Main Menu

అప్పుడు గ‌వ‌ర్న‌ర్ ని మార్చి..ఇప్పుడు గ‌డ్క‌రీని తెచ్చి..!

Spread the love

తెలుగు మీడియా తీరు ఒక్క‌సారి విచిత్రంగా ఉంటుంది. విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తుంది. విన్యాసాలు చూస్తుంటే విడ్డూరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర‌జ్యోతికి ఈ వ్య‌వ‌హారం ఈనాటిది కాదు. గ‌డిచిన ద‌శాబ్దకాలంగా ఆ పత్రిక‌లో వ‌చ్చిన కొన్ని ప్ర‌త్యేక క‌థ‌నాలు విన్న‌వాళ్ల‌కు, చ‌దివిన వాళ్ల‌కు విశేషంగా క‌నిపించినా, దాని వెనుక అస‌లు క‌థ తెలిస్తే నోరెళ్ల‌బెట్టే స్థాయిలో ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి విన‌య‌విధేయ రాధాకృష్ణ వ్య‌వ‌హార‌శైలి ఆ ప‌త్రిక‌లో ప్ర‌స్ఫుటం అవుతుంది. బాబుకి గిట్ట‌ని వాళ్ల‌పై బుర‌ద జ‌ల్లేందుకు ఆంధ్ర‌జ్యోతి అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తుంది. వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు ఆయ‌న్ని తొల‌గించి, డీఎస్ కో, జైపాల్ కి ఛాన్సిస్తున్నారంటూ రాసిన రాతల నుంచి నిన్న మొన్న‌టి గ‌వ‌ర్న‌ర్ మార్పు వ‌ర‌కూ వ‌చ్చిన క‌థ‌నాలు గ‌మ‌నిస్తే ఈ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది. టీడీపీ, బీజీపీ బంధం బ‌లంగా ఉన్న‌ప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల పెంపుద‌ల నుంచి, జ‌గ‌న్ కేసుల వ‌ర‌కూ ఆంధ్ర‌జ్యోతి లో వ‌చ్చిన వార్త‌లు మ‌న‌నం చేసుకుంటే మ‌న‌మంతా ఆశ్చ‌ర్య‌పోవాల్సి ఉంటుంది.

గ‌వ‌ర్న‌ర్ ని ఎన్నిసార్లు మార్చారో లెక్కే చెప్ప‌లేం. డిల్లీ నుంచి ఎంత మంది కొత్త గ‌వ‌ర్న‌ర్ల పేర్లు రాసారో కూడా చెప్ప‌లేనంత మంది ఉన్నారు. అలాంటి ప‌త్రిక‌లో ఇప్పుడు గ‌డ్క‌రీని పీఎం చేశారంటే ఆ వార్త‌లో ఉన్న స‌రుకు ఏపాటితో అర్థం చేసుకోవ‌చ్చు. ఆర్ఎస్ఎస్ కేంద్రం ఉన్న రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వ‌హించినంత మాత్రాన పీఎం సీటు వ‌స్తుంద‌నుకోవ‌డం విచిత్ర‌మే. పార్టీ ప్రెసిడెంట్ ప‌ద‌వినే గ‌డ్క‌రీ ద‌గ్గ‌ర పూర్తిగా ఉంచ‌కుండా పీకేశారు. అలాంటి నేత‌ను పీఎం చేస్తార‌ని, అది కూడా మోడీని ప‌క్క‌న పెట్టి పీఠ‌మెక్కిస్తార‌ని న‌మ్మ‌డం అంటే హాస్య‌స్ప‌ద‌మే. అయినా రాసేశారు..చ‌ర్చ‌కు పెట్టేశారు.

బాబుకి ఇప్పుడు మోడీ అంటే గిట్ట‌దు కాబ‌ట్టి గ‌డ్క‌రీ వ‌స్తారు. అప్ప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ మీద గుర్రుగా ఉన్నారు కాబ‌ట్టి..మార్చేస్తున్న‌ట్టు వార్త‌లు రాశారు. అంత‌కుముందు వైఎస్ వ్య‌వ‌హారం న‌చ్చ‌లేదు కాబ‌ట్టి విస్మ‌య‌క‌ర క‌థ‌నాలు అల్లారు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ తో పొస‌గ‌దు కాబ‌ట్టి మోడీకి ముడిపెట్టి రాత‌లు రాస్తుంటారు. ఇలాంటి చిత్ర‌విచిత్ర క‌థ‌నాల‌తో క్రెడిబులిటీ అన్న ప‌దానికే విలువ లేకుండా చేస్తున్న ప‌త్రికాధినేత తీరు పూర్తిగా అజ‌య్ క‌ల్లాం అన్న‌ట్టుగా ఆర్థిక‌ప్ర‌యోజ‌నాలే త‌ప్ప వార్తా ప్ర‌సారం కాద‌నే విష‌యం జ‌నాల‌కు వేగంగానే అర్థం అవుతుంద‌ని భావిద్దాం.


Related News

డిజిట‌ల్ న్యూస్ లో టాప్ బ్రాండ్స్ ఇవే..!

Spread the loveదేశంలో ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియా విస్త‌ర‌ణ‌కు మ‌రిన్ని అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మ‌రింత విస్త‌రించ‌డం ఖాయంగాRead More

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *