాబుకి ఛాన్స్ ఉండ‌ద‌నే చెప్ప‌వ‌చ్చు. భారీగా ప్ర‌చారం కోసం యాడ్స్ ఇచ్చిన‌ప్ప‌టికీ వాటిని ప్ర‌సారం చేస్తున్న చానెళ్లు అస‌లు కార్య‌క్ర‌మాన్ని మాత్రం క‌వ‌ర్ చేసి స్థితిలో కూరుకుపోయాయి. దాదాపు అంద‌రూ శ్రీదేవి మ‌ర‌ణానికే ప్రాధాన్య‌త ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉండ‌డంతో చంద్ర‌బాబుని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇది చంద్ర‌బాబు తీవ్ర నిరాశలో మునిగిపోవ‌డానికి ఈ వ్య‌వ‌హారం కార‌ణంగా మారుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో కూడా ఒక‌టి రెండు సార్లు ఇలాంటి సందిగ్ధ స్థితి ఏర్ప‌డినా కొంత‌యినా చంద్ర‌బాబుకి అవ‌కాశం ద‌క్కేది. కానీ శ్రీదేవి పుణ్యాన యాడ్స్ కి మిన‌హా అస‌లు కార్య‌క్ర‌మానికి క‌వ‌రేజ్ ఇచ్చే వారే లేక‌పోవ‌డంతో ప్ర‌చార‌మే ఆయుధంగా చేసుకున్న బాబుకి మింగుడుప‌డ‌ని ప‌రిస్థితిగా చెప్ప‌క త‌ప్ప‌దు.


Related News

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the love6Sharesజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

NDTV

మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా

Spread the love2Sharesదేశంలోనే ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ‌కు జ‌రిమానా విధించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే దానికి కార‌ణంగా చెబుతున్నారు. అయితేRead More

 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *