హోదా ఉద్యమానికి మీడియా ఆటంకం?

tv channels ratings
Spread the love

ఇలాంటి అనుమానం కలుగుతోంది. గతంలో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సమయంలో తెలుగు మీడియా మరో మాట మాట్లాడకుండా జై తెలంగాణా నినాదం వినిపించేది. అందుకు భిన్నంగా వ్యవహరించిన వాళ్లకు మిలియన్ మార్చ్ లో శాస్తి కూడా జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నం. దానికి కారణం తెలుగు న్యూస్ చానెళ్లన్నీ తెలంగాణా గడ్డ మీదే ఉన్నాయి. ఏపీ నుంచి నడుస్తున్న ఒక్క చానెల్ ప్రభావం కూడా అంతంత మాత్రమే. దాంతో ప్రధాన చానెళ్లన్నీ ప్రత్యేక హోదా ఉద్యమం కన్నా టాలీవుడ్ అంశానికే ప్రాధాన్యతనిస్తున్నాయి. దానివెనుక హోదా ఉద్యమాన్ని నీరుగార్చాలనే లక్ష్యం కూడా ఉందనే వాదన ఉంది. వాస్తవం ఎలా ఉన్నప్పటికీ కవరేజ్ మాత్రం కావాల్సినంత రావడం లేదన్న హోదా ఉద్యమ కారుల ఆందోళన.

మొన్నటి రాష్ట్ర బంద్ విషయంలో కూడా తగిన ప్రాధాన్యత దక్కలేదన్నది పలువురి అభిప్రాయం. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అంశం ముందుకు వచ్చిన తర్వాత వ్యవహారమంతా శ్రీరెడ్డి చుట్టూ తిరుగుతోంది. చివరకు పవన్ కళ్యాణ్ కూడా శ్రీరెడ్డి అంశంపై స్పందించడం, ఆయనపై శ్రీరెడ్డి విమర్శలు చేసే వరకూ వెళ్లడం, మధ్యలో రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇలా రకరకాల పరిణామాలు కనిపిస్తున్నాయి. వాటన్నింటికీ మూలంగా ప్రత్యేక హోదా బంద్ కవరేజ్ నామమాత్రంగా మారిపోయింది. ఆ తర్వాత కూడా హోదా కన్నా క్యాస్టింగ్ కౌచ్ ఆసక్తిగా మారడంతో హాట్ హాట్ చర్చలు జరుపుతున్నారు. గంటల కొద్దీ లైవ్ డిబేట్లు సాగుతున్నాయి. అదే సమయంలో ప్రజల సమస్య మాత్రం పక్కకి పోయింది.

టాలీవుడ్ లో మొత్తం 900మందిగా ఉన్న మా అసోసియేషన్ లో పరిష్కరించుకోవాల్సిన సమస్యకు ప్రాధాన్యతనిస్తూ 5 కోట్ల మంది ఆంధ్రుల ప్రధానాంశాన్ని పక్కన పెట్టేయడం పలువురికి విస్మయానికి గురిచేస్తోంది. కానీ కేంద్రంలోనూ, ఏపీలోనూ అధికారంలో ఉన్న పార్టీలకు అశనిపాతంగా మారుతున్న హోదా ఉద్యమం చల్లారాలంటే ఏదో అంశంపేరుతో పక్కదారి పట్టడమే మంచిదనే ఆలోచనలో ప్రభుత్వాలున్నాయని, దానికి అనుగుణంగా మీడియా అనుసరిస్తోందని విమర్శలున్నాయి. ప్రతిపక్షాల పోరాటాన్ని విస్మరించడం కోసమే శ్రీరెడ్డిని పావుగా వాడుకుంటున్నారనే వారు కూడా లేకపోలేదు. మొత్తంగా కారణమేమయినా ఇప్పుడు హోదా ఉద్యమానికి ఆమెని అడ్డంకిగా ప్రయోగించారన్నది పలువురి అభిప్రాయం. ఏమయినా మీడియా కీలకంగా మారి, అప్పుడు క్రియాశీలంగానూ, ఇప్పుడు పక్కదారి పట్టించడంలో ముందు నిలిచినట్టు భావించే స్థితి దాపురించింది.


Related News

media

తెలుగు మీడియా కళ్లు తెరవదా?

Spread the loveఏపీ రాజకీయ వ్యవహారాల్లో మాత్రం తెలుగు మీడియా తీరు భిన్నంగా ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలోRead More

whatsapp fb

ఎఫ్ బీ, గూగుల్ కి నోటీసులు

Spread the loveప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలే కాదు డిజిటల్ మీడియాలో కూడా నిబంధనలు పాటించాల్సిందే. దానికి భిన్నంగా సాగితేRead More

 • మీడియా విషయంలో మనసు మార్చుకున్న జనసేన
 • చంద్రబాబు దొరికిపోయారు..
 • మహిళా జర్నలిస్టుపై వేధింపులు
 • ఆ చానెల్ ని జనసేన టేకోవర్ చేస్తుందా?
 • అయ్యో..ఆంధ్ర‌జ్యోతికి న‌కిలీల బెడ‌ద‌
 • మీడియా వాళ్లంతా నంగ‌నాచులా..?
 • ప‌వ‌న్ పై ఏబీఎన్ ఎదురుదాడి…
 • ఆ చానెల్ ని కూడా వ‌దిలిపెట్ట‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *