Main Menu

బాబు ప‌రువు తీసిన మీడియా

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబు కి అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న‌ట్టుగా మారింది. ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో నిర్వ‌హించిన ఢిల్లీ దీక్ష చివ‌ర‌కు ప‌రువు తీసేందుకు తోడ్ప‌డింది. ఇప్ప‌టికే నేరుగా పీఎం కూడా ఫోటోల‌కు ప్ర‌జాధనం వినియోగిస్తున్నారంటూ విమ‌ర్శించారు. అయినా వెనుకాడ‌ని ఏపీ స‌ర్కారు ప్ర‌జాధ‌నం పెద్ద మొత్తంలో వినియోగించి అంద‌రినీ విస్మ‌య‌ప‌రుస్తోంది.

తెలుగు మీడియాలో దాదాపుగా మౌనం వ‌హించిన ఈ విష‌యాన్ని ఢిల్లీ ప‌త్రిక‌లు, చానెళ్లు మాత్రం ఎండ‌గ‌ట్టాయి. ఏక‌రీతిని చంద్ర‌బాబు తీరు మీద దుమ్మెత్తిపోశాయి. 10 కోట్ల జీవో సాక్షిగా ఖ‌రీదైన నిర‌స‌న‌గా వ్యాఖ్యానించాయి. ఏపీ ప్ర‌భుత్వ దుబారాని తూర్పార‌బ‌ట్టాయి. దాంతో చంద్ర‌బాబు ఆశించిన దానికి భిన్నంగా జ‌రిగింద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ దీక్ష ప్రారంభంలోనే చంద్ర‌బాబు ఇంగ్లీష్ మీడియాని అభ్య‌ర్థించారు. కార్య‌క్ర‌మాన్ని లైవ్ లో చూపాల‌ని విన్న‌వించారు. కానీ దానికి విరుద్ధంగా బాబు బండారం బ‌య‌ట‌పెట్టేందుకు ఆ మీడియా ప్రాధాన్య‌త‌నివ్వ‌డంతో ప‌లువురు టీడీపీ నేత‌లు సైతం ఈ వ్య‌వ‌హారం మీద పెద‌వి విప్పేందుకు సిద్ధం కావ‌డం లేదంటే సీన్ అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక అదే స‌మ‌యంలో గ‌త జ‌న‌వ‌రి 1 నుంచి గ‌డిచిన న‌ల‌భై రెండో రోజుల్లో న‌రేంద్ర మోడీ 18 రాష్ట్రాల‌లో ప‌ర్య‌టించారు. ప్ర‌ధాని హోదాలో ప‌ర్య‌టిస్తూ పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. అయినా ఢిల్లీ మీడియా ఈ విష‌యంలో నోరు మెద‌క‌ప‌క‌పోవ‌డం విశేషంగానే చెప్ప‌వ‌చ్చు. త‌మ‌కు కావాల్సిన అంశాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావిస్తూ మీడియా సాగుతున్న తీరు చాలామందిని అపోహ‌ల్లో ముంచుతోంది. మీడియా విలువ‌ను దిగ‌జారుస్తోంది.






Related News

బాబు ప‌రువు తీసిన మీడియా

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు కి అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న‌ట్టుగా మారింది. ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో నిర్వ‌హించిన ఢిల్లీ దీక్ష చివ‌ర‌కుRead More

10టీవీ స్కామ్ ఎన్ని కోట్లు..?

Spread the loveఒక ప‌త్రిక‌లో ‘చందా..దందా’ అంటారు. మ‌రొక‌రు ‘రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం’ అంటారు. ఇంకొంద‌రు అడుగుముందుకేసి మీడియాలో మ‌రోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *