Main Menu

మీడియాకు జ‌న‌సేన ఝ‌ల‌క్

Spread the love

వైసీపీ అధికారిక ప‌త్రిక ముసుగులో స‌ర్థుబాట్లు పేరుతో రాసిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపింది. జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య మ‌రోసారి పొత్తు చ‌ర్చ‌లు పూర్త‌య్యాయంటూ రాసిన రాత‌లు సంచ‌ల‌నంగా మారాయి. రాజ‌కీయ వ‌ర్గాల్లో పెను దుమారం రేపాయి. వాటి మీద ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేరుగా స్పందించారు. అటు టీడీపీ, ఇటూ వైసీపీ తోనూ ముడిపెడుతున్న వ్య‌వ‌హారాన్ని ఆయ‌న ఎద్దేవా చేశారు. తాను మీడియాను న‌మ్ముకోలేద‌ని, జ‌నాల‌ను న‌మ్ముకుని కాన్షీరామ్ బాట‌లో సాగుతున్నాన‌ని తేల్చేశారు.

అయితే ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన ధోర‌ణి విశేషంగా చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో ప్ర‌జారాజ్యం కాలంలో మీడియాలో జెండా పీకేద్దాం అంటూ వ‌చ్చిన వార్త‌ల‌పై కూడా అప్ప‌ట్లో ఇదే స్థాయిలో రాజకీయ దుమారం సాగింది. చివ‌ర‌కు చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగ‌తి ప‌క్క‌న పెడితే అప్ప‌ట్లో సొంతంగా త‌మ‌కు మీడియా లేక‌పోవ‌డంతో చిరంజీవి అనుచ‌రులు ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి క‌నిపించింది. ఈనాడు ప‌త్రిక కార్యాల‌యాల ముందు నిర‌స‌న తెలిపి స‌రిపుచ్చుకోవాల్సి వ‌చ్చింది.

కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. ప‌దేళ్ల‌లో సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెరిగింది. ప్ర‌తీ ఒక్క‌రికీ సొంత మీడియా అందుబాటులో వ‌చ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఎవ‌రి వాద‌న వారు వినిపించే మార్గం ఏర్ప‌డింది. దాంతో సాక్షి క‌థ‌నాల‌కు సాయంత్రంలోగా జ‌న‌సేన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేందుకు ఆస్కారం ల‌భించింది. గ‌తంలోని లేని ఈ అవ‌కాశాన్ని ఇప్ప‌టికే ప‌వ‌న్ వినియోగించుకున్నారు. గ‌తంలోనే టీవీ9, టీవీ5 వంటి చానెళ్ల‌ను ట్విట్ట‌ర్ స‌హాయంతో ఢీకొట్టారు.

తాజాగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మ‌రో అడుగు ముందుకేసి సాక్షి ప‌త్రిక ని కాల్చి త‌మ ఆగ్ర‌హాన్ని వెలిబుచ్చారు. ఇష్టారాజ్యంగా క‌థ‌నాలు రాస్తే ఏ మీడియా సంస్థ‌ను ఉపేక్షించేంది లేద‌ని చాటిచెప్పారు. భ‌విష్య‌త్తులో జ‌న‌సేన ప‌ట్ల రాసే రాత‌ల‌కు కాస్త నిగ్ర‌హం అవ‌స‌ర‌మ‌ని చాటిచెప్పిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ఏమ‌యినా ఈ ప‌రిణామంలో మీడియాలో అంద‌రికీ ఓ హెచ్చ‌రిక‌గా చెప్ప‌వ‌చ్చు.


Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *