Main Menu

జ‌య‌రామ్ హ‌త్య కేసులో మీడియా త‌ప్పిదం!

Spread the love

మీడియా అత్యుత్సాహం మ‌రో యువ‌కుడిని చిక్కుల్లో నెట్టింది. తాజాగా సంచ‌ల‌నం రేపిన చిగుర‌పాటి జ‌య‌రామ్ కేసులో ప్ర‌ధాన నిందితుడు రాకేశ్ రెడ్డి విష‌యం చివ‌ర‌కు రాకేశ్ చౌద‌రికి స‌మ‌స్య‌గా మారింది. మీడియా అత్యుత్సాహంతో త‌ప్పులో కాలేయ‌డంతో అత‌డికి తిప్ప‌లు త‌ప్ప‌లేదు.

చిగురుపాటి జయరాం కేసుపై న్యూస్ ప్రసారం చేస్తున్న చానళ్లలో నిందితుని ఫోటో రాకేశ్ రెడ్డి స్థానంలో రాకేశ్ చౌద‌రి ఫోటో ముడిపెట్ట‌డం విస్మ‌యం క‌లిగిస్తోంది. తిరుపతికి చెందిన ఆ రాకేశ్ చౌదరి వేరు ఈ నిందితుడు రాకేశ్ రెడ్డి వేరు అనే విషయం మరిచి ఈ ప్రసారం కొనసాగుతుంద‌ని బాధితుడు వాపోతున్నాడు.

అయితే ఈ విషయం తెలుసుకున్న రాకేశ్ చౌదరి న్యూస్ ప్రచురించిన అన్ని చానళ్ళపై కోర్టుకి వెళ్ళబోతున్నట్లు ప్రకటించారు. కోర్టు వేసే పరువు నష్టం దావాతో అయినా టీవీ ఛానళ్ల యజమానులు ఇకపై జాగ్రత్త వహిస్తారని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక కుటుంబానికి వీళ్ళు కలిగించిన మానసిక క్షోభ తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని.. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప‌దిమంది దోషులు త‌ప్పించుకున్నా ఫ‌ర్వాలేదు గానీ ఒక్క నిర్ధోషి కూడా శిక్షించ‌బ‌డ‌కూడ‌ద‌ని భావించే భార‌తీయ న్యాయ‌వ్య‌వ‌స్థ అమ‌లులో ఉన్న ద‌శలో ఓ అనామ‌క యువ‌కుడికి భారీ హ‌త్యాప‌థ‌కంతో ముడిపెట్టి ప్ర‌చారం చేసిన తీరు మీద ప‌లువురు తీవ్రంగా మండిప‌డుతున్నారు. ఒక వార్త ప్ర‌సారం చేసిన‌ప్పుడు నిర్థారించుకోవాల్సి ఉండ‌గా ..ఇలా ఏక‌ప‌క్షంగా క‌థ‌నాల కోసం ఫోటోలు వినియోగించ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.






Related News

డిజిట‌ల్ న్యూస్ లో టాప్ బ్రాండ్స్ ఇవే..!

Spread the loveదేశంలో ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియా విస్త‌ర‌ణ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మ‌రింత విస్త‌రించ‌డం ఖాయంగాRead More

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *