Main Menu

ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మ‌న్ హ‌త్య?

Spread the love

తెలుగులో కొంత కాలం పాటు హ‌వా సాగించిన ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మ‌న్ అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించారు. హ‌త్య‌గా ప‌లువురు అనుమానిస్తున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం సమీపంలో 65 నెంబర్ జాతీయ రహదారి పక్కన ఆయ‌న మృతదేహం లభ్యమైంది. కారులో రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాంగా నిర్ధారించడంతో క‌ల‌కలం రేగింది.

జయరాం కోస్టల్ బ్యాంకులో ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నాడని, ఓ ఫార్మా కంపెనీకి యజమాని కూడా అని పోలీసులు తెలిపారు.కారులో మద్యం సీసాలు లభ్యమయ్యాయని, జయరాం మృతిని హత్యకేసుగా నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

జయరాంకు ఆస్తి తగాదాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. మృతుని బ్యాంక్ లావాదేవీలు, కాల్ డేటాపై దృష్టి పెట్టామని వెల్లడించారు. జయరాం రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బయల్దేరి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 12గంటల సమయంలో రోడ్డు ప్రక్కన కారులో మృతదేహం ఉందన్న సమాచారం తమకు అందడంతో ఘటనాస్థలానికి చేరుకున్నామని తెలిపారు.

గ‌తంలో మూడేళ్ల పాటు ఎక్స్ ప్రెస్ టీవీ న‌డిపి అనూహ్యంగా మూత‌వేశారు. ప‌లు స‌మ‌స్య‌ల్లో చిక్కుకున్నారు. ఇక అక్ర‌మ సంబంధాల వ్య‌వ‌హారాలు కూడా ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని కొంద‌రు సందేహిస్తున్నారు. కాల్ డేటా ల‌భిస్తే కొంత ఆధారాలు దొర‌క‌వ‌చ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. జ‌య‌రామ్ కార్ న‌డిపిన వ్య‌క్తి వైట్ ష‌ర్ట్ లో ఉన్నార‌ని, సీసీ ఫుటేజ్ లో గుర్తించ‌డం క‌ష్టంగా ఉంద‌ని అంటున్నారు. దాంతో ఈ కేసు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.






Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *