లోకేష్ వ్యాఖ్య‌ల‌ను టీవీ9 ఎందుకు ప్ర‌సారం చేసింది…?

nara-lokesh-cycling-617-1523002111
Spread the love

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వ్యాఖ్య‌లు మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యాయి. 2014లో నాటి ప్ర‌ధాని మోడీ అంటూ, రాష్ట్ర విభజ‌న జ‌ర‌క‌పోవ‌డంతో టీడీపీ స్పందించిందంటూ టీవీ9 ఇంట‌ర్య్యూలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. విజ‌య‌వాడ టీవీ9 విలేక‌రి చేసిన ఇంట‌ర్వ్యూలో సైకిల్ యాత్ర చేస్తున్న స‌మ‌యంలో లోకేష్ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి.

అయితే ఈ వ్యాఖ్య‌ల‌ను టీవీ9 ఎందుకు ప్ర‌సారం చేసింద‌నే అనుమానం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. వాస్త‌వంగా అది లైవ్ ఇంట‌ర్య్యూ కాదు. అలాంటి స‌మ‌యంలో కొంత ఎడిట్ చేసే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా నేత‌లు త‌డ‌బ‌డిన స‌మ‌యంలో వాటిని ప్ర‌సారం చేయ‌డం మీడియా చానెళ్ల‌లో చాలా మామూలు విష‌యం. అలాంటిది నారా లోకేష్ రెండు మార్లు త‌డ‌బ‌డినా, దానిని య‌ధాత‌థంగా ప్ర‌సారం చేయ‌డం ద్వారా టీవీ9 తీరు చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

వాస్త‌వంగా టీవీ9 మీద ప్ర‌తిప‌క్ష నేత‌లు చాలాసార్లు విమ‌ర్శ‌లు చేసింది. చంద్ర‌బాబుకి వంత పాడ‌తార‌ని వ్యాఖ్య‌లు కూడా చేసింది. అయినా టీవీ9 మాత్రం నారా లోకేష్ ప‌రువు తీసే రీతిలో ఇంట‌ర్వ్యూ ప్ర‌సారం చేయ‌డం వెనుక కార‌ణాలేమ‌యి ఉంటాయా అన్న‌ది చాలామందికి అంతుబ‌ట్టని విష‌యంగా మారింది. సిబ్బంది య‌ధాలాపంగా చేసిన ప్ర‌సార‌మే అని ప‌లువురు భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో విలేక‌రి ప్ర‌శ్న‌లో కూడా జ‌న‌సేన ఎంపీలంటూ పేర్కొన్నార‌నే విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమ‌యినా టీవీ9 ఇంట‌ర్వ్యూ మాత్రం నారా లోకేష్ ని జ‌నంలో మ‌రింత ప‌లుచ‌న చేసేలా త‌యారయ్యింద‌ని భావిస్తున్నారు.


Related News

abn

అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌

Spread the loveఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద ఏర్ప‌డింది. వ‌రుస‌గా వెలుస్తున్న న‌కిలీ వ్య‌వ‌హారాల‌తో క‌ల‌త చెందుతోంది. క‌ల‌వ‌రం క‌లిగిస్తున్న వారిపైRead More

paw

మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?

Spread the loveఏపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొదల‌య్యింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నుంచి మొద‌ల‌యిన తంతు ఇప్పుడు కొత్తRead More

 • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
 • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
 • హోదా ఉద్యమానికి మీడియా ఆటంకం?
 • జ‌ర్న‌లిస్ట్ కి గ‌వ‌ర్న‌ర్ క్ష‌మాప‌ణ‌
 • ఆమెను మీడియా వాడుకుందా…?
 • కేసుల్లో వైఎస్ జ‌గ‌న్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజ్
 • లోకేష్ వ్యాఖ్య‌ల‌ను టీవీ9 ఎందుకు ప్ర‌సారం చేసింది…?
 • మోడీ స‌ర్కార్ వెన‌క‌డుగు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *