Main Menu

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the love

జర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి. అందుకు తాజా ఉదాహ‌ర‌ణే ఈనాడు క‌థ‌నం. పాత క‌థ‌ను కొత్త‌గా రాసి, తాజా ప‌రిణామంగా చిత్రీక‌రించ‌డానికి ఈనాడు ప్ర‌య‌త్నించింది. దాంతో అది సిబ్బంది అజాగ్ర‌త్త‌వ‌ల్ల జ‌రిగిందా లేక ఉద్దేశ‌పూర్వ‌కంగా సాగిందా అన్న చ‌ర్చ మొద‌ల‌య్యింది. ఈనాడు వ్య‌తిరేకులంతా అది పూర్తిగా బీజేపీని బ‌ద్నాం చేయాల‌న్న చంద్ర‌బాబు ప‌థ‌కంలో భాగ‌మేన‌ని వాదిస్తున్నారు. కానీ రెండురోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసిన వ్య‌వ‌హారంలో పూర్తిగా ప‌రిశీల‌న చేయ‌కుండా రాసిన క‌థ‌నంగా కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఈనాడు క‌థ‌నం ప్ర‌కారం బీజేపీ ఐటీ విభాగం ప్ర‌తినిధి ప్ర‌ద్యుత్ బోరా ఆపార్టీకి గుడ్ బై చెప్పారు. మోడీ, షా ద్వ‌యం తీరు మీద ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అసోంకి చెందిన ఆయ‌న పార్టీతో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నారు. అయితే వాస్త‌వానికి అది జ‌రిగింది 2015లోనే కావ‌డం విశేషం. మూడేళ్ల క్రితం నాటి వార్త‌ను ఇప్పుడు ఈనాడు ప్ర‌చురించ‌డం విశేషంగా మారింది. వాస్త‌వానికి బీజేపీ ఐటీ సెల్ వ్య‌వ‌స్థాప‌కుల్లో ప్ర‌ద్యుత్ ఒక‌రు. ఆయ‌న కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోనే ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు చురుగ్గా క‌నిపిస్తుంటాయి. అలాంటి వ్య‌క్తి 2014లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏడాది తిర‌గ‌కుండానే మోడీ పాల‌న మీద తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 2015 ఫిబ్ర‌వ‌రి 19 న రాజీనామా చేశారు.

కానీ తాజాగా ఆ క‌థ‌నం సోష‌ల్ మీడియాలో మ‌రోసారి వైర‌ల్ అయ్యింది. చాలామంది ఈ విష‌యం తాజా ప‌రిణామంగా పొర‌బ‌డ్డారు. చివ‌ర‌కు ఈనాడు కూడా అదే రీతిలో క‌థ‌నం ఇవ్వ‌డంతో ఈ విష‌యం ఆస‌క్తిగా మారింది. ఈనాడు ప‌ప్పులో కాలేసిన‌ట్టు క‌నిపిస్తోంది. బీజేపీ శ్రేణుల‌కు ఈ వ్య‌వ‌హారం మింగుడుప‌డ‌డం లేదు. కేంద్రంలోని పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో కొంద‌రు ఉన్న‌ట్టు స‌మాచారం.

29497179_10215828827103960_5831109308165497261_n


Related News

చ‌ర్చ‌నీయాంశంగా మారిన టీవీ9 స‌ర్వే

Spread the loveప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరులో ప్ర‌తీ అవ‌కాశం కూడా వినియోగించుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మీడియా అందుకు తందానRead More

అప్పుడు వైసీపీ..ఇప్పుడు జ‌న‌సేన‌

Spread the loveఏపీ లో ప్ర‌భుత్వ పెద్ద‌ల్లో అస‌హ‌నం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. అనేక చ‌ట్టాలు కూడ‌ద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ లొసుగులు వాడుకునిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *