Main Menu

ఆంధ్ర‌జ్యోతి..అస‌లు వాస్త‌వం ఏది?

Spread the love

పెథాయ్.. ఓ సాధారణ తుఫాన్ గా మిగిలింది. కానీ మీడియాలో మాత్రం అతిపెద్ద బీభ‌త్స‌క‌రంగా క‌నిపించింది. ఈ తుఫాన్ సంద‌ర్భంగా కేవ‌లం 70 నుంచి 80 కిలోమీట‌ర్ల వేగంతో మాత్ర‌మే వీచిన గాలులు, 10 నుంచి 15 సెం.మీ వ‌ర్ష‌పాతం మాత్ర‌మే కుర‌వ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ రాజ‌కీయంగా అధికార పార్టీ మాత్రం దీనిని వినియోగించుకుని త‌మ సామ‌ర్ధ్యం మూలంగానే పెథాయ్ ప్ర‌భావాన్ని త‌గ్గించ‌గ‌లిగామ‌ని చెప్పుకునేందుకు శ్ర‌మిస్తోంది. ఇప్ప‌టికే సీఎం కూడా భార‌త వాతావ‌ర‌ణ శాఖ క‌న్నా త‌మ ఆర్టీజీఎస్ మిన్న అని ప్రచారం ప్రారంభించారు.

అందుకు అనుగుణంగానే మీడియా క‌థ‌నాలు సాగుతున్నాయి. తుఫాన్ కి ముందూ, త‌ర్వాత కూడా ఓ సెక్ష‌న్ మీడియాలో వార్త‌లు అందుకు అనుగుణంగా ఉన్నాయి. ఇక తాజాగా ఆంధ్ర‌జ్యోతి మ‌రో అడుగు ముందుకేసింది. రొయ్య‌ల చెరువుల ఫోటోని తీసుకొచ్చి, ప‌చ్చ‌ని పొలాలు , పంట‌లు నీటిపాల‌య్యాయ‌ని చెప్పేందుకు ప్ర‌య‌త్నించింది. తాజాగా ఆంధ్ర‌జ్యోతి ప్ర‌ధాన వార్తాంశం గ‌మ‌నిస్తే ఈ విష‌యం అర్థ‌మ‌వుతుంది. మెయిన్ పేజీలో వేసిన ఏరియ‌ల్ వ్యూ ఫోటో ప్ర‌కారం పొలాల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌యిన‌ట్టు ఆంధ్ర‌జ్యోతి చిత్రీక‌రించింది.

కానీ వాస్త‌వానికి యానాం, ఐ పోల‌వ‌రం, తాళ్ల‌రేవు స‌హా అనేక మండ‌లాల్లోని తీర ప్రాంత‌మంతా పూర్తిగా రొయ్య‌ల చెరువులుగా మారి చాలాకాలం అయ్యింది. తీరానికి ఆనుకుని ఉన్న పొలాల్లో వ‌రి సాగు క‌న్నా రొయ్య‌ల చెరువులు లాభ‌దాయ‌కంగా ఉండ‌డంతో రైతులంతా అటు మ‌ళ్లారు. అంద‌రికీ తెలిసిన స‌త్య‌మే అయిన‌ప్ప‌టికీ రొయ్య‌ల చెరువుల ఫోటోని ఏరియ‌ల్ వ్యూలో తీసి పొలాలు నీటి మునిగిన‌ట్టు చెప్పేందుకు ప్ర‌య‌త్నించ‌డం ద్వారా తుఫాన్ చాలా తీవ్ర‌మ‌యిన‌దనే అబిప్రాయం పాఠ‌కుల్లో క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నించింది. దానిని అధిగ‌మించ‌డంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ కృషిని ఎక్కువ‌గా చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. అదే స‌మ‌యంలో ఆంధ్రజ్యోతి క‌థ‌నం రాసిన ప్రాంతాల్లో ప్ర‌స్తుతం పంట‌లు లేవు. ఖ‌రీఫ్ సాగు పూర్త‌య్యింది. ర‌బీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతుండ‌గా తుఫాన్ వ‌చ్చింది. దాని వ‌ల్ల పంట న‌ష్టం కూడా లేక‌పోయినా ఈ స్థాయిలో ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో అస‌లు వాస్త‌వాల‌ను విస్మ‌రించ‌డం గ‌మ‌నిస్తుంటే వారికిదో అల‌వాటుగా మారింద‌ని ప‌లువురు చేసే వ్యాఖ్య‌లు నిజ‌మ‌నిపించేలా ఉంది.






Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *