నెల‌రోజులుగా యుద్ధం “ముచ్చట్లు”…

india-china_660_101412092757
Spread the love

గత నెలరోజులుగా యుద్ధం ముచ్చట్లు తెగ రాసేస్తున్నారు.. సెల్ఫ్ జర్నలిస్టులు… అసలు అంతర్జాతీయంగా ఇప్పుడున్న పరిస్థితులలో రెండు దేశాల మధ్య యుద్ధం సాధ్యమా… అది రేండు స్వతంత్ర, సార్వభౌమ, అధిక వ్యాపారా భాగస్వామ్యం గల దేశాల మధ్య. ఒక పక్క దేశాధినేతలు, రాష్ట్రాధిపతులు వ్యాపార భాగస్వామ్యం కోసం అరులు చాచి అదే దేశం మీద ఎగబడుతుంటే వీల్లేమో ఇవ్వాలో రేపో యుద్ధం అంటూ వార్తలు వండి వార్చేస్తున్నారు.

దేశ క్షేమం కాపాడేందుకు కృషి చేసే వాళ్లయితే ప్రజలలో ఈ విధంగా బి.పిలు పెంచి “మనోభావాలతో” ఆడుకోరు. ఒక పక్క అన్నం పెట్టే రైతన్న దేశవ్యాప్తంగా రోడెక్కి రోధిస్తుంటే ఒక వార్త కూడా ఉండదు. అసలు రైతులు ప్రజలే కాదు వీరి దృష్టిలో…సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుగోలుచేస్తున్న, లొంగని వారిని కిడ్నాప్ చేపిస్తున్నారని సాక్షాతూ పార్లమెంటులో చర్చ జరిగిన అసలు కనపడవు. రాణి యుద్ధం కోసం మాత్రం రోజుకి పదుల సంఖ్యలో వండి వార్చేస్తారు..

యుద్ధం వార్తలే ఆసక్తి అనుకుంటే యుద్ధం వల్ల రెండు దేశాలకు జరిగే నష్టాలు ఎప్పుడన్నా రాస్తారేమో చూస్తే అది ఎండమావే… ఎప్పుడూ పక్క దేశంతో యుద్ధం అని రాసేవారు ఆ దేశంలో జరిగిన రాజకీయ కీలక పరిణామాలు మాత్రం ఉటంకించరు. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా లీకుల వల్ల అదేశంలో ప్రధానమంత్రి పదవే పోతే మన దేశంలో ఆరోపణలు వచ్చిన వారిమీద విచారణ లేకపోవడమే కాక వారు సచ్చీలురు అయినట్టు వారు స్వచ్ఛభారత్ ప్రచారకర్తలు. దానిమీద ఎప్పుడూ ఎవరూ రాయరూ…

దేనికోసం పనిచేస్తున్నట్టు వీళ్లు, గురివింద గింజ దాని నలుపు దానికి తెలియనట్టు, వీళ్ళే వివిధ పత్రికలలో వచ్చే వార్తలను ఏకేస్తారు…


Related News

papers telugu news

మీడియా ఏం చేసినా చెల్లుతుందా..?

Spread the loveఇదే ప్ర‌శ్న చాలామంది నుంచి వినిపిస్తోంది. రాజ‌కీయ పార్టీలు, మ‌త బోధ‌కులు, కుల సంఘాలు కూడా మీడియాలోకిRead More

tv9-telugu-live-streaming

అడిగి తిట్టించుకుంటున్న టీవీ9

Spread the loveఆశ్చ‌ర్యంగా ఉందా..అనుమానం ఎందుకు..కింద‌న ఉన్న ట్వీట్ చ‌ద‌వండి. మీకే అర్థ‌మ‌వుతుంది. అయినా అన్నింటికీ నాట‌కీయ‌త అద్ద‌డ‌మే న్యూస్Read More

 • మీడియా సంస్థ‌ల‌కు బాబు ఆఫ‌ర్
 • తెలుగు న్యూస్ చానెళ్ల తాజా రేటింగ్స్
 • జ‌ర్న‌లిస్టును చంపేస్తాం..!
 • పేరు మారింది..కానీ తీరు..?
 • ఎన్టీవీ చైర్మ‌న్ ఇంట అఖిల‌ప‌క్షం..!
 • నెల‌రోజులుగా యుద్ధం “ముచ్చట్లు”…
 • బుల్లితెర‌పై ఎన్టీఆర్ హ‌వా
 • ఏపీ జ‌ర్న‌లిస్టుల‌కు ట్రిపుల్ ఆశ‌లు..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *