Main Menu

టీవీ9 మళ్లీ అమ్మేశారు..

Spread the love

తెలుగు మీడియాలో వరుసగా పలు సంస్థల అమ్మకాలు సాగుతున్నాయి. ఇప్పటికే జనసేన కోసం తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదిత్యా గ్రూప్ సంస్థలు 99టీవీని కొనుగోలు చేశారు. కొద్దిరోజుల క్రితమే నిమ్మగడ్డ ప్రసాద్ సారధ్యంలో 10టీవీని కొన్నారు. ఇక తాజాగా టీవీ9 కూడా అమ్ముడుపోయిందంటూ ప్రచారం ఊపందుకుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కీలక కాంట్రాక్టులు నిర్వహిస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ యాజమాన్యం టీవీ9ని కొనుగోలు చేసిందనే ప్రచారం ఊపందుకుంది. మెగా సంస్థల క్రుష్ణారెడ్డి ఈ టాప్ తెలుగు న్యూస్ చానెల్ చేజిక్కించుకున్నారనే ప్రచారం ఆసక్తిగా మారింది.

వాస్తవానికి టీవీ9 అమ్ముడు పోయొందంటూ ఇప్పటికే పలు రకాల ప్రచారాలు సాగాయి. ముఖ్యంగా టైమ్స్ గ్రూప్ సంస్థలు కొనుగోలు చేసినట్టు రెండేళ్ల క్రితం జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత మైహోంమ్స్ రామేశ్వర రావు కూడా టీవీ9 ని తీసుకున్నారని ముమ్మర ప్రచారం చేశారు. ఆ తర్వాత కూడా పలు సంస్థల పేర్లు వినిపించాయి. అయినా అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్ తరుపున శ్రీనిరాజు ఆధ్వర్యంలోనే రవి ప్రకాష్ ఈ సంస్థను నడుపుతున్నారు.

ఇక తాజాగా మెగా ఇంజనీరింగ్ సంస్థ పలు కాంట్రాక్ట్ లు చేపట్టింది. ఏపీలో పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను చంద్రబాబు సర్కారు అదే సంస్థకు కట్టబెట్టారు. అనంతరం కొద్దినెలల క్రితం రాజ్యసభ ఎన్నికల్లో కూడా క్రుష్ణారెడ్డి పేరు వినిపించింది. మెగా సంస్థలో కాంగ్రెస్ కి చెందిన కొందరు కీలక నేతలతో పాటు, ఓ టీవీ చానెల్ చైర్మన్ కి కూడా వాటాలున్నాయనే ప్రచారం ఉంది. ఏమయినా ప్రస్తుతం టీవీ9 యాజమాన్యం మెగా ఇంజనీరింగ్ సంస్థలకు చేరిందనే ప్రచారం మాత్రం చర్చనీయాంశం అవుతోంది. టీవీ9 అధికారికంగా ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఏమేరకు విశ్వసించాలన్నది ప్రశ్నార్థకం అవుతోంది.






Related News

మీడియా య‌జ‌మానుల రెండు నాలుక‌ల ధోర‌ణి

Spread the loveతెలుగు ప‌త్రిక‌లు మూకుమ్మ‌డి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా అన్ని ప‌త్రిక‌లు ధ‌ర‌లు పెంచేశాయి. తొలుత ఈనాడుRead More

వైసీపీని క‌ట్ట‌డి చేసే వ్యూహంలో టీడీపీ అడుగులు

Spread the loveప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలో టీడీపీదే ఆధిప‌త్యం.ఇ టీవ‌ల కొన్ని చానెళ్ల‌లో మార్పులు సంభ‌వించినా తెలుగుదేశానికి పెద్ద‌గా ఢోకాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *