Main Menu

మిడిమిడి మీడియా అంటే అదే..!

Spread the love

ఇప్ప‌టికే అంద‌రికీ అర్థ‌మ‌య్యింది. మీడియా అంటే నిష్ఫ‌క్ష‌వార్త‌లు అందిస్తుంద‌ని న‌మ్మిన త‌రం నుంచి మీడియా అంటే ఆర్థిక ప్ర‌యోజ‌నాల ప‌ర‌మావ‌ధిగా, రాజ‌కీయ ల‌క్ష్యాల సాధ‌నలో కొంద‌రి చేతిలో పావుగా మారింద‌ని ప‌లువురి అభిప్రాయం. తాజా ప‌రిణామాలు మ‌రోసారి ఈ విష‌యాన్ని రుజువు చేశాయి. ప్ర‌జ‌ల్లో మీడియా ని మ‌రింత పలుచ‌న చేశాయి.

తాజాగా తిత్లీ తుఫాన్ దెబ్బ‌కు ఉత్త‌రాంధ్ర అత‌లాకుత‌లం అయ్యింది. అందులోనూ శ్రీకాకుళం గుండె చెదిరింది. ఉద్దానం ప్రాంతంలో అధ్వాన్న ప‌రిస్థితి దాపురించింది. తుఫాన్ మిగిల్చిన చేదు జ్ఞాప‌కాల‌తో ఇచ్ఛాపురం, ప‌లాస ప్రాంతాల్లో జ‌నం అల్లాడిపోతున్నారు. చంద్ర‌బాబు చెప్పిన మాట‌ల ప్రకారం 50శాతం మందికి మంచి నీళ్ళు కూడా అంద‌లేద‌ని, 60శాతం మందికి ఆహారం లేద‌ని అసంతృప్తి వ్య‌క్త‌మ‌య్యింది. ఇంత‌టి ద‌య‌నీయ ప‌రిస్థితిపై మీడియా మౌనం చాలామందిని క‌లిచివేస్తోంది.

ఇప్ప‌టికే అనేక అంశాల్లో అంద‌మైన అమ్మాయిల కేసుల‌యితే అత్యుత్సాహం చూపుతార‌నే అభిప్రాయం మీడియా క‌థ‌నాలు క‌లిగిస్తాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే వైజాగ్ లాంటి ఆర్థిక రాజ‌ధాని హుద్ హుద్ దెబ్బ‌కు కుదేల‌యితే జ‌రిగిన ప్ర‌చారం అంతా ఇంతా కాదు. బులిటెన్ల త‌ర‌బ‌డి విశాఖ వ్య‌ధ‌పై, రోజుల త‌ర‌బ‌డి క‌థ‌నాలు వ‌చ్చాయి. మెగా సిటీ కి క‌ష్ట‌మొస్తే త‌మ‌కే క‌ష్ట‌మ‌న్న‌ట్టుగా మీడియా మొత్తం హంగామా చేసింది. కానీ ఇప్పుడు మారుమూల శ్రీకాకుళం జిల్లా చిక్కి శ‌ల్య‌మ‌యినా త‌మ‌కు చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేద‌న్న‌ట్టుగా మీడియా హౌసులు సాగ‌డం విషాద‌క‌ర అంశంగా క‌నిపిస్తోంది. మీడియా కంటికి మామూల మ‌నుషుల క‌ష్టాలు , తుఫాన్ బాధితుల ఆర్త‌నాదాలు వినిపించ‌క‌పోవ‌డం విస్మ‌య‌క‌రం అవుతోంది.

అదే స‌మ‌యంలో సీఎం ర‌మేష్ ఇంట ఐటీ దాడులు సాగుతుంటే అదేదో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కే క‌ష్టం వ‌చ్చింద‌న్న‌ట్టుగా లైవ్ క‌థ‌నాల‌తో హోరెత్తించాయి. తీవ్ర క‌ల‌క‌లం క్రియేట్ చేశాయి. అస‌లు నీట మునిగిన నేల‌ను మ‌ర‌చిపోయి, కొంప‌లు మునిగియాన్న‌ట్టుగా సీఎం ర‌మేష్ చుట్టూ చానెళ్లు తిరిగాయి. చివ‌ర‌కు లాభానికి త‌న త‌ర‌త‌మ బేధాలుండ‌వ‌ని చాటుతూ మాన‌వ‌త్వం కూడా మ‌ర‌చిపోయి, అత్యంత క‌ష్ట‌కాలం అనుభ‌విస్తున్న శ్రీకాకుళం వాసుల ప‌ట్ల చిన్న‌చూపు ప్ర‌ద‌ర్శించాయి. దాంతో త‌మ అస‌లు నైజాన్ని చాటుకున్న మీడియా వికృత‌రూపం అంద‌రినీ క‌లచివేస్తోంది. కంట నీరు ర‌ప్పించే దృశ్యాల‌ను కూడా లోకానికి చూపించే తీరిక‌లేని చానెళ్ల తీరు చిరాకు క‌లిగిస్తోంద‌న‌డంలో సందేహం లేదు. అర‌కొర క‌వ‌రేజ్ తో స‌రిపెట్టి జ‌నం అవ‌స్థ‌ల‌ను స‌రిపెట్టిన తీరుపై సోష‌ల్ మీడియా విమ‌ర్శ‌లు విస్తృత‌మ‌వుతున్నాయి.


Related News

మీడియాకు జ‌న‌సేన ఝ‌ల‌క్

Spread the loveవైసీపీ అధికారిక ప‌త్రిక ముసుగులో స‌ర్థుబాట్లు పేరుతో రాసిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపింది. జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్యRead More

బాబు ప‌రువు తీసిన మీడియా

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబు కి అనుకున్న‌దొక‌టి..అయ్యిందొక‌టి అన్న‌ట్టుగా మారింది. ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌తో నిర్వ‌హించిన ఢిల్లీ దీక్ష చివ‌ర‌కుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *