జగన్ కి అది తక్కువ..!

telugu news channels
Spread the love

ఏపీలో ప్రతిపక్షం సతమతమవుతోంది. నంద్యాల ఫలితాలు ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయపడ్డట్టుగా మార్చేశాయి. ఫిరాయింపుల దెబ్బతో మళ్లీ పురోగమిస్తుందనుకున్న పార్టీ అనూహ్యంగా నంద్యాలలో బోల్తాపడడం పెద్ద సమస్యగా మారింది. సానుకూలతను సొమ్ము చేసుకుందామని చూసి చివరకు చతికిలపడడంతో ఇప్పుడు వైసీపీలో పోస్ట్ మార్టమ్ జరుగుతోంది. వాస్తవానికి నంద్యాలలో జరిగిన ఎన్నికలు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే అత్యంత ఖరీదైనవనడంలో సందేహం లేదు. అధికార పక్షం ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరు విస్మయం కలిగించినప్పటికీ చివరకు విజయం వరించడంతో వాటన్నంటినీ తోసిపుచ్చడానికి సాహసిస్తోంది.

అయితే ఈ ఎన్నికల్లో జగన్ పరాభవానికి అనేక అంశాలు కారణంగా ఉన్నాయనడంలో సందేహం లేదు. అందులో మీడియా ప్రభావం ఒకటి. నంద్యాల ఎన్నికల్లో జరుగుతున్న వాస్తవాలు విస్మరించి , ఇంకా కొన్ని మార్లు వక్రీకరించి విపక్షాన్ని ఇరుకున పెట్టడానికి మీడియా విపరీతంగా శ్రమించింది. చివరకు సాధించింది. దానిని ఎదుర్కోవడానికి జగన్ సారధ్యంలోని సాక్షి కూడా కొంతమేరకు ప్రయత్నించింది. కానీ సాక్షి సంస్థల విశ్వసనీయత ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. సాక్షిలో ఏం చెప్పినా దానిని జనం విశ్వసించే పరిస్థితి రానురాను తగ్గిపోతోంది. అదే సమయంలో చంద్రబాబుకి అనుకూల సంస్థల్లో ఆంధ్రజ్యోతి పరిస్థితి కూడా అదే మాదిరి తయారవుతోంది. పూర్తిగా పచ్చపాతం ప్రదర్శిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. దాంతో ఈ రెండు పత్రికలు తమ తమ స్థాయిల్లో ఇరుపార్టీల కరపత్రాలను తలపిస్తూ పాఠకుల నమ్మకాన్ని కోల్పోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.

ఇక మిగిలిన వాటిలో ప్రదానమైనది పత్రికల్లో ఈనాడు, టీవీ చానెళ్లలో టీవీ9, ఎన్టీవీ, టీవీ5 వంటి సంస్థలున్నాయి. దాదాపుగా ఇవన్నీ ప్రభుత్వ బాకా సంస్థలుగానే మిగిలిపోతున్నాయి. సర్కారుకి నొప్పి కలగకుండా చూడడమే తమ లక్ష్యమని చాటుతున్నాయి. ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం వస్తే తమ చానెల్ ప్రసారాలకే ప్రమాదం అని గ్రహించి అణగిమణిగి ఉంటున్నాయి. అవసరమైన చోట అనుకూలంగా చెబుతూ, వ్యతిరేకతను కప్పిపుచ్చుతున్నాయి. దాంతో మీడియాలో జగన్ పూర్తిగా బలహీనంగా ఉన్నారు. అక్కడ వైసీపీకి మద్ధతు బాగా తక్కువగా ఉంది. అదే ఆపార్టీని ప్రజల్లో పలుచన చేస్తోంది. జగన్ నిర్వహించే దీక్షలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి సోషల్ మీడియా సాయంతో ఆయా టీవీల ప్రసారాలను కొంత వైసీపీ కవర్ చేస్తోంది. వాస్తవాలను వాట్పాప్, ఎఫ్ బీ గ్రూపుల ద్వారా జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతోంది.

కానీ ఎన్నికల సమయంలో అది సాధ్యం కావడం లేదు. దానికి కారణం ఎన్నికలనగానే ఎవరి గోల వారిదనే అభిప్రాయం సామాన్యుడికి ఉంటుంది. అదే సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే పరిధిలో సోషల్ మీడియా పరిధి చాలా తక్కువ. ప్రజల్లో ఉన్న రెగ్యులర్ మీడియా, ఓటర్లను ప్రభావితం చేస్తున్న మీడియాలో పట్టు లేకపోవడంతో వైసీపీకి ఉపశమనం దక్కడం లేదు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ఒక వాదన బయటకు వచ్చినప్పుడు దానిని కార్నర్ చేయడం సాధ్యం కావడం లేదు. గత ఎన్నికలనాడు ఎన్టీవీ, టీవీ5 కూడా వైసీపీకి కొంత అండదండలు అందించేవి. ఆనాడు ప్యాకేజీలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు గానీ కొంత అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా లేదు. అందుకే వైసీపీకి మీడియా లేకపోవడంతో వారి వాయిస్ ప్రజల్లోకి వెళ్లడం లేదు. సాక్షి కేవలం జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కే పరిమితం కావడం, సామాన్యులకు ఇతర చానెళ్లు చెవిలో జోరీగలా హోరెత్తించడం విపక్షానికి పెద్ద సమస్యగా మారింది.

దానిని అధిగమించే ప్రయత్నాలు అత్యవసరమని జగన్ శిబిరంలోని వారే చర్చించుకుంటుండడం విశేషం. దానికి ఏం చేయాలన్న దాని మీద తీవ్రంగా శోధన చేస్తున్నారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న సమయంలో వైసీపీకి ఇవన్నీ మింగుడుపడని అంశాలగానే మిగిలిపోతాయా లేక పరిష్కార మార్గాలతో ముందుకొస్తారా అన్నది చూడాలి.


Related News

SHHIVABALAJI

బిగ్ బాస్ అతడే..

Spread the loveతెలుగు బుల్లితెర అభిమానులను బిగ్ బాస్ అలరించింది. తొలి సీజన్ తో ఎన్టీఆర్ ఆడియెన్స్ ని కట్టిపడేశాడు.Read More

andhra jyothy

పాఠకులను అంధకారంలో నెట్టాలనుకున్న జ్యోతి

Spread the loveఆంధ్రజ్యోతి ఇటీవల పలు అంశాలలో గుడ్డిగా వెళుతూ అదే పాత్రికేయం అని అందరినీ నమ్మించే ప్రయత్నంలో నిండాRead More

 • మరో చానెల్ అమ్మకం
 • అర్నబ్ అబద్ధాల గో స్వామి
 • Ntv చౌదరి వియ్యంకుడి గురించి తెలుసా?
 • బిగ్ బాస్ ని అలా వాడేస్తున్నారు..
 • పాత్రికేయుల‌పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు
 • యూ ట్యూబ్ చానెళ్లపై నిఘా?
 • ఆంధ్రభూమి మూసివేత?
 • సర్వే ప్రసారం చేసిన జర్నలిస్టులు అరెస్ట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *