తెలుగు న్యూస్ చానెల్ మూత?

Gemini-News-TV-Telugu-Logo
Spread the love

ఆసక్తికర చర్చ మొదలయ్యింది. తెలుగులో మరో న్యూస్ చానెల్ మూతపడుతుందనే ప్రచారం ఊపందుకుంది. గతంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చినా అప్పట్లో అవి ఆచరణ రూపం దాల్చలేదు. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఇప్పటికే సన్ నెట్ వర్క్ లోని తమిళేతర చానెల్ ఒకటి మూతేయడంతో తెలుగు చానెల్ మీద సందేహాలు అలముకుంటున్నాయి.

సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకున్న ఉదయ టీవీని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కన్నడ భాషలో వార్తా చానెల్ గా ఉన్న సన్ నెట్ వర్క్ లోని ఈ చానెల్ మూసివేత విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 24 నుంచి చానెల్ మూసేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల చట్టం కింద ఇవ్వాల్సిన నోటీసును కూడా కర్నాటక ప్రభుత్వానికి పంపింది. మూసివేతలో భాగంగా 73 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అందులో వెల్లడించింది.

చానెల్ మూసివేతకు కేవలం నష్టాలే కారణంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని నోటీసులు కూడా పేర్కొన్నారు. 19 ఏళ్ళుగా కన్నడ న్యూస్ కోసం భారీగా పెట్టుబడిపెట్టి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ వచ్చినప్పటికీ గత రెండేళ్లలో నష్టాలు బాగా పెరిగాయని నోటీసులో పేర్కొనడం విశేషం. ప్రేక్షకాదరణ తగ్గిపోవడం, నష్టాలు పెరుగుతుండడం ఇక చానెల్ కొనసాగించలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు.

దాంతో ఇప్పుడు అందరి ద్రుష్టి జెమినీ న్యూస్ మీద పడింది. మొత్తం నాలుగు భాషల్లో సన్ నెట్ వర్క్ కు న్యూస్ చానల్స్ ఉండగా ఇప్పుడు ఉదయ న్యూస్ మూతపడడంతో తదుపరి జెమినీ న్యూస్ అనే భావిస్తున్నారు. ఉదయ న్యూస్ మూసివేయడానికి ప్రేక్షకాదారణ కారణం అని చెప్పడంతో తెలుగులో కూడా ఆ చానెల్ అదే వరుసలో ఉండడం గమనార్హం. దానికితోడుగా ఆర్థిక నష్టాల గురించి కూడా ప్రస్తావించిన తరుణంలో జెమినీ టీవీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చర్చనీయాంశం అవుతోంది.


Related News

SHHIVABALAJI

బిగ్ బాస్ అతడే..

Spread the loveతెలుగు బుల్లితెర అభిమానులను బిగ్ బాస్ అలరించింది. తొలి సీజన్ తో ఎన్టీఆర్ ఆడియెన్స్ ని కట్టిపడేశాడు.Read More

andhra jyothy

పాఠకులను అంధకారంలో నెట్టాలనుకున్న జ్యోతి

Spread the loveఆంధ్రజ్యోతి ఇటీవల పలు అంశాలలో గుడ్డిగా వెళుతూ అదే పాత్రికేయం అని అందరినీ నమ్మించే ప్రయత్నంలో నిండాRead More

 • మరో చానెల్ అమ్మకం
 • అర్నబ్ అబద్ధాల గో స్వామి
 • Ntv చౌదరి వియ్యంకుడి గురించి తెలుసా?
 • బిగ్ బాస్ ని అలా వాడేస్తున్నారు..
 • పాత్రికేయుల‌పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు
 • యూ ట్యూబ్ చానెళ్లపై నిఘా?
 • ఆంధ్రభూమి మూసివేత?
 • సర్వే ప్రసారం చేసిన జర్నలిస్టులు అరెస్ట్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *