మోడీ సర్కార్ వెనకడుగు

మోడీ సర్కార్ వెనకడుగు వేసింది. ఇటీవల వరుసగా పలు నిర్ణయాల విషయంలో కేంద్రం పదే పదే మార్పులు చేసుకుంటుండడం గమనిస్తే మోడీ సర్కారు డిఫెన్స్ లో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక తాజాగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లో రివ్యూకి వెళ్ళాల్సిన స్థితి ప్రభుత్వానికి వచ్చింది. అందుకు తోడుగా ఫేక్ వార్తల విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఆదేశాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. దాంతో జర్నలిస్టులకు కొంత ఉపశమనం దక్కింది.
ఫేక్ వార్తల పేరుతో పాత్రికేయుల అక్రిడిటేషన్ రద్దు చేస్తామంటూ కేంద్ర సమాచార ప్రచారాల శాఖ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. దాంతో వాటిపై జర్నలిస్టులు తీవ్రంగా మండిపడ్డారు. పెను దుమారం రేగింది. రాజకీయ పక్షాలు కూడా విరుచుకుపడ్డాయి. ఎమర్జన్సీ ని తలపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డాయి. దాంతో చివరకు నిర్ణయాన్ని సవరించాలని ఆదేశించిన పీఎంవో, ఆ తర్వాత మొత్తం ఉత్తర్వులు ఉపసంహరించాలని ఆదేశించింది. ఈ మేరకు అక్రిడిటేషన్ రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది.
ఫేక్ వార్తల విషయంలో నిర్ధారణకు తగిన యంత్రాంగం లేకుండా, ఏది ఫేక్, ఏది కాదు అన్నది తగిన మార్గదర్శక సూత్రాలు కూడా లేకుండా, యాజమాన్యాలే వార్తలు సృష్టించే దశకు చేరిన సమయంలో ఇలాంటి ఉత్తర్వులతో కలాన్ని కట్టడి చేయాలనే యత్నం తగదని వచ్చిన అభిప్రాయంతో మోడీ ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు స్పష్టం అవుతోంది.
Related News

ఆ చానెల్ ని కూడా వదిలిపెట్టని పవన్ కళ్యాణ్
Spread the loveజనసేన అధినేత దూకుడు పెంచాడు. ఈసారి నేరుగా ఆయన పొలిటికల్ వార్ మాత్రమే కాకుండా మీడియాతోనూ యుద్ధంRead More

హోదా ఉద్యమానికి మీడియా ఆటంకం?
Spread the loveఇలాంటి అనుమానం కలుగుతోంది. గతంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో తెలుగు మీడియా మరో మాట మాట్లాడకుండాRead More