ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?

janasena
Spread the love

మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలయ్యింది. తాజా పరిణామాల నేపథ్యంలో జనసేన కూడా సొంత చానెల్ వైపు కన్నేసింది. దానికి తగ్గట్టుగానే సన్నాహాలు షురూ చేసింది. అయితే జనసేన అధినేత త్వరలోనే 99 న్యూస్ చానెల్ ని టేకోవర్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అలాంటి అవకాశం ఉందంటూ ఇప్పటికే ప్రచారం జోరుగా సాగుతుండడంతో 99 న్యూస్ కి మంచి రోజులు వచ్చినట్టేననే అభిప్రాయం వినిపిస్తోంది.

కానీ జనసేనాని ఆలోచన భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి జనసేన మిత్రపక్షం సీపీఐ ఆధ్వర్యంలో 99న్యూస్ ప్రారంభమయ్యింది. కానీ దాని నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అనేక ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అష్టకష్టాల మధ్య చానెల్ సాగుతోంది. దాంతో 99న్యూస్ ని జనసేన టేకోవర్ చేస్తే ఆ చానెల్ సిబ్బందికి, నిర్వాహకులకు సమస్యలు తీరినట్టేనని చెప్పవచ్చు.

కానీ ఇప్పటికే ఓ ముద్ర ఉన్న చానెల్ కన్నా కొత్త చానెల్ మంచిదనే ఆలోచన జనసేన క్యాంప్ లో సాగుతోంది. కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొత్త నెట్ వర్క్ తో జనాలకు చేరడం సామాన్య విషయం కాదు. అయినా పవన్ కి ఉన్న ఛరిష్మాతో అది పెద్ద సమస్య కాబోదని పలువురు భావిస్తున్నారు. ప్రధాన చానెళ్లతో కయ్యానికి దిగన తర్వాత తమకు కూడా సొంతంగా చానెల్ అవసరమన్న విషయం ఖాయం చేశారు. అదే సమయంలో జగన్, చిరంజీవి అనుభవాలను పోలిస్తే సొంత మీడియా లేకపోవడంతో ప్రజారాజ్యానికి ఏర్పడిన సమస్యలు, సాక్షి సహాయంతో జగన్ వాటిని ఎదుర్కున్న అనుభవం కూడా పవన్ మదిలో ఉంది. దాంతో 99 న్యూస్ టేకోవర్ కన్నా సొంత సంస్థ అయితే కొంత శ్రేయస్కరమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి కొత్త చానెల్ కి ఎప్పుడు కార్యరంగం సిద్ధం అవుతుందో చూడాలి.






Related News

media

తెలుగు మీడియా కళ్లు తెరవదా?

Spread the loveఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోRead More

whatsapp fb

ఎఫ్ బీ, గూగుల్ కి నోటీసులు

Spread the loveప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలే కాదు డిజిటల్ మీడియాలో కూడా నిబంధనలు పాటించాల్సిందే. దానికి భిన్నంగా సాగితేRead More

  • మీడియా విషయంలో మనసు మార్చుకున్న జనసేన
  • చంద్రబాబు దొరికిపోయారు..
  • మహిళా జర్నలిస్టుపై వేధింపులు
  • ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?
  • అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌
  • మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?
  • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
  • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *