ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి నోటీసులు

Meeting-Narendra-Modi-Strategical-Mistake-by-YS-Jagan
Spread the love

ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి నోటీసులు జారీ అయ్యాయి. పత్రికలో వచ్చిన కథనాలతో ఎండీ రాధాక్రుష్ణ, ఎడిటర్ కే శ్రీనివాస్ తో పాటు పలువురికి నోటీసులు జారీ చేస్తూ కోర్ట్ ఆదేశాలు విడుదల చేసింది. దాంతో ఇప్పుడు ఆంధ్రజ్యోతికి చిక్కులు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చాలాకాలంగా ఆ సంస్థ ఏకపక్షంగా వార్తలు రాస్తున్నప్పటికీ సహించిన ప్రతిపక్షం తాజాగా కోర్టుకెక్కడంతో కథ కొత్త మలుపు తిరిగినట్టుయ్యింది. ఆధారాలతో సహా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రుష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్ లో ఆంధ్రజ్యోతి యాజమాన్యం వివాదంలో ఇరుక్కున్నట్టయ్యింది.

రాష్ట్రపతి ఎన్నికలకు ముందు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రధానమంత్రిని మోడీని కలిసిన సంగతి తెలిసిందే. ఆ సందర్బంగా మోడీకి సమర్పించిన వినతిపత్రం ఇదేనంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనం అల్లింది. దాని ప్రకారం జగన్ వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప రాష్ట్రం అవసరాల గురించి ప్రస్తావించలేదన్నది ఆ వార్త సారాంశం. అయితే వాస్తవానికి మోడీకి జగన్ ఇచ్చిన లేఖ కాపీని కూడా జతచేసి కోర్టులో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దాంతో స్పందించిన కోర్ట్ ఎండీ, ఎడిటర్ తో పాటు శేషగిరి రావు, ఇతర ఆంధ్రజ్యోతి సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. ఆరుగురికి నోటీసులతో పాటు వచ్చే నెల 14న కోర్టుకి హాజరుకావాలని ఆదేశించింది.

దాంతో ఈ విషయంలో ఆంధ్రజ్యోతి ఇరుక్కున్నట్టే భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి మోడీకి జగన్ ఏ లేఖ ఇచ్చారన్నది పీఎంవో నుంచి అధికారిక సమాచారం ఇవ్వరికీ ఇవ్వలేదని తాజాగా ఆర్టీఐలో స్పష్టం అయ్యింది. అంటే ఆంధ్రజ్యోతికి ఆ లేఖ అందే అవకాశం లేదు. ఒకవేళ ఆంధ్రజ్యోతికి నిజంగా లేఖేనని నిరూపించాలంటే ఆ లేఖ ఎలా వచ్చిందన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఏకంగా పీఎంవో నుంచే అనధికారికంగా లేఖలు బయటకురావడం అంటే మోడీకి తలవంపుగా మారుతుంది. కాబట్టి ఈ విషయంలో ఆంధ్రజ్యోతికి ఉన్న ఏకైక మార్గం రాజీపడడమే. లేదంటే కేసు ఎన్నాళ్ల పాటు సాగినప్పటికీ చివరకు వైసీపీ నేతల వాదన ముందు శిరోభారం తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఇక ఇప్పటికే సదావర్తి భూముల వేలం విషయంలో చంద్రబాబు సర్కారు అవకాశవాదాన్ని కోర్టుల ద్వారా ఎండగట్టిన ఆర్కే ఈ కేసు వేయడం విశేషం. అంతేగాకుండా ఆయన ఇటీవలే మరో పిటీషన్ లో హైకోర్ట్ ని ఆశ్రయించారు. ఏబీఎన్ సంస్థకు టెండర్లు లేకుండా ఏకపక్షంగా అసెంబ్లీ ప్రసారహక్కులు కల్పించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. రాధాక్రుష్ణ తనయుడు ఆదిత్య పేరుతో ఉన్న సంస్థకు ప్రసారహక్కుల పేరుతో సర్కారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరుపై ఇప్పటికే నోటీసులు జారీ కావడం విశేషం.


Related News

NDTV

ఎన్డీటీవీ కేసు కొట్టివేత

Spread the loveషేర్‌ హోల్డర్ల వివరాలు వెల్లడించడంలో ఎన్‌డిటివి ప్రమోటర్లు జాప్యం చేశారనే ఆరోపణలపై న్యూఢిల్లీ టెలివిజన్‌ లిమిటెడ్‌ (ఎన్‌డిటివి)Read More

download

హాత్ వే తో యూప్ టీవీ

Spread the love భారతదేశంలో అతి పెద్ద కేబుల్ బ్రాండ్ ప్రొవైడర్ హాత్వే , ప్రపంచంలో అత పెద్ద ఓవర్Read More

 • మీడియా కట్టడికి కొత్త చట్టాలు
 • హాన్స్ ఇండియా నుంచి ఆయన అవుట్
 • అయ్యో…ఈనాడుకి స్పీకర్ కొడుకు తెలియదట!
 • ఆ టీవీ చానెల్ ఆస్తులు ఎటాచ్ మెంట్
 • తెలుగు పత్రికలు తీరు అంతేనయా
 • కాషాయ ఈనాడు…
 • ‘జీ’ చేతికి మరో రెండు చానెళ్లు
 • మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *