Main Menu

కాషాయ ఈనాడు…

22359501_1641306822599727_576667344_n
Spread the love

నిన్నటి వరకూ పచ్చ మీడియాగా భావించేవారు కూడా ఇప్పుడు ఈనాడు కాషాయి రూపం ధరించిన విషయం కాదనలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ అధికారంలో ఉన్న వారికి అనుకూలంగా అక్కడ వ్యవహరిస్తూ ఏరోటికాడ ఆ పాట పాడడంలో రామోజీరావు నిష్ణాతుడిగా మారుతున్నారు. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. ఇటీవలే గౌరీ లంకేష్ ను దారుణంగా ఆమె ఇంటి వద్దే దుండగులు హత్య చేస్తే దానిని కాల్చివేత అని హెడ్డింగ్ పెట్టి కసాయితనం చాటుకుంది. ఉగ్రవాదులను, ఇతర సంఘ వ్యతిరేకులను భద్రతాదళాలు కాల్చినప్పుడు కాల్చివేత అని రాస్తారు. కానీ ఒక జర్నలిస్టును కాల్చి చంపిన సమయంలో కాల్చివేత అంటూ దాని తీవ్రతను తగ్గించడానికి తీవ్రంగా శ్రమించింది.

ఇక ఇప్పుడు విశాఖలో సీపీఎం కార్యాలయం మీద బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు దాడికి పాల్పడ్డాయి. కేరళ ఘటనలకు వ్యతిరేకంగా జీవీఎంసీ వద్ద ర్యాలీ చేస్తామని చెప్పి, దానికి భిన్నంగా సీపీఎం కార్యాలయం మీదకు బయలుదేరారు. అక్కడ గేట్లు వేసి ఉండడంతో వాహనాలను ధ్వసం చేసే ప్రయత్నం చేశారు. చివరకు సీపీఎం కార్యకర్తలు కూడా రోడ్డెక్కడంతో వాతావరణం వేడెక్కింది. చివరకు సీపీఎం నాయకుడు నర్సింగరావు గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బీజేపీ ఎమ్మెల్సీ సహా పలువురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.

అయితే దానిని ఈనాడు రాసిన విథానం గమనిస్తే వక్రీకరణలకు బాగా అలవాటుపడినట్టు స్పష్టమవుతోంది. ఉద్రిక్తతకు దారితీసిన ర్యాలీ అంట…అంటే ర్యాలీ చేస్తుంటే మరొకరు అడ్డుకున్న సమయంలో ఉద్రిక్తత ఏర్పడిందనే అర్థం వచ్చే రీతిలో వక్రభాష్యం చెప్పింది. అంతేగాకుండా ఇరుపార్టీల నేతలు బాహాబాహీకి తలపడ్డారట. అసలు ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మరో పార్టీ దాడికి పాల్పడడం తెలుగు నాట లేదు. నిరసనలు తెలపాలంటే అనేక మార్గాలున్నాయి. వేదికలున్నాయి. కానీ నేరుగా మరో పార్టీ కార్యాలయం మీదకు వెళ్లడం ప్రమాదకర సంకేతం. అయినా దానికి భిన్నంగా అధికారమదంతో ఓ పార్టీ మరో పార్టీ ఆఫీసుకి వెళ్లడం, దాడులకు పాల్పడడం నేరుగా కనిపిస్తున్నా దానిని ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ద్వారా ఈనాడు దాదాపుగా కాషాయరంగు పులుముకుందున్న వాస్తవం స్పష్టం అవుతోంది.

దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఈనాడు రిలయెన్స్ బంధం కొన్నాళ్లుగా బలపడింది. గతంలో వైఎస్ హయంలో మార్గదర్శి ఇబ్బందుల్లో పడినప్పుడు రిలయెన్స్ చేదోడుతో రామోజీరావు గట్టెక్కారు. దానికి ప్రతిఫలంగా ఈనాడు చానెళ్లు రిలయెన్స్ కి దక్కాయి. రిలయెన్స్ అంబానీ కోసం మోడీ విధానాలు రూపొందిస్తారు. దానికి రామోజీ మీడియా కూడా వంతపాడుతుంది. ఈ మధ్యలో రిలయెన్స్, మోడీ కి వ్యతిరేకంగా ఎవరైనా ఉద్యమిస్తే వారి మీద నిందలు వేసే రాతలకు దిగుతుంది. ఇక మోడీ భక్తులెవరైనా బరి తెగిస్తే వారికి ఎక్కువ నష్టం కలగకుండా ఇలాంటి రాతలతో సహకారిగా మారుతుంది. అందుకే కాషాయ ఈనాడు కథలను ఆ కోణంలోనే అర్థం చేసుకోవాలి.


Related News

moturi-hanumantha-rao

ఉత్త‌మ జ‌ర్న‌లిస్టు అవార్డ్ కి ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తినిధి

Spread the love మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు- 2018 అవార్డుకు ఆంధ్రజ్యోతి శ్రీకాకుళం బ్యూరో రిపోర్టర్‌ సిహెచ్‌Read More

at news republic

తెలుగులో మ‌రో శాటిలైట్ చానెల్ సిద్దం

Spread the loveతెలుగు మీడియాలో ఇప్ప‌టికే న్యూస్ చానెళ్ల సంఖ్య పెరిగిపోయింది. ఇటీవ‌ల వెబ్ చానెళ్లు విజృంభిస్తుండ‌డంతో కెమెరాల సంద‌డిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *