సోషల్ మీడియా సాయంతో ముంచేసింది…

25552228_10155933819160699_4895729005415841476_n
Spread the love

నిన్నటి వరకూ ఆమె టీడీపీకి ఆణిముత్యం. టీడీపీని గానీ, చంద్రబాబుని గానీ పల్లెత్తు మాట అన్నా ఆమె సహించేది కాదు. సోషల్ మీడియా పోస్టులతో ప్రత్యర్థుల మీద నిత్యం ఎదురుదాడి చేస్తుండేది. అలాంటిది ఇప్పుడు అనూహ్యంగా ఇరుకునపడింది. ఏకంగా పోలీసులకు చిక్కింది. గూడురులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు కుటుంబంంతో సహా కటకటాలు పాలయ్యింది. దాంతో అసలు మోసం పోలీసులు బయటపెట్టడంతో ఆమె బండారం బయటపడినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెగారి భాగోతం హాట్ టాపిక్ అయ్యింది.

గత కొద్దిరోజులగా ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా పలువురిని బుట్టలో వేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠా ఒకటి బయటపడింది. ఏకంగా అమరావతిలో భూములు కొనుగోలు చేస్తామని, నామినేటెడ్ పోస్టులు, పద్మశ్రీ అవార్డులు కూడా ఇప్పిస్తామని మోసగించి 2.2 కోట్లు దండుకున్న మౌనిక పాల్వాయి సహా గుంటూరు సీఐ శేషారావు, గెడ్డం ప్రసన్న లక్ష్మీ ని కూడా అరెస్ట్ చేశారు. గూడురు కి చెందిన వ్యాపార వేత్త రాఘవయ్యను, డాక్టర్ శ్రీధర్ ను వారు మోసగించినట్టు పోలీసులు చెబుతున్నారు.

అయితే ఇన్నాళ్లుగా విలేకర్ల వసూళ్ల గురించి తెలిసిన వాళ్లకు ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా దండుకుంటున్న వారి భాగోతం ఆశ్చర్యకరంగా మారుతోంది. అధికార పార్టీ ముసుగులో సాగుతున్న అక్రమాల వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. మొత్తంగా తెలుగుదేశం సోషల్ మీడియా విభాగంలో కీలకంగా వ్యవహరించిన మౌనిక అడ్డంగా బుక్కవ్వడం మాత్రం ఆశ్చర్యకరమే.


Related News

amaravati design

అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్

Spread the loveఏపీ రాజధానిలో రకరకాల నగరాల నిర్మాణం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించారు కూడా. పరిపాలన అంతాRead More

tv channels ratings

‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?

Spread the loveఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. కత్తి మహేష్ కి, పవన్ కళ్యాణ్ అభిమానులకు మొదలయిన వార్ మరింత ముదరడంలోRead More

 • గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని
 • తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్
 • ఇంగ్లీష్ చానెల్ తో టీవీ5 టైఅప్
 • వైసీపీ పరువు తీస్తున్న సోషల్ మీడియా
 • సోషల్ మీడియా సాయంతో ముంచేసింది…
 • ‘తెలుగు’ సభల్లో ఈనాడు సొంత డబ్బా
 • పవన్ కల్యాణ్ కి ఏబీఎన్ ఆర్కే ఘాటు లేఖ
 • తెలుగు మీడియాకి అది పోలవరమే…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *