కన్ఫర్మ్: జెమినీ మూసేస్తున్నారు

Gemini-News-TV-Telugu-Logo
Spread the love

తెలుగు న్యూస్ చానెళ్లలో తొలిదశలో వచ్చిన వాటిలో జెమినీ ఒకటి. తొలుత బులిటెన్స్ తో ప్రారంభించి ఆ తర్వాత ప్రత్యేక న్యూస్ చానెల్ గా కూడా జెమినీ రూపాంతరం చెందింది. అంతకుముందు తేజ టీవీ పేరుతో 2000 ఆగష్ట్ 28 నాడు జరిగిన బషీర్ బాగ్ కాల్పుల ఘటనను ప్రత్యక్ష ప్రసారం చేసి చరిత్ర స్రుష్టించింది. ఆ ఘటనతోనే వెలుగులోకి వచ్చిన రవి ప్రకాష్ సొంత చానెల్ తో గుర్తింపు పొందినా జెమినీ పేరుతో తెలుగు న్యూస్ చానెళ్లలో ఒకటిగా ఈ చానెల్ గా నిలిచింది.

అయితే తాజాగా పలు భాషల్లో న్యూస్ విభాగాలకు సెలవు చీటి ఇచ్చేస్తున్న సన్ నెట్ వర్క్ ద్రుష్టి తెలుగు జెమినీ మీద కూడా పడింది. వచ్చే అక్టోబర్ 26 నుంచి మూసేస్తున్నట్టు ప్రకటించింది. దాంతో ఇప్పుడు కలకలం రేగింది. ఉద్యోగులు తీవ్రంగా కలత చెందుతున్నారు. గతంలో సరిగ్గా 2014 ఎన్నికలకు ముందు కూడా ఇదే రీతిలో జీ 24గంటలు మూసేశారు. ఎన్నికల తర్వాత 6టీవీ, ఎక్స్ ప్రెస్ టీవీ మూతపడ్డాయి. మరికొన్ని కూడా కష్టాలతో నెట్టుకొస్తున్నాయి. ఉన్నా లేనట్టుగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో జెమినీ మూత తెలుగు మీడియా రంగంలో మరో కుదుపుగానే చెప్పాలి. అసలే అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇది మూలిగే నక్కపై తాటకాయపడ్డట్టుగానే భావించాలి. పాత్రికేయుల కష్టాలు పెరుగుతున్నట్టుగా చెప్పాలి. ఒకటీ అరా కొత్త చానెళ్లు వస్తున్నాయనుకుంటున్న దశలో ఇలా నేషనల్ నెట్ వర్క్ ఉన్న సంస్థలు మూతవేసే పరిస్థితి రావడం విచారకరమే.


Related News

ntv

ఎన్టీవీలో అనూహ్య పరిణామాలు

Spread the love7Sharesతెలుగు టీవీ చానెళ్ల జాబితాలో కాస్త మెరుగైన స్థానంలో ఉండే ఎన్టీవీలో తాజాగా అనూహ్య పరిణామాలు తెరమీదకుRead More

Pattiseema1

ఈనాడు అబద్ధమా..ఎందుకో సుమా

Spread the love3Sharesపట్టిసీమకు సంబంధించి తాజాగా ఈనాడు పత్రికలో రాసిన కథనం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవRead More

 • జగన్ ఆశలు పండలేదు…
 • ఏబీఎన్ అర్కేకి షాకిచ్చిన కోర్ట్
 • ఎల్లో.. ఎల్లో.. మీడియా ఫెల్లో…!
 • అయ్యో..అంధత్వంలో జ్యోతి…
 • తెరమీదకు వచ్చిన తొలి చానెల్
 • విలేకర్లు మూడో పని కూడా చేయాలి…
 • జగన్ అసలు పరీక్ష అక్కడే..
 • జ్యోతి స్వరం మార్చేసింది…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *