Main Menu

బ్ర‌హ్మ‌ణి ప‌రువు తీసిన ఈనాడు,జ్యోతి, అచేత‌నంగా సాక్షి!

Spread the love

ఏపీలో విప‌క్ష నేత భార్య వైఎస్ భార‌తి చుట్టూ ఈడీ పావులు క‌దుపుతోంది. భార‌తిని కోర్టు గుమ్మం ఎక్కించేయత్నంలో ఉంది. కోర్టులో వేసిన పిటీష‌న్ కి న్యాయ‌స్థ‌నం స‌మ్మ‌తిస్తే భార‌తి కూడా వాయిదాల కోసం కోర్టుల చుట్టూ తిర‌గాల్సి వ‌స్తుంది. అయితే ఈడీ పిటీష‌న్ లో పేర్కొన్న విష‌యాల‌ను కోర్టు ఏమేర‌కు అనుమ‌తిస్తుంద‌న్న‌ది సందేహంగా మారుతోంది ఇప్ప‌టికే ప‌లువురికి విముక్తి ల‌భించిన కేసులో కొత్త వారిని చేర్చ‌డానికి సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం అంత త్వ‌ర‌గా సాధ్యం కాదు. అదే స‌మ‌యంలో అత్య‌ధిక వేత‌నం పొందుతుండ‌డాన్ని అభ్యంత‌రంగా పేర్కొన‌డం ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది.

తాజాగా తొలుత ఈనాడు, మ‌రునాడు ఆంధ్ర‌జ్యోతిలో రాసిన ఈడీ పిటీష‌న్ వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే వైఎస్ భార‌తి ఏకంగా 3.9 కోట్లు తీసుకోవ‌డం తీవ్ర అభ్యంత‌ర‌కంగా ఈడీ భావిస్తోంది. భార‌తి సిమెంట్స్ లో భాగస్వామిగా ఫ్రెంచ్ కంపెనీలో కూడా ఎవ‌రికీ ద‌క్క‌నంత వేత‌నం భార‌తి తీసుకోవ‌డం క్విడ్ ప్రో కో కింద భావించాల్సి ఉంటుంద‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కానీ అస‌లు విష‌యం ఏమంటే మ‌న చ‌ట్టాల ప్ర‌కారం క‌నిష్ట వేత‌నాలు ఎంతివ్వాల‌న్న‌దే పేర్కొన్నారు గానీ గ‌రిష్టంగా ఇంత‌కుమించి ఇవ్వాల‌న్న నిర్ణ‌యం ఎక్క‌డా లేదు. దాంతో ఆయా కంపెనీలు, ప్రైవేటు యాజ‌మాన్యాలు త‌మ అవ‌కాశాలు, అవ‌స‌రాల‌ను బ‌ట్టి వేత‌నాలు నిర్ణ‌యించుకుంటాయి. చివ‌ర‌కు ఓ స‌బ్ ఎడిట‌ర్ జీతం ఆంధ్ర‌జ్యోతితో పోలిస్తే ఈనాడులో చాలా ఎక్కువే ఉంటుంది. అయినా దానినే అభ్యంత‌రం అని చెప్ప‌డం విశేషంగా క‌నిపిస్తోంది.

అయితే భార‌తికి పోటీగా వైసీపీ నేత‌లు నారా బ్ర‌హ్మ‌ని, నారా భువ‌నేశ్వ‌రి వేత‌నాల ప‌ట్టిక‌లు బ‌య‌ట‌కు తీస్తున్నారు. ఈ ఇద్ద‌రూ హెరిటేజ్ లో అత్య‌ధిక వేత‌నాలు పొందుతున్న వాస్త‌వాన్ని చాటిచెబుతున్నారు. ఏంబీఏ గ్రాడ్యుయేట్ వైఎస్ భార‌తి క‌న్నా నారా భువ‌నేశ్వ‌రికి ఎక్కువ వేత‌నం ఏకంగా 5.3 కోట్లు ఎలా తీసుకుంటున్నారంటూ నిల‌దీస్తున్నారు. నారా బ్ర‌హ్మ‌ణి కూడా స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్సిటీ గ్రాడ్యుయేట్ కాబ‌ట్టి ఆమెకు 4.22 కోట్లు ఇస్తున్న విష‌యం కూడా ప్ర‌స్తావిస్తున్నారు. దాంతో ఇప్పుడు భార‌తి కార‌ణంగా బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి కూడా రోడ్డున ప‌డాల్సిన దుస్థితి వ‌స్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో ఈ విష‌యంలో సాక్షి పాత్ర‌పై చివ‌ర‌కు వైసీపీ శ్రేణుల్లో కూడా నైరాశ్యం అల‌ముకుంటోంది. అచేతనంగా స‌దరు మీడియా సంస్త‌ల్లో కొంద‌రి తీరు వ‌ల్ల జ‌గ‌న్ కుటుంబం మీద సాగుతున్న దుష్ప్ర‌చారం స‌మ‌ర్థంగా తిప్పికొట్ట‌గ‌ల అవ‌కాశం చేజారిపోతోంద‌న్న ఆవేద‌న వ్య‌క్తం అవుతోంది.


Related News

టీవీ5పై నిషేధం న్యాయ‌మేనా?

Spread the loveప్ర‌జాస్వామ్యంలో ఫోర్త్ పిల్ల‌ర్ మీడియాకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంటుంది. కానీ రానురాను అది తారుమార‌వుతోంది. మీడియా రూపంRead More

‘సాక్షి’కి అన్యాయం జ‌రిగిందా..?

Spread the loveమీడియా ఓ రాజకీయ సాధ‌నంగా మారిపోయిన త‌ర్వాత పాల‌క‌ప‌క్షాలు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం విస్తృత‌మ‌య్యింది. గ‌తంలో కూడా కొంద‌రుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *