Main Menu

‘సాక్షి’లో మార్పులు త‌ప్ప‌వా?

Spread the love

ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ కి చెందిన సాక్షి సంస్థ‌ల వ్య‌వ‌హారంపై చాలాకాలంగా పాఠ‌కుల్లోనే కాకుండా వైసీపీ అభిమానుల్లోనూ అస‌హ‌నం క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియాలో సాక్షి క‌థ‌నాల‌పై సెటైర్ల‌తో విరుచుకుపడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ నేప‌థ్యం లో అటు ప‌త్రిక‌, ఇటు టీవీ చానెల్ లో ప‌లు మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ముఖ్యంగా సాక్షి కీల‌క రాజ‌కీయ క‌థ‌నాల విష‌యంలో జ‌గ‌న్ కూడా అసంతృప్తి ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఎడిటోరియ‌ల్ బోర్డ్ డైరెక్ట‌ర్ గా ఉన్న రామ‌చంద్ర‌మూర్తి తో పాటు టీవీ షోలు నిర్వ‌హిస్తున్న అమ‌ర్, కొమ్మినేని ప‌ట్ల కూడా జ‌గన్ సంతృప్తిగా లేర‌ని స‌మాచారం. దాంతో పొలిటిక‌ల్ ఎఫైర్స్ టీమ్ లో కొన్ని మార్పుల‌కు రంగం సిద్ధం చేసిన‌ట్టు సాక్షి వ‌ర్గాల్లోనే ప్ర‌చారం సాగుతోంది.

అయితే సాక్షి సంస్థ‌ల్లో సీనియ‌ర్ల‌కు వార్నింగ్ ఇచ్చి, స‌రిచేసే ప్ర‌య‌త్న‌మే త‌ప్ప ప్ర‌స్తుత స‌మ‌యంలో పెద్ద‌గా మార్పులు ఉండ‌క‌పోవ‌చ్చ‌నే అభిప్రాయం కూడా వ్య‌క్తం అవుతోంది. కీల‌క‌మైన క‌థ‌నాల విష‌యంలో చంద్ర‌బాబు అనుకూల మీడియాకు త‌గిన రీతిలో స‌మాధానం చెప్ప‌డానికి సాక్షి నిర్వాహ‌కులు స‌న్న‌ద్ధం కాక‌పోవ‌డాన్ని వైసీపీ వ‌ర్గాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయి.

ఈ వ్య‌వ‌హారంలో మార్పులు చేయాల్సి వ‌స్తే దానికి త‌గ్గ‌ట్టుగా వెంట‌నే చర్య‌లు తీసుకోవాల‌ని కొంద‌రు నేత‌లు జ‌గ‌న్ మీద ఒత్తిడి తెస్తున్న‌ట్టు కూడా చెబుతున్నారు. ఇప్ప‌టికే కార్య‌క్ర‌మాల విష‌యంలో కొన్ని మార్పులు జ‌రుగుతున్న త‌రుణంలో అవి మ‌రింత వేగ‌వంత‌మ‌యితే మాత్రం అనూహ్యంగానే భావించాలి. ఇప్ప‌టికే కోఆర్డినేట‌ర్ల విష‌యంలో సంచ‌లన నిర్ణ‌యాలు తీసుకుంటున్న జ‌గ‌న్, సొంత మీడియా సంస్థ విష‌యంలో కూడా అలాంటి నిర్ణ‌యాల‌కు శ్రీకారం చుడితే మాత్రం నేమాని భాస్క‌ర్ స‌హా మ‌రింత మందికి ప్రాధాన్య‌త పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. చూడాలి…ఏం జ‌ర‌బోతుందో..!






Related News

మీడియా య‌జ‌మానుల రెండు నాలుక‌ల ధోర‌ణి

Spread the loveతెలుగు ప‌త్రిక‌లు మూకుమ్మ‌డి నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వ‌రుస‌గా అన్ని ప‌త్రిక‌లు ధ‌ర‌లు పెంచేశాయి. తొలుత ఈనాడుRead More

వైసీపీని క‌ట్ట‌డి చేసే వ్యూహంలో టీడీపీ అడుగులు

Spread the loveప్ర‌ధాన స్ర‌వంతి మీడియాలో టీడీపీదే ఆధిప‌త్యం.ఇ టీవ‌ల కొన్ని చానెళ్ల‌లో మార్పులు సంభ‌వించినా తెలుగుదేశానికి పెద్ద‌గా ఢోకాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *