Main Menu

గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని

Spread the love

తెలుగు మీడియా చానెల్స్ యజమానుల వ్యవహారం ఓ అడుగు ముందుకేసింది. ఇప్పటికే అనేక వ్యవహారాలను చక్కదిద్దుకున్న పెద్దలు ఇప్పుడు ఏకంగా ఓ ప్రతిష్టాత్మక అవార్డ్ విషయంలో పోటీదారుడిని ఇరుకున పెట్టడంలో ఎంతకైనా తెగిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే గజల్స్ శ్రీనివాస్ వ్యవహారం తెరమీదకు వచ్చినట్టు కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ అవార్డులను త్వరలో ప్రకటించబోతున్నారు. దాంతో వాటి కోసం లాబీయింగ్ నడుస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే తెలుగు గడ్డ మీద ఆధ్యాత్మకి సేవ కోటాలో ఇద్దరు ప్రముఖులు పోటీ పడడం వివాదానికి మూలంగా భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ సేవలతో గజల్స్ శ్రీనివాస్ గట్టిగా ప్రయత్నిస్తుండగా, అదే తరహాలో కార్తీక మాసంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో పెద్ద స్థాయిలో హంగామా చేసే టీవీ చానెల్స్ యజమాని పోటీకి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. న్యూస్ చానెల్ ద్వారా తెలుగుమీడియాలో ప్రవేశించినప్పటికీ ఆ తర్వాత భక్తిరసం రాష్ట్రమంతటా పారిస్తూ ప్రముఖ వ్యక్తిగా పేరుపొందిన వ్యక్తి పద్మ అవార్డ్ కోసమే తన పోటీదారుని బద్నాం చేసే పనికి దిగినట్టు తెలుస్తోంది.

వారిద్దరి మధ్య పోటీ తీవ్రం కావడం, ఇద్దరినీ ప్రతిపాదించే వాళ్ళు ఒక్కరే కావడంతో, ఇక లాభం లేదనుకుని మసాజ్ వ్యవహారం ముందుకు తెచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఇలాంటి మసాజ్ వ్యవహారాలలో సదరు చానెల్ యజమాని చాలా సిద్ధహస్తుడని కూడా చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం స్పై కెమెరాలు సరఫరా చేసి, ఆ యువతిని అడ్డు పెట్టుకుని ఆడిన నాటకంలో గజల్స్ గలీజు వ్యవహారం బయటకు వచ్చినట్టు భావిస్తున్నారు. కారణమేదయినా చివరకు ఓ భాగోతం బయటపడింది. అదే సమయంలో అసలు కథ మాత్రం చాలా పెద్దగానే ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం 8 గంటల పాటు స్పై కెమెరా రికార్డెడ్ విజువల్స్ ఉన్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి స్పై కెమెరా బ్యాటరీ మూడు గంటల పాటు మాత్రమే పనిచేస్తుంది. అంటే మధ్యలో మార్చాల్సి ఉంటుంది. అలాంటి వ్యవహారం అంతా ఒక్కరే చక్కబెట్టే ఛాన్స్ తక్కువే అని చెప్పవచ్చు. అంత ఖరీదైన కెమెరాలను ఓ సాధారణయువతి కొనుగోలు చేసే అవకాశం కూడా తక్కువే. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరన్నది బయటకు వస్తే కొత్త పరిణామాలు మరింత చర్చకు దారితీస్తాయని చెప్పక తప్పదు.


Related News

మీటూ ఎఫెక్ట్: ఇద్ద‌రు ఎడిట‌ర్ల‌పై వేటు

Spread the loveమాజీ పత్రికా సంపాదకులు ఎంజె అక్బర్‌, తరుణ్‌ తేజ్‌పాల్‌ను బుధవారం ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఇజిఐ)Read More

చ‌ర్చ‌నీయాంశంగా మారిన టీవీ9 స‌ర్వే

Spread the loveప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరులో ప్ర‌తీ అవ‌కాశం కూడా వినియోగించుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మీడియా అందుకు తందానRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *