Main Menu

ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్

Spread the love

ఆస‌క్తిక‌ర ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. ఏపీ రాకీయాల్లో కొత్త ట్రెండ్ గా భావించ‌వ‌చ్చు. ఇప్ప‌టికే నిషేధాలు విధించుకుని దూరంగా ఉంటున్న వారు మ‌రింత దూరం కావ‌డానికి సంకేతంగా చెప్ప‌వ‌చ్చు. తాజాగా వైఎస్ జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి దానికి త‌గ్గ‌ట్టుగా ఉంది. తెలుగుమీడియాలో ప్ర‌ధానంగా ఆంధ్ర‌జ్యోతి జ‌గ‌న్ వైరం ఈనాటిది కాదు. ఆమాట కొస్తే ఆ రెండు ప‌త్రిక‌లంటూ నిత్యం విరుచుకుప‌డిన వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాలం నుంచే త‌గాదాలున్నాయి. అయినా వైఎస్ ని ఢీ కొట్టిన ఘ‌నుడిగా రాధాకృష్ణ‌కు గుర్తింపు ఉంది. అదే తీరులో జ‌గ‌న్ మీద నిత్యం దాడిచేయ‌డం ఆంధ్ర‌జ్యోతికి అల‌వాటు. అవ‌కాశం ఉన్న అన్ని విష‌యాల్లోనూ వైఎస్ జ‌గ‌న్, వైసీపీని బ‌ద్నాం చేయ‌డానికి ఆ సంస్థ ప్ర‌య‌త్నిస్తూ ఉంటుంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం.

ఈ నేప‌థ్యంలోనే సాక్షి మీద టీడీపీ నేత‌లు నిత్యం రాళ్లేస్తూ ఉంటారు. అవినీతికి పుట్టిన విష‌పుత్రిక‌గా ప‌లుమార్లు అభివ‌ర్ణించారు. ఆఖ‌రికి టీడీపీ కార్య‌క‌లాపాల‌కు సాక్షి ప్ర‌తినిధులు రాకూడ‌ద‌ని నిషేధం కూడా విధించారు. దానిని ఆస‌రాగా తీసుకుని జ‌గ‌న్ కూడా ఆంధ్ర‌జ్యోతిని బాయ్ కాట్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజాగా ఏపీ రాజ‌కీయా ప‌రిణామాల పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ప్ర‌కాశం జిల్లాలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఈ అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. జ‌గ‌న్ ప్రెస్ మీట్ కి ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్ ప్ర‌తినిధులు హాజ‌రుకావ‌డంపై జ‌గ‌న్ మండిప‌డ్డారు. తాము దూరం పెట్టిన త‌ర్వాత మ‌ళ్లీ రాకూడ‌దంటూ ఆ విలేక‌ర్ల‌కు క్లాస్ పీకారు. ఎలానూ వ‌చ్చారు కాబ‌ట్టి కేకు తినిపోండి అంటూ సెటైర్ కూడా వేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో వాస్త‌వం లేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా తాము ఆంధ్ర‌జ్యోతి రాత‌ల మీద‌, కూత‌ల మీద కేసులు వేశామ‌ని జ‌గ‌న్ చెప్పారు. న్యాయ‌పోరాటం చేస్తున్నామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కానీ వాస్త‌వానికి వైసీపీ త‌రుపున ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి వేసిన కోర్ట్ ని సుప్రీంకోర్ట్ కూడా స్క్వాష్ పిటీష‌న్ లో కొట్టేసింది. అయినా కోర్టులో కేసులున్నాయంటూ జ‌గ‌న్ వ్యాఖ్యానించ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఆంధ్ర‌జ్యోతి చెబుతోంది. అయితే ఇలాంటివి ప‌క్క‌న పెట్టినా ఆంధ్ర‌జ్యోతి, వైసీపీ మ‌ధ్య వైరం మ‌రింత రాజేయ‌డానికి జ‌గ‌న్ చ‌ర్య‌లు దోహ‌దం చేశాయి. రాదాకృష్ణ మ‌రింత నేరుగా జ‌గ‌న్ అండ్ కో మీద బాణాలుఎక్కు పెట్ట‌డానికి ఈ ప‌రిణామం దోహ‌దం చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. భ‌విష్య‌త్తులో ఈ వివాదం ఎన్ని మ‌లుపులు తీసుకుంటుందోన‌నే ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పించింది.


Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *