‘కత్తి’ చుట్టూ మీడియా: కథ నడిపిందెవరు?

tv channels ratings
Spread the love

ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. కత్తి మహేష్ కి, పవన్ కళ్యాణ్ అభిమానులకు మొదలయిన వార్ మరింత ముదరడంలో మీడియాదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. అందులో టీవీ9ది అగ్రస్థానం. ఏబీఎన్ వంటి వాళ్లు కూడా అగ్నికి ఆజ్యం పోస్టున్నట్టు స్పష్టం అవుతోంది. అనేక సమస్యలుండగా, ఇలాంటి వివాదాస్పద అంశాలు మాత్రమే విస్త్రుతంగా ప్రసారం సాగించడం ద్వారా తమ రేటింగ్ పెంచుకోవడానికి టీవీ చానెళ్లు ప్రయత్నిస్తాయి. అందులో సందేహం లేదు. వ్యాపారం కాబట్టి చేసినా తప్పుబట్టకూడదు.

కానీ అదే సమయంలో మీడియా కొంత మితిమీరి ప్రచారం చేయడం ద్వారా సమాజాని చేస్తున్న చేటు గురించి కూడా ఆలోచించాలి. మెరుగైన సమాజం, ప్రతి అక్షరం ప్రజల కోసమేనని చెప్పుకుంటూ ఇలాంటి వ్యవహారాలలో అతి చేయడం అనర్థదాయకం అన్నది గమనించాలి. గడిచిన వారం రోజులుగా 2018 క్యాలెండర్ ఇయర్ లో గమనిస్తే గజల్స్ గలీజు భాగోతం, ఇప్పుడు కత్తి కథాంశమే తమకు ప్రధాన వనరుగా మీడియా వ్యవహరించింది. తద్వారా వ్యక్తుల సమస్యలను సమాజం నెత్తిన పెడుతూ వ్యవస్థను దిగజార్చడంలో కీలకంగా వ్యవహరిస్తోంది.

అందుకు తోడు పవన్ కళ్యాణ్ ని బద్నాం చేయడమే లక్ష్యంగా మీడియాలో ఓ సెక్షన్ ప్రయత్నిస్తుందనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే కొందరు మాత్రమే ఈ విషయంలో అతి చేస్తున్న తీరు కనిపిస్తోంది. పవన్ ప్రత్యర్థులతో పాటు, మొన్నటి వరకూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మిత్రుల్లో కూడా కొందరు పవన్ కళ్యాణ్ ఎదుగుదలని సహించే అవకాశం లేదని, అందుకే ముందరి కాళ్లకి బంధం వేసే పనిలో ఉన్నారని పవన్ అభిమానాలు సైతం సందేహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కత్తి వెనుక కొన్ని శక్తులున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఎవరు ఉన్నా లేకున్నా, కత్తిని అడ్డు పెట్టుకుని పవన్ ని చిత్తు చేయాలనే సంకల్పంలో ఉన్న సెక్షన్ కి మీడియా తోడ్పాటునందించే పనిలో ఉందనే అభిప్రాయం పెరగడం మాత్రం కొంత ఆశ్చర్యకరమే.

ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా ఆడియో వేడుకను కొన్ని చానెళ్లకు అవకాశం దక్కలేదు. అది కూడా ప్రధానాంశం అయి ఉండవచ్చని కొందరి అభిప్రాయం. ఇలాంటి అనేకనేక రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలతోనే పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నలు సంధించే పరిస్థితికి కత్తి వచ్చేసినట్టు కనిపిస్తోంది.


Related News

sakshi

సాక్షి చేసింది..చేయాల్సింది..!!

Spread the love5Sharesఅధికారం అండ‌తో ప్ర‌వేశించింది. ఆ వెంట‌నే ఆటంకాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అనేక ఒడిదుడుకులు చ‌వి చూసింది. ప్ర‌స్తుతంRead More

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the love8Sharesజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

 • మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా
 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *