Main Menu

మీటూ ఎఫెక్ట్: ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌పై వేటు

Spread the love

మాజీ పత్రికా సంపాదకులు ఎంజె అక్బర్‌, తరుణ్‌ తేజ్‌పాల్‌ను బుధవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ) సస్పెండ్‌ చేసింది. కాగా జర్నలిస్టు గౌతమ్‌ అధికారిపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించాలని ఆయనను కోరాలని ఇజిఐ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ నిర్ణయించింది. పత్రికా సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో ఎంజె అక్బర్‌ తమను లైంగిక వేధింపులకు గురిచేశారని పలువురు మహిళలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అక్బర్‌ ఈ ఏడాది అక్టోబర్‌లో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా రాజీనామా చేయాల్సి వచ్చింది. తెహల్కా మాగ్‌జైన్‌ మాజీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ తేజ్‌పాల్‌ కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నారు. గోవాలో 2012లో ఒక హోటల్‌లో తన జూనియర్‌ మహిళా సహచరురాలిపై లైంగిక దాడికి పాల్పడిన ఆరోపణలు తేజ్‌పాల్‌పై ఉన్నాయి. ఆరోపణల నేపథ్యంలో తేజ్‌పాల్‌ అరెస్టయ్యారు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చారు.

డైలీ న్యూస్‌ అండ్‌ ఎనాలిసిస్‌ పత్రిక వ్యవస్థాపక సంపాదకుడు అధికారి కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ముగ్గురు మహిళలు ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకుంటూ ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా ఒక ప్రకటన జారీ చేసింది. ”పలువురు మహిళా జర్నలిస్టులు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల మేరకు ఎంజె అక్బర్‌, తరుణ్‌ తేజ్‌పాల్‌, గౌతమ్‌ అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అభిప్రాయాలను ఎడిటర్స్‌ గిల్డ్‌ కోరింది. ఎడిటర్స్‌ గిల్డ్‌ జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు అక్బర్‌ తరుపు న్యాయవాది ఇచ్చిన సమాధానాన్ని కూడా ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి అందించాం. ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో ఎక్కువ మంది సభ్యులు అక్బర్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సూచించారు. తనపై విచారణ పూర్తయ్యే వరకు తేజ్‌పాల్‌ను కూడా సస్పెండ్‌ చేయాలని సభ్యుల నుండి ఏకాభిప్రాయం వచ్చింది. కాగా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించాలని కోరుతూ అధికారికి మాత్రం లేఖ రాశాం’ అని తెలిపింది.






Related News

ఏబీఎన్ ఎందుకు బ‌రి తెగిస్తోంది..?

Spread the loveమీడియాలో క‌థ‌నాల విష‌యంలో యాజ‌మాన్యాల ప్ర‌యోజ‌నాలుంటాయ‌న‌డంలో సందేహం లేదు. వారి రాజ‌కీయ ల‌క్ష్యాల‌క‌నుగుణంగా వార్త‌లు రాస్తుంటార‌న‌డంలో సందేహంRead More

సాక్షికి రెట్టింపులో టీవీ9

Spread the loveతాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర ముగింపు తెలుగు మీడియాలో సెంట‌ర పాయింట్ అవుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *