Main Menu

హ‌ద్దులు దాటిందెవ‌రు?

Spread the love

తెలుగు మీడియా కొత్త పుంత‌లు తొక్కుతోంది. సంచ‌ల‌నాలే పునాదిగా మీడియా మారిపోయింది. వాస్త‌వాల క‌న్నా వ‌క్రీక‌ర‌ణ‌ల‌కే ప్రాధాన్య‌త ద‌క్క‌డం చాలాకాలంగా ఉంది. కానీ ఎల‌క్ట్రానిక్ మీడియా పురుడు పోసుకున్న నాటి నుంచి ఉన్న విష‌యాన్ని మ‌రింత‌గా మ‌సాలా ద‌ట్టించి మందిని రంజింప‌జేయ‌డ‌మే ప్రాధాన్యంగా మారిపోయింది. దాంతో అనేక విష‌యాల్లో వాస్త‌వానికి, మీడియా వార్త‌ల‌కు పొంత‌న క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

చివ‌ర‌కు ఇప్పుడు మీడియా సంస్థ‌ల స్టూడియోల‌నే వార్త‌లుగా మలుస్తున్నారు. స్టూడియో కేంద్రంగా లైవ్ లో వివాదాలు రాజేస్తున్నారు. మ‌తాల ప్ర‌తినిధుల పేరుతో కొంద‌రిని కూర్చోబెట్టి మౌఢ్యం పొంపెందించే ప‌నిలో కొంద‌రున్నారు. విశ్లేష‌కుల పేరుతో రాజ‌కీయ వివాదాలు రాజేయ‌డానికి మ‌రికొంద‌రిని ఆశ్ర‌యిస్తున్నారు. దాంతో ఇప్ప‌టికే ప‌లు చానెళ్ల స్టూడియోలు కొట్లాట‌ల‌కు, బూతుల పంచాంగాల‌కు, ప‌లు పంచాయితీల‌కు కేంద్రంగా మారిపోతున్నాయి.

విజ‌య‌వాడ కేంద్రంగా న‌డుస్తున్న ఏపీ 24 చానెల్ లోనూ జ‌న‌సేన సుంక‌ర దిలీప్ కి, టీడీపీ యామినీకి మ‌ధ్య జ‌రిగిన వివాదం వాటికి కొన‌సాగింపుగానే చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో వీహెచ్, పోసాని వంటి ప‌లువురి వ్య‌వ‌హారాలు అంద‌రికీ తెలిసిన‌వే. అయితే ఈ విష‌యంలో మ‌హిళా నేత ప‌ట్ల సుంక‌ర దిలీప్ నోటి దురుసు, మ‌ల్లెపువ్వు ప్ర‌స్తావ‌న‌లు చాలామందిని విస్మ‌య ప‌రుస్తున్నాయి. యామిని కూడా గ‌తంలో ప‌వ‌న్ మీద‌, తాజా చ‌ర్చ‌లో దిలీప్ కి కౌంట‌ర్ గానూ చేసిన కామెంట్స్ చిన్న‌వేం కాదు. ఒక‌ప్పుడు వీధి కుళాయిల ముందు దొప్పిపొడుపులు ఉండేవ‌ని, చివ‌ర‌క‌వి చానెళ్ల స్టూడియోల‌కు చేరాయ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

సంచ‌ల‌నాల కోసం వివాదాస్ప‌దంగా మాట్లాడుతూ, నోటిదురుసుత‌నంతో వ్య‌వ‌హ‌రించే వారికి చ‌ర్చ‌ల్లో ప్రాధాన్య‌త నిస్తూ , వారికి నాయ‌కుల‌నే ట్యాగ్ లు త‌గిలించి జ‌నాల్లో చ‌ర్చ‌ల పేరుతో చానెళ్లు చేస్తున్న యాగీ చివ‌ర‌కు ఇలాంటి అనేక ఘ‌ట‌న‌కు కేంద్రంగా మారే ప్ర‌మాదం పొంచి ఉంది. జనాలు అన్నింటికీ సిద్ధంగా ఉన్నట్టుగా క‌నిపిస్తున్న త‌రుణంలో చానెళ్ల నిర్వాహ‌కులు మ‌రిన్ని చిత్రాలు ప్రోత్స‌హిస్తార‌న‌డంలో సందేహం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Related News

పుంజుకున్న సాక్షి టీవీ: పొలిటిక‌ల్ సంకేత‌మేనా?

Spread the loveతెలుగు మీడియాలో బార్క్ రేటింగ్స్ కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌చ్చు గానీ వాటికున్న గుర్తింపు వాటికుటుంద‌న‌డంలో సందేహంRead More

ఈవీఎం వ్య‌వ‌హారంలో విలేక‌రుల‌పై కేసు!

Spread the loveఈవీఎం ల వ్య‌వ‌హారం ముదురుతోంది. మీడియా మెడ‌కు చుట్టుకుంది. ప‌లువురిపై కేసు కూడా న‌మోద‌య్యింది. మొన్న‌టి సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *