Main Menu

స్ట్రింగ్ ఆప‌రేష‌న్ తో మీడియా గుట్టుర‌ట్టు…

Spread the love

మీడియా గుట్టుర‌ట్ట‌య్యింది. పెయిడ్ న్యూస్ పేరుతో ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే దందా బ‌ట్ట‌బ‌య‌లు అయ్యింది. దాంతో ఈ వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కోబ్రా పోస్ట్ సంస్థ నిర్వ‌హించిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్ లో ప‌లు చానెళ్లు, ప్ర‌త్రిక‌ల బండారం బ‌య‌ట‌ప‌డింది. కోబ్రా పోస్ట్ ప్రతినిధి పుష్ప శర్మ నిర్వ‌హించిన ఆప‌రేష‌న్ తో అస‌లు రంగు బ‌య‌ట‌కు వ‌చ్చింది. తన పేరును ఆచార్య అటల్‌గా మార్చుకొని దాదాపు ఏడు నెలల పాటు వివిధ మీడియా సంస్థ ఎగ్జిక్యూటివ్‌లతోనూ, రిపోర్టర్లతోనూ సమావేశమై ఆ దృశ్యాలను రికార్డ్ చేసిన వాటిని ఆప‌రేష‌న్ 136 పేరుతో విడుద‌ల చేశారు. ప్ర‌పంచ ప‌త్రికా స్వేచ్ఛ‌లో భార‌త‌దేశ స్థానం 136 కావ‌డంతో ఈ ఆప‌రేష‌న్ కి ఆ పేరు పెట్టిన‌ట్టు చెబుతున్నారు.

త‌న‌ను తాను భగద్గీత ప్రచార సమితికి చెందినవాడినని ప్ర‌చారం చేసుకుని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)కు చెందిన ‘సంఘటన్‌’ సంస్థ ప్రతినిధినని పరిచయం చేసుకుని ఈ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. హిందూత్వ ప్రచారానికి సహకరించి 2019 ఎన్నికల్లో బిజెపికి ఓట్లు పడేలా చేయ‌డానికి త‌గ్గ‌ట్టుగా ప్యాకేజీలు మాట్లాడుకున్న వ్య‌వ‌హారం ఆడియో, వీడియో సాక్షిగా వెలుగులోకి రావ‌డంతో ప‌లు సంస్థ‌లు ఖంగుతిన్నాయి. బీజేపీ ప్ర‌యోజ‌నాల కోసం మీడియా సంస్థ‌లు ప్యాకేజీల‌కు సిద్ధ‌ప‌డుతున్న తీరు స్ప‌ష్ట‌మ‌య్యింది. కాసులిస్తే చాలు..విస్తృత కవరేజీ ద్వారా హిందూత్వ మతతత్వాన్ని ప్రజల్లోకి జొప్పించి తద్వారా రాజకీయాల్లో ప్రయోజనాలు కల్పించేందుకు ఒప్పందాలకు సన్నద్ధమయిన తీరు విస్మ‌యానికి గురిచేస్తోంది. 2019 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ‘హిందూత్వ అజెండా’ కార్యక్రమాలకు రూపకల్పన చేయడం ద్వారా ఓటర్లను హిందూ, ముస్లింలగా విడగొట్టి వేర్వేరుగా సమీకరించేందుకు దోహదం చేసేలా ఈ కార్యక్రమాలుండాలని కోబ్రాపోస్ట్‌ ప్రతినిధి ఆఫ‌ర్ ఇవ్వ‌గానే సిద్ధ‌ప‌డిన తీరు విశేషంగా మారుతోంది.

మొదటి విడతలో విడుదల చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ కథనాల్లో 17 మీడియా సంస్థల సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ‘హిందూత్వ’ కవరేజీకి అంగీకరించారు. చెల్లింపులు మాత్రం నగదు రూపంలోనే చేయాలనే ఒక్క షరతు విధించ‌డం గ‌మ‌నార్హం. డిఎన్‌ఎ, దైనిక్‌ జాగరణ్‌, అమర్‌ ఉజ్వల, ఇండియా టివి, స్కూప్‌వూప్‌ వంటి సంస్థలు కూడా ఆపరేషన్‌లో చిక్కాయి. మొదటి మూడు నెలలు పాటు కాస్త మృదువుగా హిందూత్వ కార్యక్రమాలను ప్రసారం చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ, బిఎస్పీ అధినేత్ర మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ వంటి రాజకీయ నేతల వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా కార్యక్రమాలు రూపొందించడం అజెండాలో భాగం. బిజెపిలో ముఠా తగాదాలు ప్రచ్ఛన్నయుద్ధంగా కొనసాగుతూనేవున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, మనోజ్‌ సిన్హా, జయంత్‌ సిన్హా, మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలపైనా ప్రతికూల కథనాలు ప్రసారం చేసేందుకు ఈ మీడియా సంస్థలు అంగీకరించినట్లు కోబ్రాపోస్ట్‌ తెలిపింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడుగా పేరున్న రజత్‌ శర్మ ఎడిటర్‌గా ఉన్న ఇండియా టివి, దేశంలోనే అత్యధిక సర్య్కులేషన్‌ కలిగియున్న హిందీ వార్తా పత్రిక దైనిక్‌ జాగరణ్‌, ఉత్తరప్రదేశ్‌ స్థానిక టెలివిజన్‌ ఛానెల్‌ హిందీ కబర్‌, వినోద, వార్తా ఛానెళ్ల గ్రూపు అయిన ఎస్‌ఎబి గ్రూప్‌, జీ గ్రూప్‌కు చెందిన ఆంగ్ల దినపత్రిక డిఎన్‌ఎ (డైలీ న్యూస్‌ అండ్‌ ఎనాలసిస్‌), దైనిక్‌ భాస్కర్‌, అమర్‌ ఉజ్వల, న్యూస్‌ ఏజెన్సీ యుఎన్‌ఐ, వినోద ఛానెల్‌ 9ఎక్స్‌ తాషన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ఛానెల్‌ సమాచార్‌ ప్లస్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన హెచ్‌ఎన్‌ఎన్‌ 24-7, హిందీ వార్తా పత్రికలు పంజాబ్‌ కేసరి, స్వతంత్ర భారత్‌, వెబ్‌ పోర్టల్స్‌ స్కూప్‌వూప్‌, రేడిఫ్‌డాట్‌కామ్‌, ఇండియావాచ్‌, హిందీ వార్తా పత్రిక ఆజ్‌, లక్నోలో విశేష ప్రభావమున్న న్యూస్‌ ఛానెల్‌ సాధ్నా ప్రైమ్‌ న్యూస్‌ సంస్థలు హిందూత్వ అంజెండాకు సంసిద్ధమయ్యాయి. కోబ్రాపోస్ట్‌ ప్రతినిధి కలిసిన వ్యక్తుల్లో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌లో పనిచేసి ప్రస్తుతం 9ఎక్స్‌ తాషన్‌లో పనిచేస్తున్న ప్రదీప్‌ గుహా వంటి ప్రముఖ జర్నలిస్టు దిగ్గజాలు కూడా ఉన్నారు. రెండో విడ‌త మ‌రిన్ని సంస్థ‌ల బండారం బ‌య‌ట‌పెడ‌తామ‌ని కోబ్రా పోస్ట్ తెల‌ప‌డంతో మీడియా పెద్ద‌ల్లో క‌ల‌క‌లం మొద‌ల‌య్యింది.


Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *