సర్వే ప్రసారం చేసిన జర్నలిస్టులు అరెస్ట్

Women arrested
Spread the love

నంద్యాల ఉప ఎన్నికల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఇద్దరు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల ఎన్నికలపై ప్రసారం చేసిన సర్వే వారి అరెస్ట్ కి మూలంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా సర్వే ప్రసారం చేసిన వెబ్ సైట్ నిర్వాహకుకలు ఇప్పుడు కటకటాల పాలయ్యారు. ముఖ్యంగా వాస్తవాలను వక్రీకరించడంతో వారు ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్టయ్యింది. నంద్యాల ఉపఎన్నికలకు సంబంధించిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్ అంటూ ఓ తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం ద్వారా ప్రజల్లో అపోహలకు, అనుమానాలకు అవకాశం కల్పించిన మన తెలంగాణా న్యూస్ ఎడిటర్ కూన అజయ్ బాబు, వెబ్ డిజైనర్ డి రంజిత్ కుమార్ ని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 4,551 ఓట్లతో విజయం సాధిస్తున్నారంటూ ఇంటిలిజెన్స్ నివేదిక పేరుతో ఓ కథనం ప్రసారం చేశారు. అది కూడా ఏకంగా సీఎం ఆఫీస్ నుంచి లీకయిన సమాచారం అంటూ ప్రజల్లోకి పంపించారు. సరిగ్గా పోలింగ్ కి ఒక్క రోజు ముందు ఆగస్ట్ 22న ఈ కథనం వెలువడడం కలకలం రేపింది. దాంతో అధికార పార్టీ వర్గాలు సీరియస్ అయ్యాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన, ప్రజలను మోసం చేయడం, తప్పుడు సమాచారం అందించడం వంటి పలు నేరాలు వారిపై మోపడంతో చివరకు పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నేటిభారతం డాట్ కామ్ పేరుతో వచ్చిన ఈ సమాచారం మూడు నాలుగు రోజుల పాటు వైరల్ గా మారింది. చివరకు ఫేక్ అని నిర్థారించుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడమే కాకుండా కీలకమైన ఆధారాలు సేకరించినట్టు సమాచారం. హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో సోదాలు కూడా నిర్వహించారు.


Related News

SHHIVABALAJI

బిగ్ బాస్ అతడే..

Spread the loveతెలుగు బుల్లితెర అభిమానులను బిగ్ బాస్ అలరించింది. తొలి సీజన్ తో ఎన్టీఆర్ ఆడియెన్స్ ని కట్టిపడేశాడు.Read More

andhra jyothy

పాఠకులను అంధకారంలో నెట్టాలనుకున్న జ్యోతి

Spread the loveఆంధ్రజ్యోతి ఇటీవల పలు అంశాలలో గుడ్డిగా వెళుతూ అదే పాత్రికేయం అని అందరినీ నమ్మించే ప్రయత్నంలో నిండాRead More

 • మరో చానెల్ అమ్మకం
 • అర్నబ్ అబద్ధాల గో స్వామి
 • Ntv చౌదరి వియ్యంకుడి గురించి తెలుసా?
 • బిగ్ బాస్ ని అలా వాడేస్తున్నారు..
 • పాత్రికేయుల‌పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు
 • యూ ట్యూబ్ చానెళ్లపై నిఘా?
 • ఆంధ్రభూమి మూసివేత?
 • సర్వే ప్రసారం చేసిన జర్నలిస్టులు అరెస్ట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *