Main Menu

చ‌ర్చ‌నీయాంశంగా మారిన టీవీ9 స‌ర్వే

Spread the love

ప్ర‌స్తుతం ఎన్నిక‌ల పోరులో ప్ర‌తీ అవ‌కాశం కూడా వినియోగించుకునేందుకు పార్టీలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. మీడియా అందుకు తందాన తాన అంటుండ‌డంతో వ్య‌వ‌హారం స‌ర్వే జ‌నాల చుట్టూ తిరుగుతోంది. ఒక‌ప్పుడు ప్రీ పోల్ స‌ర్వేలు నోటిఫికేష‌న్ రాక‌ముందు, ఎగ్జిట్ పోల్ పోలింగ్ త‌ర్వాత వెలువ‌డేవి. ఈసీ కూడా అంత‌వ‌ర‌కే ప‌రిమితులు ఇచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. రెండు రోజుల్లో ప్ర‌చారం ముగుస్తున్న వేళ కొత్త స‌ర్వేతో టీవీ9 చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేసీఆర్ చెబుతున్న‌ట్టుగానే అంకెలు ఆ స‌ర్వేలో పొందుప‌ర‌చ‌డంతో ప‌లువురు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే ఇలాంటి సీపీఎస్ స‌ర్వేని టీవీ9 ఎలా ప్ర‌సారం చేసిందా అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. అటు కేసీఆర్, ఇటు చంద్ర‌బాబు మ‌ధ్య స‌మ‌దూరం పాటించే చానెల్ లో ఇలాంటి స‌ర్వే ప్ర‌సారం కావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే అస‌లు కార‌ణం టీవీ9 యాజ‌మాన్యం మార‌డ‌మే. ఇప్ప‌టికే ఈ చానెల్ టీఆర్ఎస్ చేతుల్లో ఉంది. కేసీఆర్ స‌మీప బంధువు మై హోం రామేశ్వ‌ర రావు ఈ చానెల్ లో వాటాదారుడు. దానికి త‌గ్గ‌ట్టుగానే గ‌డిచిన కొన్ని నెల‌లుగా మార్పులు క‌నిపిస్తున్నాయి. అంతేగాకుండా టీవీ9లో ప్రైమ్ టైమ్ వ్య‌వ‌హారాలు చూసే ర‌జ‌నీకాంత్ స్థానంలో ముర‌ళీకృష్ణ ఈస‌ర్వే ప్ర‌జెంట్ చేయ‌డం కూడా విశేషంగా భావించాల్సి ఉంటుంది.

దాంతో స‌హ‌జంగానే కేసీఆర్ ప్ర‌యోజ‌నాల కోసం, కేసీఆర్ చెబుతున్న లెక్క‌లే స‌ర్వే పేరుతో వ‌ల్లించి ఉండ‌వ‌చ్చ‌ని ఇత‌ర పార్టీల నేత‌లు సందేహిస్తున్నారు. దాంతో టీవీ9 ప్ర‌సారాం చేసిన సీపీఎస్ స‌ర్వేకి పోటీగా ల‌గ‌డ‌పాటి స‌ర్వేని ముందుకు తీసుకొచ్చేందుకు ప్ర‌జా కూట‌మి పావులు క‌దుపుతోంది. ఎల్లుండ ప్రసారం ముగించే స‌మ‌యంలో ల‌గ‌డ‌పాటి మీడియా స‌మావేశం పెట్టి స‌ర్వే వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు. అయితే ల‌గ‌డ‌పాటి మాత్రం పోలింగ్ ముగిసిన త‌ర్వాత త‌న స‌ర్వే వెల్ల‌డిస్తాన‌ని చెప్పిన త‌రుణంలో తాజా స‌ర్వేకి పోటీగా మ‌హా కూట‌మి ఎలా స్పందిస్తుందో చూడాలి.


Related News

పుంజుకున్న సాక్షి టీవీ: పొలిటిక‌ల్ సంకేత‌మేనా?

Spread the loveతెలుగు మీడియాలో బార్క్ రేటింగ్స్ కి పెద్ద‌గా ప్రాధాన్య‌త లేక‌పోవ‌చ్చు గానీ వాటికున్న గుర్తింపు వాటికుటుంద‌న‌డంలో సందేహంRead More

ఈవీఎం వ్య‌వ‌హారంలో విలేక‌రుల‌పై కేసు!

Spread the loveఈవీఎం ల వ్య‌వ‌హారం ముదురుతోంది. మీడియా మెడ‌కు చుట్టుకుంది. ప‌లువురిపై కేసు కూడా న‌మోద‌య్యింది. మొన్న‌టి సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *