ఆ టీవీ చానెల్ ఆస్తులు ఎటాచ్ మెంట్

Express-Tv-1
Spread the love

తెలుగు మీడియాలో సంచలనం నమోదయ్యింది. టీవీ చానెళ్ల ఆస్తులను ఎటాచ్ చేసే కొత్త ఆనవాయితీకి శ్రీకారం పడింది. లేబర్ కోర్ట్ ఆదేశాలతో ఎక్స్ ప్రెస్ టీవీ ఆస్తులు ఎటాచ్ చేయడం ఆసక్తికరంగా మారింది. సిబ్బంది వేతనాల విషయంలో చానెల్ యాజమాన్యం తీరుపై కోర్ట్ సీరియస్ అయ్యింది. దాంతో ఆ టీవీ చానెల్ ఆస్తులను ఎటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. చిగురుపాటి వరప్రసాద్ కి చెందిన ఈ చానెల్ గడిచిన ఎన్నికల సమయంలో ప్రారంభం అయ్యింది. ఆ తర్వాత మూడేళ్ల పాటు కొనసాగింది. కానీ ఈ ఏడాది ప్రారంభంలోనే దాదాపుగా మూతపడింది. మధ్యలో సిబ్బంది ఆందోళనల కారణంగా పలుమార్లు వివాదాలకు కారణం అయ్యింది. ఉద్యోగులను కోర్ట్ లను ఆశ్రయించడం, జర్నలిస్టు సంఘాల ఆందోళనలు ఇలా ఆ చానెల్ ముగింపు వివాదాలమయంగా కనిపించింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా లేబర్ కోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ చానెల్ యాజమాన్యం ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని చెప్పక తప్పదు.

జర్నలిస్టుల విషయంలో మీడియా యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సమయంలో యూనియన్లు సకాలంలో స్పందిస్తే ఫలితాలొస్తాయనడానికి ఈ ఎక్స్ ప్రెస్ టీవీ వ్యవహారం ఓ ఉదాహరణగా నిలుస్తుంది. యాజమాన్యం ఏడాదిగా జర్నలిస్టులకు,ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడమే కాకుండా యూనియన్ నేతలకు స్పందించకపోవడంతో చివరకు న్యాయస్థానం జోక్యంతో వ్యవహారం కథ కొత్త మలుపు తిరిగింది.చివరకు ఇప్పుడు ఆ సంస్థ యాజమాన్యానికి చెందిన 3 .5 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పుడు యాజమాన్యం మాత్రం మొండిగా ముందుకు వెళ్లడం వారికే నష్టం కాబట్టి, సమస్య పరిష్కారానికి చొరవ చూపించి, సిబ్బందితో సెటిల్ మెంట్ చేసుకోవడం ఉత్తమం అనే అభిప్రాయం వినిపిస్తోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *