‘తెలుగు’ సభల్లో ఈనాడు సొంత డబ్బా

25498406_2017881741829088_9150841887280377461_n
Spread the love

నాలుగు డబ్బులొచ్చే ఏ అవకాశాన్నీ ‘ఈనాడు’ వదులుకోదు. అసలు తెలుగు భాషకి ప్రాచీన హోదా దక్కిందనగానే మొదట వాలిన రాబందు రామోజీయే అంటారు. తాజాగా తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలలో ‘రామోజీ కిట్స్’ పంచిపెట్టారు. ఈ సభలకోసం ‘తెలుగు వెలుగు’ ప్రత్యేక సంచికను 196 పేజీలతో ప్రచురించారు. ఈ సభలకు హాజరైన ప్రతినిధులకు రామోజీ ఫౌండేషన్‌ ప్రత్యేక సాహిత్య సామగ్రిని (కిట్‌) అందజేసింది. తెలుగు వెలుగు ప్రత్యేక సంచిక, బాలభారతం, చతుర, విపుల సంచికలను వేలాదిగా ఒక నారసంచీలో పెట్టి మరీ ఉచితంగా అందజేశారు.

రామోజీకి ఇంత ఉదారత ఎక్కడిదని ఆశ్చర్యపోకండి. ప్రాచీన హోదా దక్కిన భాషల వికాసానికి, అభివృద్ధికి, పరిశోధనలకు, ప్రచురణలకు కోట్లాది రూ.లను కేంద్రం సమకూరుస్తుంది. ఈనాడు పదకోశం కోసం చేస్తున్న ప్రయత్నంకూడా అందులో భాగమే. వై.ఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో తమిళులను ఢీకొని తెలుగు భాషకు ప్రాచీన హోదా లభించేలా పోరాడారు. 2004లో తమిళం ప్రాచీన హోదాని దక్కించుకుని దక్షిణాదిన మరే భాషకు ఆ స్టేటస్ దక్కకుండా అడ్డం పడింది. వై.ఎస్. ఈ విషయంలో మడమ తిప్పని పోరాటం జరిపారు. ఆయన సంకల్పం ఫలించింది. 2008లో తెలుగుతోపాటుగా కన్నడ భాషకుకూడా క్లాసికల్ స్టేటస్ లభించింది. వై.ఎస్. స్పూర్తితో మలయాళీ, ఒడియాలుకూడా పోరాడి ఇప్పటికి సాధించుకోగలిగాయి.

తెలుగుకి ప్రాచీన హోదా దక్కినప్పటి నుంచి రామోజీ స్కెచ్ వేశారు. ఎందుకంటే, తొలి ఏడాదిలోనే 100 కోట్ల రూ.లు విడుదలయ్యాయి. ఈ హోదా పొందిన భాషలకు యునెస్కో నుంచికూడా నిధులు సమృద్ధిగా లభిస్తాయి. ప్రాచీన సాహిత్య పరిరక్షణ, వ్యాప్తి వగైరాలతోపాటు విదేశాల్లో తెలుగు పీఠాలుకూడా ఏర్పాట్లు చేయాలని అప్పటి అధికార భాషా సంఘం చైర్మన్ ఎ.బి.కె.ప్రసాద్ సంకల్పించారు. కానీ, రామోజీ తన వాటాకోసం బ్రహ్మాండమైన స్కెచ్ వేసుకున్నారు.
తన కోటలోనే కొన్ని గదులు తెలుగు ఉద్ధరణకు కేటాయించి, ’తెలుగు వెలుగు‘ పేరుతో 2012లో ఒక పత్రిక ఆరంభించారు. ఇది ఎంత కంగాళీగా మొదలయ్యిందంటే, వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి (ఆగస్టు 29)కి విడుదల చేశామని చెప్పి, కనీసం ఆయనకు సంబంధించిన ఒక ఆర్టికల్ లేదా ఫొటో అయినా లేకుండా మార్కెట్లో అచ్చేసి వదిలేశారు. ఈ అయిదేళ్లలో మార్గదర్శి మార్కెటింగ్ నయానో భయానో ఏజెంట్లకు అంటగట్టి, మొత్తం మీద మేము సైతం అంటూ జబ్బలు చరుచుకునే స్థితికి తెచ్చారు.

ప్రస్తుతం ’తెలుగు వెలుగు‘లో 50% మించి యాడ్స్ ఉంటున్నాయి. పత్రికన్నాక ప్రకటనలు సహజమే. ఎవరూ తప్పు పట్టే పని లేదు. కానీ, తామేదో తెలుగు ఉద్ధరణకోసం లాభాసేక్ష లేకుండా నడిపేస్తున్నామని డబ్బా కొట్టుకోవడం ‘ఈనాడు’ లేకిబుద్ధిని బయటపెడుతోంది. గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం అన్నట్లుగా న్యూస్ ప్రింట్ వేస్టేజీతో ప్రింట్ చేసే చతుర, విపుల సంచికలను ‘ఉచితంగా’ పంచిపెట్టారు. సర్క్యులేషన్ నెలకు చతుర 21 వేలు, విపుల 21 వేలు. అంటే, రెండు రాష్ట్రాల్లోనూ జిల్లాకి 1,000 కాపీలైనా వెళ్లవు. బరువైన జనపనార చేతి సంచీపై కనీసం తెలుగు ఉద్ధరణ నినాదమైనా లేదు. 100 అడుగుల దూరం నుంచి చూసినా కొట్టొచ్చినట్టు కనబడేలా ‘రామోజీ’ పేరు వేసుకున్నారు. ఈ సంచీని ఎంత రఫ్‌గా వాడినా కనీసం రెండేళ్లయినా ఉంటుంది. ఈ మాత్రం చాలు, ఇంతకంటే చౌకలో పబ్లిసిటీ మైలేజీ మరెక్కడా రాదు.

-మణి


Related News

Eenadu_Office,Vizag

త‌ప్పులో కాలేసిన ఈనాడు

Spread the loveజర్న‌లిజంలోనే కాదు..ఎక్క‌డ‌యినా అల‌వాటులో పొర‌పాట్లు కొన్ని స‌హ‌జం. అత్యంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే చోట కూడా అలాంటివి చోటుకుంటాయి.Read More

NDTV

మీడియా యాజ‌మాన్యానికి జ‌రిమానా

Spread the loveదేశంలోనే ప్ర‌ఖ్యాత మీడియా సంస్థ‌కు జ‌రిమానా విధించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే దానికి కార‌ణంగా చెబుతున్నారు. అయితేRead More

 • ప‌వ‌న్ కి షాకిచ్చిన మీడియా!
 • అయ్యో..ఆంధ్రజ్యోతి..!
 • ఆంధ్ర‌జ్యోతికి కేకు తినిపించిన జ‌గ‌న్
 • రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్..కానీ జ‌ర్న‌లిస్టుల‌కు..!
 • అభాసుపాల‌యిన మీడియా
 • తెలుగు మీడియాలో బాబుకి అన్యాయం!
 • టీవీ9 వెన‌క్కి…ఎన్టీవీ అగ్ర‌స్థానానికి
 • వైసీపీ కేసులో ఆంధ్ర‌జ్యోతి ఎండీకి ఊర‌ట‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *