Main Menu

మీడియా వికృత‌పోక‌డ‌లు..

Spread the love

యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. మ‌ళ్లీ పాకిస్తాన్ తో ఆయుధ పోరు వైపు అడుగులు ప‌డుతున్నాయి. హ‌స్తిన వేడెక్కుతోంది. అంత‌కుమించి మీడియా వైప‌రీత్యం క‌నిపిస్తోంది. అస‌లుకి మించి కొస‌రు వ్య‌వ‌హారాల‌తో విశృంఖ‌లంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. వాస్త‌వాల‌కు అతీతంగా ఊక‌దంపుడు క‌థ‌నాలు వండి వార్చే ప్ర‌య‌త్నం చేస్తోంది.

వాస్త‌వానికి వ‌ర్త‌మానంలో టీవీ చానెళ్ల ప్రభావం తీవ్రంగా ఉంది. కానీ పాకిస్తాన్ తో కార్గిల్ యుద్ధం నాటికి పరిస్థితి వేరు. ఒక‌టి రెండు చానెళ్లు మాత్ర‌మే, అవి కూడా ఢిల్లీ కేంద్రంగా ఉండేవి. గ‌డిచిన ఇర‌వై ఏళ్ల‌లో దేశ‌మంతటా ప్రాంతీయ భాష‌ల్లో విస్త‌రించిన మీడియా ఇప్పుడు వెర్రిత‌ల‌లు వేస్తోంది. యుద్ధం వార్త‌ల విష‌యంలో ఇష్టారాజ్యంగా సాగుతోంది.

చివ‌ర‌కు స‌ర్జిక‌ల్ స్ట్రైక్ 2 విష‌యంలో వీడియో గేమ్ లో ని విజువ‌ల్స్ వాడేసి అంద‌రి ముందూ అభాసుపాల‌య్యింది. పాకిస్తాన్ లో కూడా ఎద్దేవా చేసేవర‌కూ వెళ్లింది. పాకిస్తాన్ మీడియా కూడా త‌క్కువేమీ కాదు. 2016లో జ‌రిగిన విమాన ప్ర‌మాద విజువ‌ల్స్ ని ఇప్పుడే ఇండో ఎయిర్ క్రాఫ్ట్ ని నేల‌కూల్చిన పాక్ సైన్యం అంటూ పెట్రేగిపోతోంది. ఇలా ఇరువైపులా ప్ర‌జ‌ల‌లో యుద్ధం కాంక్ష రాజేసే రీతిలో వ్య‌వ‌హ‌రించిన మీడియా ఇప్పుడు నిరాధార క‌థ‌నాల‌తో మ‌రింత వేడి రాజేస్తోంది.

దేశ‌మంత‌టా ఇప్పుడు మీడియా తాలూకా వికృత చేష్ట‌లే ప్ర‌త్య‌ర్థి ప్ర‌భావం క‌న్నా ఎక్కువ న‌ష్టం చేకూర్చేలా ఉంద‌నే అభిప్రాయం కొంద‌రిలో వ్య‌క్తం అవుతోంది. యుద్ధం వంటి స‌మ‌యాల్లో సంయ‌మ‌నం, వాస్త‌వ స‌మాచారం ఆధారంగా సాగాల్సిన వార్తా ప్ర‌సారంలో దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వైప‌రీత్యానికి కార‌ణంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ విష‌యంలో ప్రాంతీయ మీడియా పూర్తిగా జాతీయ చానెళ్ల మీద ఆధార‌ప‌డుతుంది. అక్క‌డి చానెళ్లు అందించే అర‌కొర క‌థ‌నాల‌కు, మ‌రింత మ‌సాలా జోడించి మందిని మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం ప్ర‌మాద‌క‌రంగా భావించాలి. యుద్ధ వార్త‌ల విష‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు. స్వీయ నియంత్ర‌ణ లేని మీడియా స‌మాజానికి చేటు చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు.


Related News

డిజిట‌ల్ న్యూస్ లో టాప్ బ్రాండ్స్ ఇవే..!

Spread the loveదేశంలో ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియా విస్త‌ర‌ణ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మ‌రింత విస్త‌రించ‌డం ఖాయంగాRead More

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *