ఏబీఎన్ ఆర్కేపై ఎమ్మెల్యే ఆర్కే దెబ్బ

Vemuri-RadhakrishnaABN RK
Spread the love

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. వరుసగా కోర్టుల ద్వారా ఏపీ సర్కారును బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సదావర్తి భూముల విషయంలో ఎమ్మెల్యే అనుకున్నది సాధించారు. కారుచౌకగా భూములు కట్టబెట్టారంటూ ఆయన చేసిన వాదన చివరకు ఫలించింది. ఆ భూములు మరోసారి వేలం వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ఇప్పుడు ఆయన కన్ను ఏబీఎన్ చానెల్ యజమాని పై పడింది. దాంతో ఇప్పుడు అటు చంద్రబాబుని, ఇటు ఏబీఎన్ ని నిలదీసే అవకాశం ఆయన అందిపుచ్చుకున్నారు. ఆ విషయాన్ని కూడా కోర్టుల్లోకి లాగి కథ కొత్త మలుపు తిప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కులను అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌కు కట్టబెట్టారు. కేవలం అసెంబ్లీ ప్రసారాలే కాకుండా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను కూడా అదే సంస్థ లైవ్ ప్రసారాలు చేస్తోంది. అయితే అలాంటి హక్కులు అక్రమంగా కట్టబెట్టారంటూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దాంతో ఈ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు విచారణకు కూడా స్వీకరించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అంతేగాకుండా రెండువారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి, అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌కు ఆదేశాలు జారీచేసింది. దాంతో ఏబీఎన్ కి ఈ వ్యవహారం తలనొప్పిగా మారబోతోంది.

వాస్తవానికి ఏబీఎన్ చానెల్ ను ఆమోదా బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ తరుపున నడుపుతున్నారు. అదే ఏబీఎన్ ద్వారా లైవ్ ప్రసారాలు చేస్తూ దానిని మాత్రం అడ్వాన్స్ డ్ టెలీ కమ్యూనికేషన్ అనే సంస్థ పేరుతో తీసుకున్నారు. అయితే ఈ కొత్త సంస్థ వేమూరి రాధాకృష్ణ తనయుడు వేమూరి ఆదిత్య పేరుతో ఉండడం విశేషం. అదే ఇప్పుడు ఏబీఎన్ ఆర్కే ఎందుకు చంద్రబాబు ప్రభుత్వానికి బాకా ఊదుతారన్న విషయం అందరికీ అర్థం అవుతోంది.

అయితే ఏబీఎన్ ఆర్కేకి ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో టెండర్లు లేకుండా ఆ సంస్థకు కట్టబెట్టారన్నది ఎమ్మెల్యే ఆర్కే ప్రధాన వాదన. ఈ హక్కులు కేటాయించేందుకు టెండర్లు పిలువాల్సి ఉంటుందని, కానీ నిబంధనలను పక్కనబెట్టి అడ్వాన్స్‌డ్‌ టెలీకమ్యూనికేషన్‌ సంస్థకు స్పీకర్‌ ఇచ్చారని తెలుస్తోందని పిటీషనర్ వాదిస్తున్నారు. ప్రతిపక్షానికి, పాలకపక్షానికి సంధానకర్తగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ తన విధులను నిర్వర్తించకుండా.. తమ సభ్యుల గొంతులను నొక్కివేస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాల హక్కుల కేటాయింపులో క్విడ్‌ ప్రో కో జరిగిందని ఆయన ఆరోపించారు. సమయాభావం వల్ల టెండర్లు పిలవలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. దాంతో ఇప్పుడీ విషయం తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది. సదావర్తి భూముల మాదిరిగా మళ్ళీ టెండర్లు పిలవాల్సి వస్తే ఇన్నాళ్లుగా భారీగా ప్రభుత్వ నజారానా సాధిస్తున్న వారికి చేదు పలితం తప్పదనే అంచనాలున్నాయి.

అంతేగాకుండా తెలుగుదేశం నేతలపై, చివరకు మంత్రులపై కేసులు కొట్టివేస్తూ సర్కారు జారీ చేసిన జీవోలపై కోర్టుకెళ్లిన ఆర్కే కూడా ఆ విషయంలో ఓ అడుగు వేశారు. కోర్ట్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తుది తీర్పు ఎలా ఉంటుందోననే ఆసక్తి మొదలయ్యింది.


Related News

abn-tv9-banned-telangana

టీవీ9 రాజేస్తే ..ఏబీఎన్ పరిష్కరించిందా?

Spread the loveతెలుగు మీడియా పెద్ద వివాదంలో ఇరుక్కుంది. ముఖ్యంగా టీవీ9 మీద సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత కనిపించింది.Read More

nexus2cee_youtube-share-728x408

యూట్యూబ్ రూల్స్ మార్చేసింది…

Spread the loveఇవాళ , రేపు యూ ట్యూబ్ చానెల్స్ పెట్టడం చాలా సాధారణంగా మారిపోయింది. ప్రతీ ఒక్కరూ ఓRead More

 • అమరావతి ఆశలు నీరుగార్చేసిన చానెల్
 • ‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?
 • గజల్స్ గలీజు వెనుక మీడియా చానెల్స్ యజమాని
 • తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్
 • ఇంగ్లీష్ చానెల్ తో టీవీ5 టైఅప్
 • వైసీపీ పరువు తీస్తున్న సోషల్ మీడియా
 • సోషల్ మీడియా సాయంతో ముంచేసింది…
 • ‘తెలుగు’ సభల్లో ఈనాడు సొంత డబ్బా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *